Smita Sabharwal: తెలంగాణకు స్మితా సబర్వాల్‌ బైబై! ఆమ్రపాలి స్థానంలోకి వెళ్తారా..

రేవంత్‌ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అందరు అధికారులు వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిస్తే.. స్మిత సబర్వాల్‌ మాత్రం దూరంగా ఉన్నారు. దీంతో ఆమె బదిలీ ఖాయం అనే చర్చ మొదలైంది.

  • Written By:
  • Publish Date - December 13, 2023 / 02:25 PM IST

Smita Sabharwal: తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత.. కొత్త టీమ్ ఏర్పాటు చేసుకునే పనిలో రేవంత్‌ ఉన్నారు. సీఎం ఆఫీసులో పనిచేసే అధికారుల ఎంపికపై దృష్టి సారించారు. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక అధికారులకు ట్రాన్స్‌ఫర్‌ మొదలైంది. త్వరలోనే ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో మూడు కమిషనరేట్ల పరిధిలో కమిషనర్లు బదిలీ అయ్యారు. శాఖల సమీక్షలు పూర్తి కాగానే బదిలీలు ఉంటాయన్న చర్చ వినిపిస్తోంది.

New Parliament : కొత్త పార్లమెంట్ లో భద్రతా వైఫల్యం.. టియర్ గ్యాస్ ప్రయోగించిన అగంతకులు

ఒకే స్థానంలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న అధికారులకు స్థాన చలనం ఉంటుందనే చర్చ మొదలైంది. ఇదంతా ఎలా ఉన్నా.. ఈ మధ్య ఐఏఎస్‌ ఆమ్రపాలి వచ్చి సీఎం రేవంత్‌ను కలిశారు. ప్రస్తుతం డిప్యుటేషన్ మీద సెంట్రల్ సర్వీసెస్‌లో ఉన్న ఆమ్రపాలి.. త్వరలో తెలంగాణకు రావడం ఖాయం అనే చర్చ మొదలైంది. స్మితా సబర్వాల్ స్థానంలో ఆమ్రపాలిని తీసుకుంటారనే టాక్‌ నడుస్తోంది. ఇక అటు స్మితా సబర్వాల్‌ తీరు ఈ వాదనను మరింత బలపరిచింది. రేవంత్‌ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అందరు అధికారులు వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిస్తే.. స్మిత సబర్వాల్‌ మాత్రం దూరంగా ఉన్నారు. దీంతో ఆమె బదిలీ ఖాయం అనే చర్చ మొదలైంది. ఇలాంటి పరిణామాల మధ్య.. ఇప్పుడు స్మిత చేసిన ట్వీట్‌ మరింత ఆసక్తి రేపుతోంది. సెంట్రల్‌ సర్వీసుల్లోకి వెళ్లేందుకు స్మితా సబర్వాల్‌ దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు.

స్మితా సబర్వాల్‌ చేసిన ట్వీట్‌ ఇప్పుడు చాలా ప్రశ్నలు లేవనెత్తుతోంది. తన 23 ఏళ్ల కెరీర్‌ ప్రస్తావిస్తూ.. స్మితా ఓ ఫొటో షేర్‌ చేశారు. కొత్త ఛాలెంజ్‌కు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నానని.. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు అంటూ కామెంట్స్‌ చేశారు. దీంతో ఆమె మాటలు ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతున్నాయ్. ఇక అటు సెంట్రల్ సర్వీసుల్లోకి వెళ్లేందుకు స్మిత దరఖాస్తు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇదంతా ఓ ట్వీట్ చుట్టూ జరుగుతున్న ప్రచారం మాత్రమే.. అసలు నిజం ఏంటి.. ఏం జరుగుతుందన్నది కాలమే సమాధానం చెప్పాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు మరికొందరు.