Mudragada Padmanabham : త్వరలో వైసీపీ లోకి ముద్రగడ.. పవన్ పై నిలబడతాడా ?

కాపులకు రిజర్వేషన్లు కావాలంటూ.. టీడీపీ హయాంలో ఉద్యమం చేసిన ముద్రగడ పద్మనాభం.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ ఉద్యమం ఊసే లేదు. 2009 ఎన్నికల్లో ఓడిపోయాక ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పేసిన ముద్రగడ.. ప్రస్తుతం పొలిటికల్‌ ఉక్కపోత భరించలేక ఫ్యాన్ కిందికి రావాలనుకుంటున్నారట. ఈ క్రమంలోనే.. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆసక్తి చూపినా.. పార్టీ పెద్దలు మాత్రం ఆయనను వేరే విధంగా కన్విన్స్ చేస్తున్నట్టు తెలిసింది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబుని పక్కన పెట్టేసింది అధికార పార్టీ. ఎంపీ వంగా గీతను పిఠాపురం బరిలోకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ఇక్కడి నుంచి పోటీ చేస్తారని తొలుత జోరుగా ప్రచారం జరిగింది. అదే నిజమైతే ఆయన మీద వైసీపీ అభ్యర్థిగా ముద్రగడను నిలబెడతారని అనుకున్నారు అంతా. కానీ.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పవన్‌ పిఠాపురంవైపు చూసే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. వైసీపీ పెద్దలు సైతం ముద్రగడను అదే పాయింట్‌ మీద కన్విన్స్‌ చేస్తున్నారట. జనసేన అధినేత పోటీ చేస్తానంటే కదా.. మీరు పోటీ చేసేది. ప్రస్తుతానికి పిక్చర్ అలాలేదు కాబట్టి మీరు మా దారిలోకి రావాలని వర్తమానం అందించినట్టు తెలిసింది. పాత శపథం ప్రకారం ప్రత్తిపాడులో ఆయన ఎలాగూ పోటీ చేయరు, అక్కడ సిట్టింగ్‌కు సీటు ఉండబోదని కూడా తేలిపోయింది కాబట్టి ఆ సెగ్మెంట్‌ వరకు ప్రత్యామ్నాయం వెదుకుతున్నారట వైసీపీ పెద్దలు. అన్నీ అనుకూలించి ఓకే అనుకుంటే.. ముద్రగడ పద్మనాభం చిన్న కుమారుడికి ప్రత్తిపాడు సీటు ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తామని చెప్పారట పార్టీ పెద్దలు.
అదే సమయంలో మీరు అన్ కండీషనల్‌గా పార్టీలో చేరితేనే అన్ లిమిటెడ్ వెయిటేజ్ ఉంటుందని కొసమెరుపు కూడా ఇచ్చినట్టు తెలిసింది. చివరిగా పద్మనాభం కోసం కాకినాడ పార్లమెంటు సీటు పరిశీలనలో ఉన్నప్పటికీ అందుకాయన ఆసక్తి చూపడం లేదంటున్నారు.

పార్లమెంట్ సీటు పరిధిలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థుల సైతం దానిపై రకరకాల వాదనలు తెర పైకి తీసుకొస్తున్నారు.. అక్కడ ఆ ఫ్యామిలీ నుంచి పోటీ చేయకపోవడమే బెటరని అంటున్నారట. మొత్తానికి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరడమైతే ఖాయమైపోయింది. సీటు, పోటీ తర్వాతి మేటర్స్‌. దాదాపు 15 ఏళ్ల తర్వాత పొలిటికల్ స్క్రీన్ పై యాక్టివ్ అవబోతున్నారాయన. దానికి తగ్గట్టుగా కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కూడా దాదాపుగా పూర్తయిపోయాయి. ఇక రాబోయే రోజుల్లో ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తి చేసుకుని ఏ విధంగా పిక్చర్ చూపిస్తారో తేలాల్సి ఉందంటున్నారు పరిశీలకులు. ఆ పిక్చర్‌ నేరుగా థియేటర్‌ రిలీజై బ్లాక్‌ బస్టర్‌ అవుతుందా.. లేక ఓటీటీకే పరిమితమవుతుందా అన్నది చూడాలి. పద్మనాభం మనస్తత్వం ప్రకారం చూసుకుంటే.. అసలు అదీ ఇదీ కాదని చివరి నిమిషంలో ట్విస్ట్‌లు ఏమైనా ఉంటాయా అన్న డౌట్స్‌ కూడా ఉన్నాయట రాజకీయ వర్గాల్లో.