T CONGRESS: ఓడిపోయినా కూడా వాళ్లే ఎమ్మెల్యేలా..? కాంగ్రెస్ సరికొత్త వ్యూహం..

ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో నిమిత్తం లేకుండా కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్ఛార్జ్‌లే పూర్తి స్థాయి బాస్‌లు కాబోతున్నారన్న చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో. ఇన్ఛార్జ్‌ల కనుసన్ననల్లోనే ప్రభుత్వ పథకాల అమలు, గ్రామసభలు అన్నీ జరగబోతున్నాయన్నది ఇంటర్నల్‌ టాక్‌.

  • Written By:
  • Publish Date - December 20, 2023 / 03:06 PM IST

T CONGRESS: కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన అంశాలపై పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మధ్య నడిచిన మాటలను వివిధ కోణాల్లో విశ్లేషిస్తున్నాయట పార్టీ వర్గాలు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఫిబ్రవరి నుంచి పూర్తిస్థాయిలో అమలు చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. లబ్ధిదారుల ఎంపికను గ్రామసభలకే అప్పగించాలన్న ఆలోచన ఉందట.

PAWAN KALYAN: తిరుపతి నుంచి బరిలో దిగుతున్న పవన్ కళ్యాణ్

అయితే.. ఈ విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేని చోట పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతోంది కాంగ్రెస్‌ వర్గాల్లో. ఎమ్మెల్యేలు ఉన్న చోట ఓకేగానీ.. లేని చోట పార్టీ పట్టు తగ్గకుండా, రాజకీయంగా కూడా మేలు జరగాలంటే ఏం చేయాలన్న ప్రస్తావన వచ్చిందట పీఏసీ మీటింగ్‌లో. రేవంత్, జగ్గారెడ్డి మధ్య ఇదే విషయం ప్రస్తావనకు రాగా.. పార్టీ ఎమ్మెల్యేలు లేనిచోట కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేసిన నాయకుడే మొత్తం లీడ్ చేయాలని అభిప్రాయానికి వచ్చారు. అంటే.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో నిమిత్తం లేకుండా కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్ఛార్జ్‌లే పూర్తి స్థాయి బాస్‌లు కాబోతున్నారన్న చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో. ఇన్ఛార్జ్‌ల కనుసన్ననల్లోనే ప్రభుత్వ పథకాల అమలు, గ్రామసభలు అన్నీ జరగబోతున్నాయన్నది ఇంటర్నల్‌ టాక్‌. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కూడా పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. గెలవడానికి పని చేసిన నాయకులు, కార్యకర్తలు, ఓటు వేసిన ప్రజలు సంతృప్తి చెందేలా పాలన, ప్రభుత్వ పథకాలు అందాలనేదే మన విధానం అంటూ క్లారిటీ ఇచ్చేశారాయన.

Singareni polls: సింగరేణి ఎన్నికలకు రేవంత్ సర్కార్ భయపడుతోందా..?

అంటే కాంగ్రెస్‌ ఎమ్మెల్యే లేనిచోట కాంగ్రెస్‌ ఇన్ఛార్జ్‌ సమాంతరంగా ఉండబోతున్నారన్న మాట. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అధికారిక కార్యక్రమాలకు సైతం ఆహ్వానించే వాళ్ళు కాదని, ప్రభుత్వ పథకాల ఎంపిక కూడా ఇన్చార్జిలదే కాబట్టి మనం కూడా అలాగే చేయాలంటూ మీటింగ్‌లో ఒక నిర్ణయానికి వచ్చారు నాయకులు. అలాగే.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే పథకాల లబ్ధిదారుల ఎంపిక మొత్తం గ్రామ సభల్లోనే జరుగుతుందన్న క్లారిటీ ఇచ్చేశారు. నియోజకవర్గాలకే కాదు.. జిల్లాలకు కూడా త్వరలోనే ఇన్చార్జి మంత్రులను నియమించే అవకాశం ఉంది. జిల్లా ఇన్చార్జి మంత్రి చేతిలోనే వ్యవహారం మొత్తం ఉంటుందని అంటున్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మాదిరిగా జిల్లా మంత్రుల వ్యవస్థను తెరమీదికి తేబోతుంది కాంగ్రెస్. పూర్తి స్థాయి అధికారాలు, బాధ్యతల్ని వాళ్ళకే ఇవ్వాలని అనుకుంటున్నారట సీఎం. వీలైనంత త్వరలోనే ఇన్చార్జి జిల్లా మంత్రుల జాబితాను ఫైనల్‌ చేయాలని అనుకుంటున్నట్టు తెలిసింది. మొత్తంగా.. ఎమ్మెల్యేలు లేని చోట పార్టీ ముఖ్య నాయకుల్ని కీలకంగా మార్చడంతో పాటు మంత్రులకు జిల్లాల బాధ్యత అప్పగించడం ద్వారా పథకాల అమలులో జాగ్రత్తలు తీసుకునే దిశగా అడుగులేస్తోంది కాంగ్రెస్‌ సర్కార్‌.