Smita Sabharwal: నాకు ఆ ఉద్యోగం వద్దు.. ప్రభుత్వానికి ఎదురు తిరిగిన స్మితా సబర్వాల్‌..

కొత్త సీఎంను కలవడం కాదు కదా.. అసలు సెక్రటేరియట్‌కు కూడా స్మిత చాలా రోజులు రాలేదు. దీంతో స్మితను తెలంగాణ నుంచి ట్రాన్స్‌ఫర్‌ చేయబోతున్నారు అంటూ వాదనలు మొదలయ్యాయి.

  • Written By:
  • Publish Date - December 20, 2023 / 01:41 PM IST

Smita Sabharwal: తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొన్ని రోజుల పాటు ఐఏఎస్‌ ఆఫీసర్‌ స్మిత సబర్వాల్‌ హాట్‌ టాపిక్‌గా మారారు. కొత్త సీఎంను కలవడం కాదు కదా.. అసలు సెక్రటేరియట్‌కు కూడా స్మిత చాలా రోజులు రాలేదు. దీంతో స్మితను తెలంగాణ నుంచి ట్రాన్స్‌ఫర్‌ చేయబోతున్నారు అంటూ వాదనలు మొదలయ్యాయి. మొదట్లో సైలెంట్‌గానే ఉన్నా.. తరువాత స్మిత స్వయంగా ఈ వార్తలపై స్పందించారు.

RAJINI SAICHAND: రేవంత్‌ నాకు బాబాయి అవుతాడు.. బాంబు పేల్చిన సాయిచంద్‌ భార్య రజినీ..

తాను ఎక్కడికి వెల్లడంలేదని.. తెలంగాణలోనే తన సేవలు కొనసాగిస్తానని చెప్పారు. మంత్రులు సెక్రటేరియట్‌లో బాధ్యతలు స్వీకరించే రోజు సెక్రటేరియట్‌కు వచ్చారు. దీంతో అంతా సర్దుకుంది. రీసెంట్‌గానే స్మితా సబర్వాల్‌కు ప్రభుత్వం బాధ్యతలు కూడా కేటాయించింది. గత ప్రభుత్వంలో సీఎంకు కార్యదర్శిగా వ్యవహరించిన.. స్మిత ఇప్పుడు మిషన్‌ భగీరథ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఈ బాధ్యతలతో పాటు.. ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ సెక్రెటరీగా అదనపు బాధ్యతలు కూడా కేటాయించింది కాంగ్రెస్‌ ప్రభుత్వం. అయితే ఈ అదనపు బాధ్యతలు తీసుకోవడం ఇష్టం లేని స్మిత సబర్వాల్‌.. సెక్రటేరియట్‌కు రావడం మానేశారట. కొన్ని రోజుల నుంచి ఇరిగేషన్‌ శాఖలో జరిగే ఏ రివ్యూ మీటింగ్‌కు ఆవిడ హాజరు కావడంలేదట.

ఇదే విషయంపై ఇరిగేషన్‌ మినిస్టర్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరా తీయగా.. డిపార్ట్‌మెంట్‌లో ఉన్న అధికారులు అసలు విషయం చెప్పారట. అదనపు బాధ్యతలు చేపట్టే విషయంలో స్మిత అయిష్టంగా ఉన్నారని.. ఆ కారణంగానే మీటింగ్‌లకు రావడంలేదని చెప్పారట. డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన ఫైల్స్‌ మీద కూడా స్మిత సంతకాలు చేయడంలేదట. దీంతో స్మితపై చర్యలు తప్పువు అనే వాదన మరోసారి మొదలైంది. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.