Chhattisgarh: సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌లాంటి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో.. నాలుగు రాష్ట్రాల్లో ఫలితం వచ్చేసింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా.. మిజోరంలో కౌంటింగ్ వాయిదా పడింది. తెలంగాణ, ఛత్తీస్‌ఘడ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో ఓట్ల లెక్కింపు జరగగా.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మిగిలిన మూడు రాష్ట్రాల్లో కమలం పార్టీ పాగా వేసింది. క్లియర్‌కట్ మెజారిటీతో.. బీజేపీ ఆ రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ సంగతి ఎలా ఉన్నా.. ఛత్తీస్‌గఢ్‌లో ఐదేళ్ల కాంగ్రెస్ పాలనకు జనాలు గుడ్‌బై చెప్పారు.
BRS: బీఆర్‌ఎస్ ఒక్కసారి కూడా గెలవని స్థానాలు ఇవే..
ఆ రాష్ట్ర ఫలితాల్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అక్కడ ఓ రోజువారీ కూలీ.. ఏకంగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించి హిస్టరీ క్రియేట్ చేశాడు. ఈశ్వర్ సాహు అనే వ్యక్తి.. రోజూ కూలీ పనులు చేస్తూ.. కుటుంబాన్ని పోషించుకుంటాడు. కాంగ్రెస్ సర్కార్ హయాంలో ఆయన కొడుకు దారుణ హత్యకు గురయ్యాడు. సాహు కుమారుడిని కొందరు మూకుమ్మడిగా దాడి చేసి.. హత్య చేశారు. ఐతే ఈ కేసులో దోషులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై సాహు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇదే చాన్స్ అనుకున్న బీజేపీ పెద్దలు.. వ్యూహాత్మకంగా వ్యవహరించారు. సాహుని సాజా అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దింపారు. అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే రవీంద్ర చౌబేపై ఈశ్వర్ పోటీపడ్డాడు. రవీంద్ర చౌబే గతంలో ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
ఐతే ఇక్కడ బీజేపీ స్ట్రాటజీ సూపర్ సక్సెస్ అయింది. రవీంద్రపై ఈశ్వర్ 5వేల ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించాడు. కమలం పార్టీలో జోష్ నింపాడు. కాంగ్రెస్ సర్కార్ బాధితుడు అయిన ఓ కూలీని తెరమీదకు తీసుకురావడం ఏంటి.. ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం ఏంటి.. ఏడుసార్లు ఎమ్మెల్యే అయిన అభ్యర్థిని ఆయన ఓడించడం ఏంటి.. బీజేపీ వ్యూహం మాములుగా లేదుగా అంటూ.. సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది.