Chandrababu Erra Srilakshmi : ఎక్కడో ఉండాల్సిన దానివి? ఇలా ఎందుకు మిగిలావు…?

మధ్యతరగతి కుటుంబం. చిన్నప్పటినుంచి క్రమశిక్షణతో కూడిన జీవితం. రాత్రి పగలు కష్టపడి చదివి, ఐఏఎస్ సాధించింది. ఇండియాలో టాప్ ర్యాంకర్స్ లో ఆమె ఒకరు. 22 ఏళ్ళ కె ఐఏఎస్ అధికారి అయింది.

మధ్యతరగతి కుటుంబం. చిన్నప్పటినుంచి క్రమశిక్షణతో కూడిన జీవితం. రాత్రి పగలు కష్టపడి చదివి, ఐఏఎస్ సాధించింది. ఇండియాలో టాప్ ర్యాంకర్స్ లో ఆమె ఒకరు. 22 ఏళ్ళ కె ఐఏఎస్ అధికారి అయింది. సినిమాల్లో చూపించినట్లు సొంత రాష్ట్రంలో, సొంత జిల్లాలో పోస్టింగ్. తెలివైన, చురుకైన అధికారినిగా పేరు తెచ్చుకుంది. తలరాత బాగుంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో క్యాబినెట్ సెక్రెటరీ అయ్యుండేది. ఐఏఎస్ లకి అత్యున్నతమైన స్థానాన్ని పొంది ఉండేది. కానీ అలా జరగలేదు. అవినీతి, అత్యాశ, అక్రమార్చన, తో పాటు జగన్ లాంటి రాజకీయవేత్తలతో అంటకాగి చివరికి ఉద్యోగాన్ని, కెరీర్ నీ, వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేసుకుంది. ఆమె ఎవరో కాదు సీనియర్ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి.

ఎర్ర శ్రీలక్ష్మి… పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నివాసి.. తండ్రి రైల్వే ఉద్యోగి. శ్రీలక్ష్మి కి ఒక సోదరి. ఆమెది మధ్యతరగతి కుటుంబం. తండ్రి రైల్వే ఉద్యోగంపై దేశమంతా తిరుగుతుంటే, తల్లి ఆలన పాలనలో శ్రీ లక్ష్మీ, ఆమె చెల్లెలు బాధ్యతగా పెరిగారు. ఏలూరు కే పి డి టి హైస్కూల్లో టెన్త్ వరకు చదివారు శ్రీలక్ష్మి. చిన్నప్పుడు నుంచి కాస్త తక్కువ మాట్లాడడం, గంటలు తరబడి లైబ్రరీలో చదవడం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి వెళ్లడం ఇవన్నీ చూస్తే శ్రీ లక్ష్మీ ది పర్ఫెక్ట్ అనిపించక మానదు. పీజీ తర్వాత సివిల్స్ ప్రిపరేషన్ కోసం శ్రీలక్ష్మి పడని కష్టం లేదు. 1988 లో శ్రీలక్ష్మి ఇండియన్ సివిల్ సర్వీసెస్ కి సెలెక్ట్ అయ్యారు. 22 ఏళ్ల చిన్న వయసులో ఐఏఎస్ సాధించిన రికార్డు ఆమె ది. ఐఏఎస్ టాప్ ర్యాంకర్ కావడంతో సొంత రాష్ట్రంలోనే ఆమె కలెక్టర్ గా వచ్చారు. పలు జిల్లాల కు శ్రీలక్ష్మి కలెక్టర్గా పని చేశారు చురుకైన అధికారినీగా పేరు తెచ్చుకున్నారు.

ఐపీఎస్ అధికారి గోపికృష్ణను కులాంతర వివాహం చేసుకున్నారు శ్రీలక్ష్మి.. శ్రీలక్ష్మికి ఇద్దరు ఆడపిల్లలు. ప్రస్తుతం ఇద్దరు అమెరికాలోనే ఉన్నారు. గోపికృష్ణతో వివాహం శ్రీలక్ష్మి జీవితాన్ని చాలా మలుపులు తిప్పింది. అప్పటివరకు మంచి ఆఫీసర్ గా పేరు సంపాదించిన శ్రీలక్ష్మి ఫై క్రమంగా అవినీతి ఆరోపణలు మొదలయ్యాయి. భర్త గోపీనాథ్ ప్రభావంతో ప్రతి పనికి అక్రమంగా వసూలు చేస్తారని ఆఫీసర్స్ సర్కిల్స్లో బాగా టాక్ నడిచేది.

ముఖ్యంగా మంత్రులు, ముఖ్యమంత్రికి ఆమె అనుకూలంగా వ్యవహరిస్తారని, లాభం చేకూరితే ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెడతారని చెప్పుకునేవారు. వైయస్ మరణం తర్వాత, జగన్ అక్రమార్చన కేసుల్లో భాగంగా ఐఏఎస్ శ్రీలక్ష్మి జైలు పాలయ్యారు. వైయస్ హయాంలో ఆమె ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ సెక్రటరీగా చేశారు. ఆ సమయంలో గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబులాపురం మైనింగ్ కంపెనీకి అక్రమంగా అనుమతులు ఇచ్చారని శ్రీ లక్ష్మీ పై ప్రధాన ఆరోపణ. ఆ కేసులో అరెస్టై ఆమె నెలల తరబడి జైల్లో ఉండాల్సి వచ్చింది. జగన్, వైఎస్ ఒత్తిడితోనే గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కి ఆమె తోడ్పడ్డారని సిబిఐ ఆరోపించింది. జైల్లో ఉన్న సమయంలో శ్రీలక్ష్మి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. వెన్నుకు సంబంధించిన సమస్యతో ఆమె లేచి నిలబడే శక్తిని కూడా కోల్పోయారు. మొత్తం మీద హైకోర్టు శ్రీ లక్ష్మి నీ ఓఎంసీ బయట పడేసింది. కానీ శ్రీలక్ష్మి కెరీర్ ఆ కేసు వల్ల పూర్తిగా నాశనం అయింది.

ఆరోగ్యం కూడా బాగా క్షీణించింది. కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినా కూడా ఆమెపై అవినీతి ముద్ర చెరిగిపోలేదు. మళ్లీ ఆమెకు పోస్టింగ్ ఇచ్చిన సరే ప్రభుత్వాలు అన్ని శ్రీలక్ష్మి నీ లూప్ లైన్లోనే ఉంచయ్. రాష్ట్ర విభజన చరత తెలంగాణకే పరిమితమైన శ్రీలక్ష్మి, జగన్ అధికారంలోకి రాగానే తన ఏపీకి మార్చాలని కేంద్రానికి రిక్వెస్ట్ పెట్టుకున్నారు. జగన్ వల్లే ఆమె జైలుకెళ్లారు. అష్ట కష్టాలు పడ్డారు. డబ్బు సంపాదించినా కూడా ఆరోగ్యాన్ని, పరువు ని కోల్పోయారు. ఇన్ని జరిగినా కూడా శ్రీ లక్ష్మీ తిరిగి జగన్ తోనే ఉండాలనుకున్నారు. ఆమెను ఏపీకి బదిలీ చేయడానికి కేంద్రం నిరాకరించిన, జగన్ పట్టుబట్టి ఏకంగా ప్రధానితో మాట్లాడి శ్రీలక్ష్మిని ఆంధ్రప్రదేశ్ కు తెచ్చుకున్నారు. ఒక ఐఏఎస్ అధికారి కోసం ఒక ముఖ్యమంత్రి ఇంత పైరవీ చేయడం చరిత్రలో చాలా తక్కువ సార్లు జరిగింది. బహుశా ఇక నేమో శ్రీలక్ష్మి ఆ స్వామి భక్తి చూపించుకున్నారు. మళ్లీ తన పాత హవానే కొనసాగించారు.

జగన్ సర్కార్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తో పాటు మరికొన్ని కీలక శాఖలు నిర్వహించారు. ఎప్పటిలాగే ఆరోపణలు షరా మామూలే. ఎవరు ఊహించని విధంగా ఈ ఎన్నికల్లో జగన్ దారుణంగా ఓడిపోయి, హోదాను కూడా కోల్పోయారు. జగన్ కోటరీగా ముద్రపడిన ఐపీఎస్లు, ఐపీఎస్ లు అందరినీ చంద్రబాబు సర్కారు వేటాడటం మొదలుపెట్టింది. చంద్రబాబులో ఐఏఎస్ ల పట్ల ఎంత ద్వేషంగా ఉందంటే… కొత్త ముఖ్యమంత్రి అభినందించడానికి శ్రీ లక్ష్మీ వెళ్తే ఆమె ఇచ్చిన బొకేలు కూడా ఆయన తిరస్కరించాడు.
ఒక ఫైల్ పై సంతకానికి మంత్రి నారాయణ దగ్గరికి వెళ్తే ఆయన కూడా సంతకం పెట్టడానికి నిర్బంధంగా తోసి పు చ్చాడు. అది ఇప్పుడు శ్రీలక్ష్మి పరిస్థితి. ఐఏఎస్ ల బదిలీలు లో శ్రీలక్ష్మిని ఎటువంటి పోస్టు ఇవ్వకుండా ఏకంగా జి ఏ డి కి రిపోర్ట్ చేయమన్నారు. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి పరిస్థితి ఇలా అయిపోయింది. కొందరు ఉద్యోగులు శ్రీలక్ష్మికి తిక్క కుదిరిందని సంతోషపడుతుంటే… ఇంత తెలివైన చురుకైన ఆఫీసర్ పరిస్థితి ఇలా దిగజారిపోయిందేంటని కొందరు బాధపడుతున్నారు. శ్రీలక్ష్మి సర్వీసు అంతా సక్రమంగా జరిగి ఉంటే ఆమె ఈరోజు కేంద్రంలో క్యాబినెట్ సెక్రెటరీ హోదాలో ఉండేవారు. అవినీతి ఆరోపణలు, కేసులు, జైలు జీవితం, నెగిటివ్ రిపోర్ట్లు..

వీటి పుణ్యమా అని శ్రీలక్ష్మి కెరీర్ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. ఏ రకంగానూ శ్రీలక్ష్మి కి ఉద్యోగంలో ఉన్నత స్థాయికి ఎరగడం ఇక కష్టమే. రాజకీయ నేతలతోనూ, మంత్రులు ముఖ్యమంత్రులతో అంట కాగితే బతుకులు ఎలాగా అయిపోతాయో ఒక ఉదాహరణ శ్రీ లక్ష్మీ జీవితం. బాబు సర్కారు శ్రీలక్ష్మిని ఎంతగా ఆడుకోవాలో అంతగా ఆడుకుంటుంది. పోస్టింగ్ ఇచ్చినా కూడా ఎక్కడో పనికిరాని శాఖలు పడేస్తుంది. అవినీతి ఆరోపణలపై ఎంక్వయిరీలు అంటుంది. ఆమె సంతకం చేసిన ఫైలుపై దర్యాప్తులో జరుగుతాయి. రిటైర్మెంట్ జీవితంలో కూడా ఆమెకి ఇబ్బందులు తప్పవు. కారణం ఎవరైనా కావచ్చు… ఏదైనా కావచ్చు… భర్త ప్రభావం కావచ్చు శ్రీలక్ష్మి జీవితం దయానియంగా ముగుస్తుంది. పొలిటికల్ సిస్టంతో అతిగా పులుముకుంటే అధికారుల జీవితాలు ఎలా ఆగం అయిపోతాయండానికి ఐఏఎస్ శ్రీలక్ష్మి జీవితమే ఒక ఉదాహరణ..