హై స్పీడ్ ఇంటర్నెట్ కూడా అందుబాటులో ఉండటంతో చాలామంది పొలిటీషియన్స్ ఇప్పుడు సోషల్ మీడియాను బీభత్సంగా వాడేస్తున్నారు. ఏకంగా రాష్ట్ర ముఖ్యంమంత్రులే స్వయంగా తమ నేతలకు సోషల్ మీడియాను వాడుకోవాలని చెప్తున్నారు. సెపరేట్‌గా పబ్లిక్ రిలేషన్ టీంలను పెట్టుకోవాలని సూచిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు ఉండటంతో దాదాపు అన్ని పార్టీలు సోషల్ మీడియాను ప్రధాన ప్రచార వేదికగా మార్చుకుంటున్నాయి. ఇప్పుడు ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉండటం.. షేర్ చేసే ప్రతీ ఇష్యూ దాదాపు అందరికీ రీచ్ అవుతుండటంతో.. ప్రచారానికి సోషల్ మీడియానే బెస్ట్ అనుకుంటున్నాయి.
మొన్న కేసీఆర్, నిన్న కేటీఆర్, ఇవాళ జగన్, రేపు చంద్రబాబు. పేరు ఏదైనా.. ప్లేస్ ఎక్కడైనా.. ప్రజలకు దగ్గరగా వెళ్లేందుకు ఇప్పుడు వాళ్లు కామన్‌గా వాడుతున్న మీడియం.. సోషల్ మీడియా. నీట్‌గా వాడుకుంటే సోషల్ మీడియాతో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎవరు దాన్ని సక్రమంగా వాడటంలేదు. తమ ఎజెండాను ప్రజల్లోకి పంపేందుకు సోషల్ మీడియాను వాడమంటే.. ప్రతిపక్షాలను టార్గెట్ చేసేందుకు వాడుతున్నారు. రీసెంట్‌గా ఏపీలో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, నారా లోకేష్ మధ్య ఇలాగే ట్వీట్లు, వీడియోల వార్ జరిగింది. గతంలో బీఆర్‌ఎస్,కాంగ్రెస్ నేతలు కూడా ఒకరికి ఒకరు సవాళ్లు చేసుకుంటూ ట్వీట్లు చేసుకున్నారు.
ఒకరి తప్పులను ఒకరు సోషల్ మీడియా వేదికగా బయపెట్టుకున్నారు. మర్వాడి మర్వాడి కొట్టుకుంటే పాత బంగారం రేటు బయటపడ్డట్టు.. వాళ్లు వాళ్లు తిట్టుకుని ఒకరి లొసుగులు ఒకరు బయట పెట్టుకుంటున్నారు. ప్రజలకు దగ్గరవ్వడం కంటే ప్రతిపక్షాలను ఎండగట్టేందుకే సోషల్ మీడియా వాళ్లకు ఎక్కువగా యూజ్ అవుతోంది. సవాళ్లు ప్రతిసవాళ్లతో ఫేస్‌బుక్, ట్విటర్‌లు నిండిపోతున్నాయి. కొందరు నాయకులైతే సెపరేట్‌గా ఎంప్లాయిస్‌ను పెట్టుకుని మరీ ప్రతిపక్షాల మీద విమర్శలు, వింత వింత వీడియోలు విసురుతున్నారు. ట్రోల్స్ చేసుకుంటూ ఒకరి పరువు ఒకరు తీసుకుంటున్నారు తప్పితే ప్రజలకు యూజ్ అయ్యే మ్యాటర్ ఒక్కటి కూడా షేర్ చేయడంలేదు. ఈ మాత్రానికి అసలు సోషల్ మీడియా ఎందుకు వాడుతున్నారంటూ క్వశ్చన్ చేస్తున్నారు పబ్లిక్.