Tamil Nadu: గవర్నర్ వర్సెస్ డీఎంకే ప్రభుత్వం.. ప్రసంగం చదవని గవర్నర్.. రెండు నిమిషాల్లోనే పూర్తి..

అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమవ్వడం ఆనవాయితీ అనే సంగతి తెలిసిందే. సోమవారం కూడా తమిళనాడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అలాగే ప్రారంభమయ్యాయి. గవర్నర్ ఈ సభకు హాజరై, ప్రసంగాన్ని చదువుతూ.. కొన్ని నిమిషాల్లోనే ముగించారు.

  • Written By:
  • Publish Date - February 12, 2024 / 09:31 PM IST

Tamil Nadu: తమిళనాడులో అసెంబ్లీ సాక్షిగా డీఎంకే ప్రభుత్వం, గవర్నర్ మధ్య విభేదాలు బయటపడ్డాయి. సోమవారం తమిళనాడు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే, ఈ సభలో ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగం చేసేందుకు గవర్నర్ ఆర్‌.ఎన్‌. రవి నిరాకరించారు. అలాగే జాతీయ గీతాన్ని డీఎంకే ప్రభుత్వం గౌరవించలేదని ఆరోపిస్తూ రెండు నిమిషాల్లోనే, గవర్నర్ తన ప్రసంగాన్ని ముగించేశారు. దీంతో స్టాలిన్ ప్రభుత్వం, గవర్నర్ మధ్య విబేధాలు రచ్చకెక్కాయి.

HARISH RAO VS KOMATIREDDY: హరీష్‌కు దేవాదాయ శాఖ.. రాజగోపాల్‌ ఆఫర్‌తో అలజడి..

అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమవ్వడం ఆనవాయితీ అనే సంగతి తెలిసిందే. సోమవారం కూడా తమిళనాడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అలాగే ప్రారంభమయ్యాయి. గవర్నర్ ఈ సభకు హాజరై, ప్రసంగాన్ని చదువుతూ.. కొన్ని నిమిషాల్లోనే ముగించారు. ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగంలో అభ్యంతరకర విషయాలు ఉన్నాయని, అందుకే తాను విభేదిస్తున్నట్లు గవర్నర్ చెప్పి, వెళ్లిపోయారు. దీంతో గవర్నర్‌కు బదులుగా స్పీకర్‌ ప్రసంగాన్ని చదివి వినిపించారు. గతేడాది కూడా ప్రసంగం విషయంలో గవర్నర్ ఇలాగే వ్యవహరించారు. అయితే, అప్పట్లో పూర్తిగా వదిలేయకుండా.. కొన్ని అంశాల్ని వదిలేశారు. ఇంకొన్ని సొంత అంశాల్ని చేర్చి, ప్రసంగం పూర్తి చేశారు. అనంతరం.. గవర్నర్ ప్రసంగంపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. గవర్నర్ చదివిన ప్రసంగాన్ని కాకుండా.. తాము ఇచ్చిన ప్రసంగాన్ని మాత్రమే రికార్డులో నమోదు చేయాలంటూ​ అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఈ తీర్మానం ఆమోదం పొందింది కూడా.

అప్పటినుంచి గవర్నర్‌, స్టాలిన్‌ సర్కార్‌ మధ్య విభేదాలు మరింత ఎక్కువయ్యాయి. తాజ ఘటనతో ఇది మరింత పెరిగింది. ఇటీవల కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్​ ఖాన్​ కూడా ఇలాగే బడ్జెట్‌ సమావేశాల్లో తన ప్రసంగాన్ని రెండు నిమిషాల్లోనే ముగించారు. ప్రభుత్వం రాసి ప్రభుత్వం ఇచ్చిన 62 పేజీల ప్రసంగాన్ని చదివేందుకు ఆయన నిరాకరించారు. తమిళనాడులో ప్రసంగం విషయంలో గవర్నర్ ఆర్​. ఎన్.​ రవి స్పందించారు. ప్రసంగానికి ముందు, తర్వాత జాతీయ గీతం ఆలపించాలని తాను చేసిన అభ్యర్థనలను ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఈ సమావేశాల్లో చర్చలు సానుకూలంగా జరుగుతాయని ఆశిస్తున్నా అంటూ వ్యాఖ్యానించారు.