TDP-BJP: టీడీపీతో బీజేపీ పొత్తుల చర్చలు.. జగన్‌కు ఓటమి భయం మొదలైందా..?

కేంద్రంలోని పెద్దలు.. జగన్‌పైనా కానీ, ఇక్కడి ప్రభుత్వంపైన కానీ పెద్ద విమర్శలు చేయలేదు. జగన్ కూడా కేంద్ర ప్రభుత్వంపైన కానీ, బీజేపీ జోలికి పోలేదు. కావాలనుకున్నప్పుడల్లా ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి వచ్చేవారు.

  • Written By:
  • Updated On - February 7, 2024 / 09:00 PM IST

TDP-BJP: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయ్. నిన్నటి వరకూ వైసీపీ అధినేత జగన్‌తో మెతక వైఖరిని ఫాలో అయిన బీజేపీ.. ఇప్పుడు చంద్రబాబుతో పొత్తుకు సిద్ధమైనట్లు వస్తున్న వార్తలతో జగన్‌తో దూరం పెంచుకోవడానికేనా అనే అనుమానాలు స్టార్ట్ అయ్యాయ్. నిజానికి బీజేపీ, వైసీపీ పొత్తులో లేవు. రెండు పార్టీలు ఎప్పుడూ అధికారికంగా పొత్తు పెట్టుకోలేదు. కేంద్రంలోని పెద్దలు.. జగన్‌పైనా కానీ, ఇక్కడి ప్రభుత్వంపైన కానీ పెద్ద విమర్శలు చేయలేదు. జగన్ కూడా కేంద్ర ప్రభుత్వంపైన కానీ, బీజేపీ జోలికి పోలేదు. కావాలనుకున్నప్పుడల్లా ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి వచ్చేవారు.

AUTO DRIVERS PROTEST: ఫిబ్రవరి 16న ఆటోడ్రైవర్ల మహాధర్నా.. ఆటోల బంద్..!

అందుకే పొత్తులో లేకపోయినా రెండు పార్టీల మధ్య అవగాహన ఉందనుకునే వారు చాలామంది ఉన్నారు. కేంద్రంలో బీజేపీకి అవసరమైనప్పుడల్లా జగన్ మద్దతుగా నిలుస్తున్నారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోనూ, కీలక బిల్లుల సమయంలోనూ కమలం పార్టీ వైపు ఉన్నారు. 2017లో ఎన్డీఏతో చంద్రబాబు కటీఫ్ చెప్పిన తర్వాత ఇక టీడీపీతో పొత్తుకు బీజేపీ సిద్ధపడదని అందరూ అంచనా వేశారు. ఐతే బీజేపీ నేతల ఆహ్వానం మేరకు ఆఘమేఘాల మీద చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు. పొత్తు కుదురుతుందా? లేదా? అన్నది పక్కన పెడితే చంద్రబాబుతో కలసి నడిచేందుకు కమలం పార్టీ సిద్ధమయిందన్న సంకేతాలు ఫ్యాన్ పార్టీలో గుబులు పుట్టిస్తున్నాయ్‌. ముఖ్యంగా జగన్‌లో ఓటమి భయం స్టార్ట్ అయిందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే వైసీపీలో పరిస్థితి గందరగోళంగా ఉంది. నియోజకవర్గం ఇంచార్జిల మార్పుతో చాలామంది నేతలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. తమ దారి తాము వెతుక్కుంటున్నారు. దీంతో టీడీపీ, జనసేనలోకి భారీగా వలసలు కనిపిస్తున్నాయ్. ఇలాంటి సమయంలో టీడీపీతో పొత్తుల వ్యవహారంపై బీజేపీ ముందుకురావడం.. జగన్‌ను మరింత టెన్షన్‌ పెడుతోంది.

బీజేపీ పిలుపుతో ఇప్పుడు జగన్‌కు కొత్త అనుమానాలు కూడా మొదలయ్యాయ్. అవి మరింత టెన్షన్ పెడుతున్నాయ్. ఏపీలో జనసేన, టీడీపీ కూటమి బలంగా ఉందని కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలు ఏమైనా నివేదికలు ఇచ్చాయా అనే అనుమానాలు కూడా వైసీపీ నేతలను వెంటాడుతున్నాయ్‌. బీజేపీ సొంతంగా ఈసారి లోక్‌సభలో 4వందల స్థానాలను సాధించాలన్న లక్ష్యంతో ఉంది. సొంతంగా గెలవాలంటే దక్షిణాదిలో ఇక్కడ టీడీపీతో పొత్తు పెట్టుకుంటేనే కొన్ని సీట్లయినా వస్తాయి. దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణ తప్ప మరెక్కడ స్థానాలు వచ్చే అవకాశం లేదు. అందుకే పొత్తుకు సిద్ధపడిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయ్. ఇలాంటి పరిణామాల మధ్య వైసీపీకి ఓటమి భయం పెరిగిందనే చర్చ జోరుగా సాగుతోంది.