T CONGRESS: వాళ్లకు కాంగ్రెస్ టికెట్ కష్టమే.. జూపల్లికి షాక్ తప్పదా..?

సీట్ల పంపకాలు.. టీ కాంగ్రెస్‌లో కొత్త చర్చకు దారి కారణం అవుతున్నాయి. ఇప్పటికే సీట్ల కోసం దాదాపు వెయ్యికి పైగా దరఖాస్తులు రావడంతో వాటి నుంచి ఫైనల్ అభ్యర్థులను ఎంపిక చేయడం హస్తం పార్టీ పెద్దలకు పెద్ద టాస్క్‌గా మారింది.

  • Written By:
  • Publish Date - August 30, 2023 / 08:22 PM IST

T CONGRESS: కాంగ్రెస్ అంతే.. కాంగ్రెస్‌లో అంతే..! అంతా సెట్ అయినట్లే అనిపిస్తాయి. పరిస్థితి మాత్రం అలానే ఉంటుంది. గ్రూప్ తగాదాలు మానేసి అంతా ఒక్క తాటి మీదకు వచ్చారు అనుకొని సంతోషించే లోపే.. టికెట్ పంపకాల్లో తామేంటో మళ్లీ ప్రూవ్‌ చేస్తున్నారు సీనియర్ నేతలు. ఒక్కొక్కరిది ఒక్కో లొల్లి. దీంతో సీట్ల పంపకాలు.. టీ కాంగ్రెస్‌లో కొత్త చర్చకు దారి కారణం అవుతున్నాయి. ఇప్పటికే సీట్ల కోసం దాదాపు వెయ్యికి పైగా దరఖాస్తులు రావడంతో వాటి నుంచి ఫైనల్ అభ్యర్థులను ఎంపిక చేయడం హస్తం పార్టీ పెద్దలకు పెద్ద టాస్క్‌గా మారింది.

ఐతే ఎన్నికలు దగ్గర పడుతుండడంతో.. ఇంకా ఆలస్యం చేస్తే తిప్పలు తప్పవని భావిస్తున్న కాంగ్రెస్ నేతలు.. వీలైనంత త్వరగా మొదటి జాబితా అభ్యర్థులను ప్రకటించాలని ప్లాన్ చేస్తున్నారు. సీట్ల పంపకాలపై లేటెస్ట్‌గా రేవంత్ రెడ్డి అధ్యక్షతన స్క్రినింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఐతే స్క్రీనింగ్‌ కమిటీ ఇప్పటికే 60మంది అభ్యర్థులను ఫైనల్ చేసినట్లు టాక్. దీంతో ఎవరెవరికి సీటు లభిస్తుంది..? ఎవరెవరిని పక్కన పెడుతున్నారనే టెన్షన్‌ గాంధీభవన్‌ పరిసరాల్లో కనిపిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్‌ సీట్ల కోసం పార్టీలో ఉన్న నేతలతో పాటు కొత్తగా పార్టీలో చేరిన వారు కూడా గట్టిగా పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో సీట్ల కేటాయింపు ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఐతే ప్రస్తుతం ఓ ఇద్దరి విషయంలో మాత్రం ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్‌ నుంచి ఈ మధ్యే కాంగ్రెస్‌ గూటికి చేరుకున్న జూపల్లి కృష్ణారావ్‌కు టికెట్ లభించడం కష్టమనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. జూపల్లి కొల్లాపూర్ టికెట్ ఆశించగా బీఆర్ఎస్‌ అందుకు నిరాకరించిందని కాంగ్రెస్‌లో చేరారు.

ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కొల్లాపూర్ టికెట్ ఆశిస్తున్నారు. కొల్లాపూర్‌లో జూపల్లికి చెప్పుకోదగ్గ స్థాయిలో ఆదరణ లేదని.. అందకే బీఆర్ఎస్‌ టికెట్ నిరాకరించిందని టాక్. ఇప్పుడు కాంగ్రెస్ చేయించిన అంతర్గత సర్వేలో కూడా అదే విషయం స్పష్టమైందట. దీంతో జూపల్లికి టికెట్ లభిస్తుందా.. లేదా.. అనేది ఆసక్తికరంగా మారింది. ఇక అటు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డికి కూడా టికెట్ కష్టమనే వాదన వినిపిస్తోంది. సంగారెడ్డిలో బలమైన నేతగా ఉన్న ఆయన గ్రాఫ్ పడిపోయిందనే టాక్ వినిపిస్తోంది. అందుకే జగ్గారెడ్డి విషయంలో కూడా టికెట్ హోల్డ్‌లో పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఐతే ప్రస్తుతానికి ఇది ప్రచారం మాత్రమే. నిజం ఏంటో తెలియాలంటే.. కాంగ్రెస్ లిస్ట్ వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే.