T CONGRESS: రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెంచింది. అధికారంలో ఉన్న తెలంగాణలో అధిక సీట్లు గెలుచుకోవాలని ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా 17 సీట్లున్న తెలంగాణలో 14 సీట్లు గెలవాలని టార్గెట్‌గా పెట్టుకుంది. దీనికి అనుగుణంగా భారీ స్థాయిలో ప్రచారం నిర్వహించబోతుంది. ఏప్రిల్ మొదటి వారంలో హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతుంది.
Devineni Uma: రాజ్యసభకు ఉమా! దేవినేనికి చంద్రబాబు హామీ..
ఈ సభకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతోపాటు కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. పలువురు కాంగ్రెస్ అగ్రనేతలు కూడా ఈ సభకు హాజరవుతారు. ఈ సభలోనే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను కాంగ్రెస్ విడుదల చేయబోతుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ మేనిఫెస్టో విడుదల చేస్తారు. పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోను ఏఐసీసీ.. హైదరాబాద్‌లో రిలీజ్ చేయబోతుండటంతో టీ-కాంగ్రెస్ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా సభను భారీస్థాయిలో సక్సెస్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారీ జన సమీకరణకు సిద్ధమవుతోంది. ఆ తర్వాత వివిధ నియోజకవర్గాల్లోనూ రేవంత్ సహా మంత్రలు ప్రచారం నిర్వహించబోతున్నారు.
ఎన్నికల విషయంలోనూ నేతలు విబేధాలు పక్కనబెట్టి, కలిసికట్టుగా పని చేయాలని, కార్యకర్తల వెన్నంటి ఉండాలని నిర్ణయించుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ 9 మంది తెలంగాణ అభ్యర్థుల్ని ప్రకటించింది. మరో 8 స్థానాలను హస్తంపార్టీ అధిష్ఠానం పెండింగ్‌లో పెట్టింది. కరీంనగర్, మెదక్, హైదరాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్, భువనగిరి, నిజామాబాద్ ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.