Paripoornananda Swami: హిందూపురం పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేస్తా అంటున్నారు శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి. బీజేపీ నుంచి టిక్కెట్ వస్తుందని ఆశించిన ఆయనకు నిరాశే ఎదురైంది. అసలు హిందూపురం టిక్కెట్ రాకుండా చేసింది బాలక్రిష్ణ, చంద్రబాబు నాయుడే అంటున్నారు. హిందూపురం అసెంబ్లీ సీటులో కూడా స్వామీజీ పోటీ చేస్తుండటంతో.. ఆ ఎఫెక్ట్ బాలయ్యపై పడటం ఖాయమని టీడీపీ శ్రేణులు ఆందోళనలో ఉన్నాయి.
CHANDRABABU NAIDU: బాబూ.. ఇదేందయ్యా.. లిక్కర్‌కు బ్రాండ్ అంబాసిడర్ అయ్యావేంటి..?
బీజేపీలో ఉంటూనే.. హిందూపురంలో రెబల్‌గా పోటీ చేయబోతున్నారు పరిపూర్ణానంద స్వామి. హిందూపురం పార్లమెంట్ సీటు కోసం బీజేపీ అధిష్టానం నుంచి హామీ తెచ్చుకున్న స్వామీజీ.. ఆ నియోజకవర్గంలో నాలుగు నెలలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కమలం పార్టీ తరపున ఆయనకే టిక్కెట్ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా టీడీపీకి చెందిన బీకే పార్థసారధిని ఎంపీ సీటుకు ప్రకటించడం సంచలనంగా మారింది. పరిపూర్ణానందకు టిక్కెట్ రాకుండా అడ్డుపడింది నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణేనట. హిందూపురంలో మైనార్టీ ఓట్లు 60 వేల దాకా ఉన్నాయి. బీజేపీకి టిక్కెట్ ఇస్తే.. మైనార్టీ ఓట్లు పడవనీ.. అందువల్ల ఆ సీటు గెలవడం కష్టమని బాలకృష్ణ.. టీడీపీ అధినేత చంద్రబాబుకు చెప్పారట.
ఈ ఇద్దరి ఒతిడితోనే తనకు బీజేపీ పార్లమెంట్ టిక్కెట్ రాలేదన్నారు స్వామీజీ. తనకు పార్టీ టిక్కెట్ ఇవ్వకపోయినా.. ఇండిపెండెంట్‌గా అయినా బరిలోకి దిగుతానని అంటున్నారు. స్వామీజీ హిందూపురం అసెంబ్లీకి కూడా పోటీ చేస్తుండటంతో బాలకృష్ణపైనా ఆ ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు. స్వామీజీ రెండు స్థానాల్లో బరిలో ఉంటే.. ఎవరికి సపోర్ట్ చేయాలా అని టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు డైలమాలో పడ్డారు. మరి పరిపూర్ణనందని బీజేపీ అధిష్టానం బుజ్జగించి పోటీ నుంచి తప్పిస్తుందా.. ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నది చూడాలి.