Raja Reddy Engagement : రేపే షర్మిల కొడుకు ఎంగేజ్ మెంట్.. జగన్ కుటుంబం వస్తోందా ?

వైఎస్ షర్మిల (YS Sharmila) కొడుకు పెళ్ళి నిశ్చితార్థం (son's wedding) జనవరి 18న హైదరాబాద్ లోని గోల్గొండ రిసార్ట్స్ లో జరగబోతోంది. రిసార్ట్స్ లో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ ఎంగేజ్ మెంట్ కు షర్మిల అన్న, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి (AP CM Jagan) హాజరవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. మంగళవారం నాడే షర్మిలకు ఏపీసీసీ పగ్గాలు అప్పజెప్పింది AICC. దాంతో ఆమె రెండు మూడు రోజుల్లో ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు తీసుకోబోతున్నారు.

వైఎస్ షర్మిల (YS Sharmila) కొడుకు పెళ్ళి నిశ్చితార్థం (son’s wedding) జనవరి 18న హైదరాబాద్ లోని గోల్గొండ రిసార్ట్స్ లో జరగబోతోంది. రిసార్ట్స్ లో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ ఎంగేజ్ మెంట్ కు షర్మిల అన్న, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి (AP CM Jagan) హాజరవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. మంగళవారం నాడే షర్మిలకు ఏపీసీసీ పగ్గాలు అప్పజెప్పింది AICC. దాంతో ఆమె రెండు మూడు రోజుల్లో ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు తీసుకోబోతున్నారు. అది కూడా జగన్ వ్యతిరేకించిన పార్టీకి ప్రెసిడెంట్ గా. కొంతకాలంగా అసలే అంతంత మాత్రంగా ఉన్న జగన్ – షర్మిల అన్నాచెల్లెళ్ళ బంధం ఇప్పుడు మరింత క్లిష్టంగా మారింది. ఈ టైమ్ లో షర్మిల కొడుకు ఎంగేజ్ మెంట్ జరుగుతుండటంతో.. ఈ వేడుకకు జగన్ వస్తారా.. రారా అన్నది రెండు రాష్ట్రాల్లోనూ ఆసక్తికరంగా మారింది.

జనవరి 18 నాడు గోల్కొండ రిసార్ట్స్ లో షర్మిల కొడుకు రాజారెడ్డి, ప్రియ ఎంగేజ్ మెంట్ జరుగుతోంది. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీని తర్వాత ఫిబ్రవరి 17న జోధ్ పూర్ లో పెళ్ళి,ఆ తర్వాత ఫిబ్రవరి 24న హైదరాబాద్ లో పోస్ట్ వెడ్డింగ్ రిసెప్షన్ కూడా ఉన్నాయి. ఈ రిసెప్షన్ శంషాబాద్ లోని ఫోర్ట్ గ్రాండ్ లో జరగబోతోంది. ఈ మూడు కార్యక్రమాలకు రాజకీయాలకతీతంగా అందరికీ ఇన్విటేషన్లు పంచారు షర్మిల. ఏపీ సీఎం జగన్, చంద్రబాబుతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్, కేటీఆర్ ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రముఖులు అందరికీ కార్డులు పంచినట్టు చెప్పారు. కొడుకు రాజారెడ్డిని వెంటబెట్టుకొని.. జగన్ ఇంటికి వెళ్ళి స్వయంగా ఆహ్వానించారు షర్మిల దంపతులు.

రాజకీయాలకతీతంగా ఈ ఆహ్వానాలను చూడాలని కూడా షర్మిల చెప్పారు. గురువారం జరిగే ఎంగేజ్ మెంట్ కు ఏపీ సీఎం జగన్ కుటుంబం హాజరవుతుందని తెలుస్తోంది. భార్య భారతితో కలసి ఆయన వస్తారని సమాచారం. అంతేకాకుండా.. వైఎస్ బంధు వర్గమంతా ఈ వేడుకలకు అటెండ్ అవుతున్నట్టు సమాచారం. ఇక అటు టీడీపీ నుంచి లోకేష్ హాజరవుతారని చెబుతున్నారు. పవన్ కల్యాణ్ వచ్చేది రానిది ఇంకా సమాచారం లేదు. వైఎస్ మరణం తర్వాత ఆ కుటుంబంలో జరుగుతున్న మొదటి శుభకార్యం కావడంతో రాజకీయాలకతీతంగా అందరూ హాజరవుతారని భావిస్తున్నారు. ఏపీలో ఎన్నికలకు దగ్గర పడటం.. మాటల యుద్ధం తారాస్థాయికి చేరిన ఈ టైమ్ లో.. అన్ని పార్టీల నేతలు ఒకరినొకరు కలుసుకుంటే రియాక్షన్ ఎలా ఉంటుంది అన్నదానిపై ఆసక్తి కనిపిస్తోంది.