TDP- Jana Sena : ఒకేసారి టీడీపీ, జనసేన లిస్ట్‌! కాకపోతే కండిషన్స్ అప్లయ్‌..

తగ్గడం తెలిస్తేనే పొత్తు నెగ్గేది.. పొత్తుతో నెగ్గేది. టీడీపీ(TDP), జనసేన (Janasena)నేతలు మాట్లాడుకుంటున్న మాటలు ఇవి. చంద్రబాబు (Chandrababu) తో పవన్ (Pawan Kalyan) ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సీట్ల సర్దుబాటుపై దాదాపుగా ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. పవన్ 40 కావాలంటే.. 25 నుంచి 28వరకు ఓకే.. తర్వాత నీ ఇష్టం అని చంద్రబాబు చెప్పారనే ప్రచారం జరుగుతోంది.

తగ్గడం తెలిస్తేనే పొత్తు నెగ్గేది.. పొత్తుతో నెగ్గేది. టీడీపీ(TDP), జనసేన (Janasena)నేతలు మాట్లాడుకుంటున్న మాటలు ఇవి. చంద్రబాబు (Chandrababu) తో పవన్ (Pawan Kalyan) ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సీట్ల సర్దుబాటుపై దాదాపుగా ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. పవన్ 40 కావాలంటే.. 25 నుంచి 28వరకు ఓకే.. తర్వాత నీ ఇష్టం అని చంద్రబాబు చెప్పారనే ప్రచారం జరుగుతోంది. ఐతే ఇద్దరి భేటీని వైసీపీ (YCP) టార్గెట్ చేస్తోంది. పవన్‌ (Pawan Kalyan)కు ఇచ్చే సీట్ల సంఖ్య చెప్తుంది.. జనసేన రేంజ్ ఏంటో అనే కొత్త రాగం అందుకున్నారు. ఎవరి మాటలు ఎలా ఉన్నా.. సీట్ల సర్దుబాటుపై దాదాపు క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. సీట్ల సంఖ్య, వాటిలో పోటీ చేసే అభ్యర్థుల అంశంపైనా రెండు పార్టీల మధ్య చర్చలు జరిగాయ్.

రెండు పార్టీలూ ఫైనల్‌గా ఓ అంగీకారానికి వచ్చాయని తెలుస్తోంది. ఎన్ని సీట్లు జనసేనకు కేటాయిస్తారన్నది అధికారికంగా ప్రకటించడం కాకుండా.. ఒకేసారి రెండు పార్టీలు అభ్యర్థులతో సహా జాబితా విడుదల చేయాలని అనుకుంటున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. ఆశావహుల్ని ముందస్తుగా బుజ్జగించే కార్యక్రమాలు చేపట్టనున్నారు. టీడీపీ(TDP) కి అన్ని నియోజకవర్గాల్లోనూ బలమైన క్యాడర్ ఆశావహులు ఉన్నారు. దీంతో ముందుగా వారికి సర్ది చెప్పి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెరుగైన అవకాశాలు కల్పిస్తామని హామీ ఇవ్వనున్నారు. జనసేన పార్టీ తరపున కొన్ని బలమైన స్థానాల్లోనూ.. కొంతమందిని బుజ్జగించే అవకాశం ఉంది. ఎవరి సిట్టింగ్ సీట్లు వారికే ఉంచుకోవాలన్న ప్రాథమిక నిబంధనను ఇద్దరూ ఒప్పందానికి వచ్చినట్లు సమాచారం. సీట్ల సర్దుబాటు ప్రకటన తర్వాత.. పార్టీ నేతలు ఎలాంటి రచ్చ చేయకుండా ముందే సర్ది చెప్పనున్నారు.

ఇబ్బంది అయితే పార్టీ నుంచి వెళ్లిపోవచ్చని… అలా కాకుండా పార్టీకి నష్టం కలిగేలా చేస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రెండు పార్టీల మధ్య సీట్ల అంశంపై ఓ స్పష్టత వచ్చినందున.. ఇక అంతర్గతంగా ఎన్నికల సన్నాహాలు .. ప్రచార కార్యక్రమాలను మరింత ఉద్ధృతం చేసే అవకాశం ఉంది.