సినిమా వాళ్ళతో రాజకీయ నాయకుల స్నేహం పెద్ద హాట్ టాపిక్ కాదు గాని… ఓ స్నేహం మాత్రం సినీ, రాజకీయ వర్గాలను ఓ రేంజ్ లో షేక్ చేసింది. అదే… ఐకాన్ స్టార్ అల్లు, వైసీపీ యంగ్ లీడర్ శిల్పా రవిచంద్ర స్నేహం. శిల్పా కోసం అల్లు అర్జున్… నంద్యాల వెళ్లి ప్రచారం చేయడం ఎలక్షన్ టైం లో సంచలనం అయింది. ఆ టైం లో బన్నీపై పోలీసులు ఓ కేసు కూడా నమోదు చేసారు. అసలు అల్లు అర్జున్ ఎందుకు ప్రచారం చేసాడో గాని… అక్కడి నుంచి మెగా ఫ్యామిలీకి బన్నీకి మధ్య గ్యాప్ పీక్స్ లో పెరిగింది.
అల్లు అర్జున్ విషయంలో మెగా ఫ్యాన్స్ ఇప్పుడు టార్గెట్ చేసి కామెంట్స్ చేయడానికి ఆ ప్రచారమే కారణం. జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ బరిలో ఉంటే… ఆయనను కాదని అసలు ఏ విధంగా వైసీపీ అభ్యర్ధికి బన్నీ ప్రచారం చేస్తాడని… అసలు తన ఫ్రెండ్ కాదు… తన వైఫ్ ఫ్రెండ్ భర్త అంత ఇంపార్టెంట్ అయ్యాడా అంటూ సోషల్ మీడియాలో తీవ్ర కామెంట్స్ చేసారు ఫ్యాన్స్. ఇది బన్నీ తెలివి అని కొందరు అంటే… మెచ్యూరిటీ లేని కార్యక్రమం అంటూ మరికొందరు కామెంట్ చేసారు. దీనిపై బన్నీ వివరణ ఇచ్చినా జనాలు మాత్రం కూల్ అవ్వలేదు అనే చెప్పాలి.
ఇదే టైం లో టీడీపీ వాళ్ళు కూడా బన్నీపై విమర్శలు చేయడంతో వైసీపీ అభిమానులు అల్లు అర్జున్ కు అండగా నిలబడ్డారు. ఇక అప్పటి నుంచి ఈ వివాదం అలా కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు… పుష్ప 2 ట్రైలర్ కు శిల్పా రవి ఫిదా అయిపోయాడు. ఈ విషయాన్ని ట్వీట్ చేసి మరీ చెప్పాడు. పుష్ప టీంకు అభినందనలు చెప్తూ విష్ కూడా చేసాడు. ఈ ట్వీట్ కు బన్నీ కూడా రిప్లై ఇస్తూ నీ ప్రేమకు అభినందనలు బ్రదర్ అంటూ కామెంట్ చేసాడు. ఈ ట్వీట్ ను బన్నీ ఫ్యాన్స్ కంటే వైసీపీ కార్యకర్తలు ఎక్కువగా వైరల్ చేస్తున్నారు.
పుష్ప ట్రైలర్ తర్వాత మెగా వర్సెస్ అల్లు యుద్ధం పీక్స్ కు వెళ్ళింది. ఈ టైం లో వైసీపీ సోషల్ మీడియా బన్నీకి ఓ రేంజ్ లో సపోర్ట్ చేస్తూ టాలీవుడ్ లో అతన్ని ఒంటరిని చేసారని బాధ కూడా పడింది. మెగా ఫ్యామిలీ నుంచి వేరు చేసారనే కామెంట్స్ బోనస్. పుష్ప 2 విషయంలో మెగా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండానే బన్నీ ప్రమోషన్స్ చేసుకుంటున్నాడు. హైదరాబాద్ ఈవెంట్ కు ముందు పవన్ కళ్యాణ్ ను ఇన్వైట్ చేసే ఛాన్స్ ఉందని అందరూ భావించినా… అతి కొద్ది మందిని మాత్రమే ఇన్వైట్ చేస్తున్నాడు.