Tamilisai Soundararajan: తెలంగాణకు కొత్త గవర్నర్‌.. లోక్‌సభకు తమిళిసై..?

తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తమిళిసై సౌందరాజన్‌.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్ననట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తమిళిసై ఢిల్లీలో ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే విషయం గురించి పార్టీ హైకమాండ్‌తో మాట్లాడేందుకే తమిళిసై ఢిల్లీ వెళ్లారని రాజకీయ వర్గాల్లో టాక్‌ నడుస్తోంది.

  • Written By:
  • Publish Date - December 25, 2023 / 05:54 PM IST

Tamilisai Soundararajan: తెలంగాణలో అడ్మినిస్ట్రేషన్‌ మారబోతోందా..? త్వరలోనే తెలంగాణకు కొత్త గవర్నర్‌ రాబోతున్నారా..? ప్రస్తుతం ఉన్న పరిస్తితి చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తమిళిసై సౌందరాజన్‌.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్ననట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తమిళిసై ఢిల్లీలో ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే విషయం గురించి పార్టీ హైకమాండ్‌తో మాట్లాడేందుకే తమిళిసై ఢిల్లీ వెళ్లారని రాజకీయ వర్గాల్లో టాక్‌ నడుస్తోంది.

Revanth Reddy: సీఎం రేవంత్‌కు అస్వస్థత.. ఖండించిన సీఎంవో

ఒకవేళ పోటీకి పార్టీ ఓకే చెప్తే.. తమిళనాడు నుంచి ఎన్నికల బరిలో దిగబోతున్నారు తమిళిసై. అదే జరిగితే ఆమె తన గవర్నర్‌ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అంటే తెలంగాణకు కొత్త గవర్నర్‌ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలంగాణ, పాండిచ్చేరి గవర్నర్‌గా ఉన్న తమిళిసై.. తమిళ ప్రజలకు మాత్రం రాజకీయ నాయకురాలిగానే సుపరిచితురాలు. బీజేపీ ప్రభుత్వంలో తమిళిసై తమిళనాడులో యాక్టివ్‌ రోల్‌ ప్లే చేశారు. 2009లో నార్త్‌ చెన్నై నుంచి 2019లో తూత్తుకుడి నుంచి ఎన్నికల్లో పోటీ కూడా చేశారు. అక్కడి నుంచి తెలంగాణ గవర్నర్‌గా వచ్చారు. తరువాత ఆమెను పాండిచ్చేరి గవర్నర్‌గా కూడా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం అదనపు బాధ్యతలు ఇచ్చింది. కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో యాక్టివ్‌ పాలిటిక్స్‌లోకి మరోసారి వెళ్లాలని తమిళిసై నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

దేశంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం వస్తే.. అందులో కూడా కీలక పాత్ర పోషించే ప్రయత్నాల్లో తమిళిసై ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న తమిళిసై బీజేపీ పెద్దలతో ఇదే విషయాన్ని మాట్లాడబోతున్నారట. మరి తమిళిసై పోటీకి బీజేపీ హైకమాండ్‌ ఎలా రియాక్ట్‌ అవుతుందో చూడాలి.