TDP : టీడీపీలో నంబర్ 2 ఆయనే.. షరతులు వర్తిస్తాయి..!

జూనియర్ ఎన్టీఆర్ ను టీడీపీలోకి తీసుకుంటే.. పార్టీకి గ్లామర్ వస్తుందని, జగన్ ను సులభంగా ఢీకొనవచ్చనే అభిప్రాయంతో కొందరు టీడీపీ లీడర్లు ఉన్నారట. వచ్చే ఎన్నికల తరువాత రాజకీయాలకు గుడ్ బై చెబుతానని బాబు ప్రకటన.

టీడీపీకి ఇది టెస్టింగ్ టైం.. 

అన్నీ తానై సైకిల్ పార్టీని ముందుకు నడిపిన చంద్రబాబు జైలుకు వెళ్లడంతో తొలిసారిగా టీడీపీ పెద్ద సవాల్ ను ఎదుర్కొంటోంది. చంద్రబాబు స్థాయి కలిగిన నాయకుడు లేని లోటు పార్టీలో స్పష్టంగా కనిపిస్తోంది. సూటిగా చెప్పాలంటే వైఎస్ జగన్ ను ఢీకొనే స్థాయి కలిగిన రెండో లీడర్ టీడీపీలో లేడనే విషయం తేటతెల్లం అవుతోంది. వైఎస్ జగన్ కూడా ఇలాంటి సంక్షోభాలను గతంలో ఎదుర్కొన్నారు. వివిధ కేసుల్లో ఇరుక్కొని 16 నెలలు జైలులో ఉండొచ్చారు. అయినా ఆ సంక్షోభాన్ని చక్కగా మ్యానేజ్ చేసుకొని సీఎం సీటు దాకా రాగలిగారు. ఇప్పుడు అదే పరిస్థితిని టీడీపీ ఎదుర్కొంటోంది. అయితే ఈ సిచ్యువేషన్ ను సైకిల్ పార్టీ ఎలా మ్యానేజ్ చేస్తుంది ? అనేదే ఇప్పుడున్న పెద్ద ప్రశ్న.

టీడీపీలో నంబర్ 2 గా బాలయ్య నేనా..?

వాస్తవానికి టీడీపీపై పట్టు వచ్చినప్పటి నుంచి ఏ దశలోనూ చంద్రబాబు.. నందమూరి ఫ్యామిలీలో ఎవరికీ పార్టీలో కీలకమైన ఛాన్స్ దక్కకుండా జాగ్రత్తపడ్డారు. వియ్యం అందిన తర్వాతి నుంచే నందమూరి బాలకృష్ణకు టీడీపీలో ప్రయారిటీ ఇవ్వడం మొదలుపెట్టారు. ఇప్పుడు నారా లోకేశ్ కే పగ్గాలు ఇవ్వాలని చంద్రబాబుకు ఉన్నప్పటికీ.. అలా చేస్తే నందమూరి ఫ్యామిలీ తనకు పూర్తిగా దూరం అవుతుందనే కలవరం ఉంది. పైగా సీఎం జగన్ ను పాలిటిక్స్ లో డైనమిక్ గా ఢీకొనడం అంత ఈజీ విషయమేం కాదు. అందుకే బాలయ్య బాబు ఇప్పుడు టీడీపీలో నంబర్ 2గా కనిపిస్తున్నారు. బాబు అరెస్ట్ అయిన తర్వాతి నుంచి పార్టీ వ్యవహారాల్లో బాలకృష్ణ ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తున్నారు. తాజాగా మంగళగిరి పార్టీ ఆఫీస్ లో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ‘‘ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు.. చంద్రబాబుకు సానుభూతి తెలిపిన ప్రతిఒక్కరినీ కలుస్తా’’ అని ఆయన చెప్పుకొచ్చారు. అయితే బాలయ్యకు రాజకీయ అంశాలపై వేగంగా నిర్ణయాలు తీసుకొనే నైపుణ్యం లేదనే వాదన ఉంది.

నంబర్ 2 ప్లేస్ రేస్ లో బాలయ్య, లోకేశ్..

లోకేశ్ కు, టీడీపీలో కొందరు సీనియర్లకు మధ్య గ్యాప్ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీనియర్లకున్న వయసు, అనుభవం రీత్యా వారికి లోకేశ్ మార్గనిర్దేశం చేయలేని పరిస్థితి ఉందని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను టీడీపీలోకి తీసుకుంటే.. పార్టీకి గ్లామర్ వస్తుందని, జగన్ ను సులభంగా ఢీకొనవచ్చనే అభిప్రాయంతో కొందరు టీడీపీ లీడర్లు ఉన్నారట. వచ్చే ఎన్నికల తరువాత రాజకీయాలకు గుడ్ బై చెబుతానని బాబు ప్రకటించిన నేపథ్యంలో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకే బాలయ్య ట్రై చేస్తున్నారని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక తండ్రి బాధ్యతను తీసుకోవాలనే ఉత్సాహం నారా లోకేష్ కు కూడా ఉంది. పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు ఏపీలో పెద్దగా క్యాడర్ లేదు. అందుకే క్యాడర్ లేని బీజేపీ కంటే.. క్యాడర్ ఉన్న టీడీపీతో కలిస్తే ఎక్కువ లాభమని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారట. ఫ్యూచర్ లో టీడీపీ అధికారంలోకి వస్తే తనకు కనీసం ఏదైనా నామినేటెడ్ పదవైనా ఇస్తుందనే ఆశతో పవన్ ఉన్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈవిధంగా ఓ వైపు టీడీపీలో నంబర్ 2 ప్లేస్ రేస్ లో బాలయ్య బాబు, లోకేశ్ బాబు ఉండగా.. మరోవైపు పవన్ కళ్యాన్ టీడీపీకి మిత్రపక్షంగా ఆవిర్భవించి లబ్ధి పొందాలనే కుతూహలంలో ఉంది.