TANETI VANITHA: సీటు మార్చినా.. తానేటి వనిత ఫేట్ మారుతుందా..?

ఆంధ్రప్రదేశ్ మంత్రి తానేటి వనిత. కొవ్వూరు నుంచి గోపాలపురం నియోజకవర్గానికి షిప్ట్ అయ్యారు. అక్కడా ఆమెకు ఇబ్బందులు తప్పడం లేదు. వనిత వస్తే తమకు గుర్తింపు ఉండదని అనుకుంటోందట తలారి వెంకట్రావు వర్గం

  • Written By:
  • Publish Date - January 31, 2024 / 04:38 PM IST

TANETI VANITHA: ఏపీలో కొవ్వూరు నుంచి గెలిచి జగన్ క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్న తానేటి వనిత అదే నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. వర్గపోరు ఎక్కువ అవ్వడంతో కొవ్వూరు నుంచి గోపాలపురం నియోజకవర్గానికి ఆమెను మార్చారు. అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న తలారి వెంకటరావును కొవ్వూరుకు మార్చారు. ఊహించని ఈ మార్పులతో వైసీపీ క్యాడర్ ఇప్పుడు కన్‌ఫ్యూజన్లో పడింది. సీటు మార్చినా.. తానేటి వనిత ఫేట్ మారుతుందా..?
ఆంధ్రప్రదేశ్ మంత్రి తానేటి వనిత. కొవ్వూరు నుంచి గోపాలపురం నియోజకవర్గానికి షిప్ట్ అయ్యారు. అక్కడా ఆమెకు ఇబ్బందులు తప్పడం లేదు. వనిత వస్తే తమకు గుర్తింపు ఉండదని అనుకుంటోందట తలారి వెంకట్రావు వర్గం. ఐదేళ్లపాటు ఎమ్మెల్యే వెంట ఉండి, పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేసిన నేతలంతా ఇక మీదట తమకి దక్కాల్సిన గుర్తింపు దక్కకుండా పోతుందనే టెన్షన్‌లో ఉన్నారట. 2019 ఎన్నికలు ముగిసిన నాటి తలారి, తానేటి వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి కారణం 2009లో గోపాలపురం టిడిపి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు వనిత. తర్వాత పార్టీ మారి మంత్రి అయ్యారు. దీంతో గతంలో ఆమెకు నియోజకవర్గంలో అనుబంధంతో గోపాలపురం రాజకీయాల్లో కలగజేసుకుంటూ వర్గపోరుకు ఆజ్యం పోస్తున్నారట. ఆధిపత్యపోరుకు చెక్‌ పెడుతూ..తాజాగా పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో ఈ ఇద్దరు పోటీచేసే నియోజకవర్గాలు మారిపోయాయి. స్థానిక నేతలతో విభేదాల కారణంగా కొవ్వూరు నుంచి గోపాలపురం షిఫ్ట్ అయిన మంత్రి వనితకు.. మరోసారి వర్గ పోరు తప్పదంటున్నాయి స్థానిక రాజకీయ వర్గాలు.

Elon Musk: అందరూ ఇస్మార్ట్ శంకర్‌లే.. మెదడు మీదే.. కానీ దానిపై కంట్రోల్‌ మాది..!

హైకమాండ్ చేపట్టిన మార్పులు, చేర్పులు ఎక్కడ ఎలా ఉన్నా.. గోపాలపురంలో మాత్రం కాకరేపుతున్నాయట. ఎమ్మెల్యే తలారిని కొవ్వూరు పంపించడంపై అక్కడి క్యాడర్ అసంతృప్తితో ఉంది. ఇటు మంత్రి వనిత వస్తే… తమ పరిస్థితి ఏంటనే డైలమాలో గోపాలపురం కేడర్‌ ఉంది. ఆమె విజయానికి అసలు వాళ్ళు ఎంత వరకు సహకరిస్తారన్న అనుమానాలు సైతం ఉన్నాయట. గతంలో మంత్రి వనితకు టిడిపిలో ఉన్న పరిచయాలతో ఆమె వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందనీ… అప్పుడు తమ పరిస్థితి ఏంటని కంగారుగా ఉన్నారట ఇన్నాళ్ళు తలారి వెంకట్రావు అనుచరులుగా ఉన్న నాయకులు. దీంతో వచ్చే ఎన్నికల్లో కీరోల్ ప్లే చేయాల్సిన స్థానిక నాయకులు సైలెంటవుతున్నట్టు తెలుస్తోంది. కొవ్వూరు వెళ్ళిన వెంకట్రావు మాత్రం అక్కడి స్థానిక నేతల్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారట. వనిత వర్గం కంటే అక్కడ ఆమె వ్యతిరేక వర్గమే బలంగా ఉందన్న ప్రచారం నడుస్తోంది. దాంతో అక్కడ తలారికి ఎలాంటి ఇబ్బంది ఉండదనేది ఆయన సన్నిహితుల మాట. ఎటొచ్చి మంత్రి వనితపైనే ఇపుడు అందరి ఫోకస్ పడింది. ఆమెకు సహకరిస్తే పరిస్థితి ఏంటి..? సహకరించకుంటే ఏంటన్న లెక్కలేసుకుంటున్నారు కీలక నేతలు.. గతంలో ఎమ్మెల్యే వర్గంపై ఆధిపత్యం చూపించిన మంత్రి వనిత వెంటవెళ్ళినా ప్రాధాన్యత ఉండదేమోనన్న అనుమానాలు వారిని వెంటాడుతూనే ఉన్నాయట. ఇదే సమయంలో టిడిపిలోనూ వర్గ పోరు ఉన్నందున అక్కడి అసంతృప్తులు తన విజయానికి సహకరిస్తారనే ధీమాతో మంత్రి ఉన్నట్టు చెబుతున్నారు ఆమె సన్నిహితులు.

REVANTH Vs KTR: కేటీఆర్‌ టార్గెట్‌గా రేవంత్‌ భారీ ప్లాన్‌.. ఇక చుక్కలే..

ఎమ్మెల్యే వర్గం తనకు సహకరించకపోయినా.. టిడిపి నుంచి వచ్చి తనకి మద్దతు పలుకుతారని లెక్కలేసుకుంటున్నారట మంత్రి తానేటి వనిత. ఈ విషయాన్ని గమనించిన ఆమె ఇటీవల నిర్వహిస్తున్న పరిచయ కార్యక్రమాల్లో తాను కోవర్ట్ కాదంటూ క్లారిటీ ఇచ్చుకుంటున్నారట. తాను వస్తే టిడిపి వాళ్లకి ప్రాధాన్యత దక్కుతుందనడంలో నిజం లేదని స్వయానా మంత్రి వివరణ ఇచ్చుకోవాల్సి రావడం విషాదమేనన్నది లోకల్‌ వాయిస్‌. చాలామంది నేతలు ఆమెతో కలిసి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదంటున్నారు పరిశీలకులు. గతంలో ఇదే నియోజకవర్గంలో టిడిపి నుంచి పోటీ చేసి గెలిచిన వనిత వర్గపోరు కారణంగా పార్టీ మారారు. తిరిగి మళ్ళీ అదే నియోజకవర్గానికి వస్తే… తనకి అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే ప్రాధాన్యత కల్పిస్తారన్నది లోకల్‌ వైసీపీ క్యాడర్ భావన. పదేళ్ల పాటు పార్టీ కోసం పనిచేసిన తమకు ఎక్కడ గుర్తింపు లేకుండా పోతుందో అనే ఆవేదనతో ముందుగానే పక్కకి తప్పుకుంటున్నట్టు సమాచారం. వర్గపోరును తగ్గించేందుకు కొవ్వూరు నుంచి గోపాలపురానికి మంత్రి తానేటి వనితను మార్చినా… పరిస్థితుల్లో మార్పు లేనట్టే కనిపిస్తోందంటున్నాయి రాజకీయ వర్గాలు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వర్గ పోరే ఇప్పుడు మంత్రికి అసలైన సవాల్‌గా మారింది. మరి పరిస్థితిని తానేటి వనిత ఎంత వరకు దారికి తెచ్చుకుంటారో చూడాలి.