SRINIVAS GOUD: ఇదేం దొంగపని.. ఫర్నీచర్ ఎత్తుకుపోతూ దొరికిపోయిన శ్రీనివాస్ గౌడ్..

రవీంద్రభారతిలోని ఆఫీసు నుంచి ప్రభుత్వ ఫర్నిచర్ తరలించుకొని పోతున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సిబ్బందిని ఓయూ స్టూడెంట్స్ పట్టుకున్నారు. ఇన్నాళ్ళు ప్రజల సొమ్మును దోచుకుంది చాలదా.. కుర్చీలు, బల్లలు కూడా ఎత్తుకుపోతున్నారా అంటూ నిలదీశారు.

  • Written By:
  • Publish Date - December 6, 2023 / 07:10 PM IST

SRINIVAS GOUD: ప్రభుత్వం మారగానే.. బీఆర్ఎస్ మంత్రులంతా మాజీలు అయ్యారు. గురువారం కొత్త సర్కార్ కొలువుదీరుతోంది. దాంతో మాజీ మంత్రులు తమ పేషీలు, ఆఫీసులు ఖాళీ చేస్తున్నారు. వాళ్ళ సొంత సామాన్లు ఉంటే తీసుకుపోతే ఓకే. కానీ సర్కారీ సొత్తును కూడా తరలించుకుపోతున్నారు. రవీంద్రభారతిలోని ఆఫీసు నుంచి ప్రభుత్వ ఫర్నిచర్ తరలించుకొని పోతున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సిబ్బందిని ఓయూ స్టూడెంట్స్ పట్టుకున్నారు. ఇన్నాళ్ళు ప్రజల సొమ్మును దోచుకుంది చాలదా.. కుర్చీలు, బల్లలు కూడా ఎత్తుకుపోతున్నారా అంటూ నిలదీశారు.

REVANTH REDDY: ఈ ఇద్దరితో చిక్కులేనా..? రేవంత్‌కు చిక్కులు తప్పవా..?

ఈ క్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆఫీస్ దగ్గర పెద్ద గొడవ జరిగింది. ఆఫీస్ ఫర్నిచర్‌ను వెహికిల్‌లో తరలిస్తుండటంతో ఓయూ విద్యార్థి సంఘాల నేతలు వచ్చి అడ్డుకున్నారు. ఖరీదైన కుర్చీలు, బల్లలు, సోఫాలు అన్నీ వ్యాన్‌లో వేసుకొని వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. అయితే ఆ ఫర్నిచర్ గౌవర్నమెంట్‌ది అని తమకు తెలియదనీ, శ్రీనివాస్ గౌడ్ చెబితే పంపుతున్నామని అధికారులు అనడం విడ్డూరంగా అనిపించింది. కాగా.. మాజీ మంత్రుల పేషీలు ఖాళీ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలనీ.. ఏ వస్తువూ.. చిన్న కాగితం కూడా మిస్ కావొద్దని సీఎస్ శాంతికుమారి ఆదేశించినా.. అధికారుల్లో మాత్రం నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోంది.

ప్రభుత్వ సొమ్ము అంటే.. ప్రజల సొమ్ము.. అలాంటి సొమ్మును తరలించుకుపోతుంటే.. చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఓయూ జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.