LIQUOR CASE TICKETS: ఏంటీ రాజకీయాలు..? లిక్కర్ కేసులో ఉన్నోళ్ళకే టిక్కెట్లు.. పోటీలు పడుతున్న వైసీపీ,టీడీపీ

లిక్కర్ స్కామ్ కేసులో నిందితులు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈసారి నెల్లూరు, ఒంగోలు ఎంపీ అభ్యర్థులుగా బరిలో దిగుతున్నారు. అధికార వైసీపీతో పాటు టీడీపీ కూడా ఏరి కోరి వాళ్ళకి టిక్కెట్లు ఇస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - February 28, 2024 / 03:56 PM IST

LIQUOR CASE TICKETS: ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగానే కాదు..రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం కలిగించింది. సౌత్ గ్రూప్ లో ఈ రెండు రాష్ట్రాల పొలిటికల్ లీడర్లు, బిజినెస్‌మెన్‌కి ప్రమేయం ఉండటమే ఇందుక్కారణం. ఆ కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. ఇంకా కొందరిని సీబీఐ అరెస్ట్ చేయవచ్చని అంటున్నారు. నిందితుల్లో ఎవరికీ ఇంకా క్లీన్ చిట్ కూడా రాలేదు. అయినా సరే.. లిక్కర్ స్కామ్ కేసులో నిందితులు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు.

CHANDRABABU NAIDU: కుప్పంపై వైసీపీ కన్ను.. పెద్దిరెడ్డి రెడీ చేసిన స్కెచ్ ఇదేనా..?

ఈసారి నెల్లూరు, ఒంగోలు ఎంపీ అభ్యర్థులుగా బరిలో దిగుతున్నారు. అధికార వైసీపీతో పాటు టీడీపీ కూడా ఏరి కోరి వాళ్ళకి టిక్కెట్లు ఇస్తున్నాయి. నెల్లూరు వైసీపీ ఎంపీ సీటు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తప్పుకున్నారు. దాంతో ఆ ప్లేస్‌లో ఎంపీ విజయసాయిరెడ్డి బంధువు శరత్ చంద్రారెడ్డిని రంగంలోకి దింపుతోంది వైసీపీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టయిన శరత్ చంద్రారెడ్డి ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ఈ కేసులో అప్రూవర్‌గా మారారు. ఆయన అరబిందో ఫార్మా, అరబిందో రియల్ ఎస్టేట్ సంస్థల్లో డైరెక్టర్. శరత్ చంద్రారెడ్డి నెల్లూరు లోకల్. డబ్బులు కూడా బాగా ఉన్నాయి. ఎన్నికల్లో ఎంతైనా ఖర్చు పెట్టుకోగలడు. అందుకే నెల్లూరు టిక్కెట్ ఆయనకే వైసీపీ కన్ఫమ్ చేసింది. ఒంగోలు లోక్‌సభ సీటుకు పోటీ పడుతున్నారు మాగుంట రాఘవరెడ్డి. మాగుంట శ్రీనివాస్ రెడ్డి కుమారుడే ఈయన. ఢిల్లీ లిక్కర్ కేసులో మరో నిందితుడు రాఘవరెడ్డి. ఆయన త్వరలో టీడీపీలో చేరి ఒంగోలు ఎంపీగా పోటీ చేయబోతున్నారు. ప్రస్తుతం ఒంగోలు ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీకి రిజైన్ చేస్తున్నారు. తన కొడుకు రాఘవరెడ్డి ఒంగోలు ఎంపీగా బరిలో దిగుతున్నాడని ప్రకటించారు కూడా.

తన కొడుకు ఎలాంటి తప్పూ చేయలేదనీ.. నిర్దోషిగా బయటకు వస్తాడని గతంలో శ్రీనివాసులు రెడ్డి చెప్పుకొచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇప్పటికీ శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ రెడ్డి మీద ఈడీ, సీబీఐ కేసులు నడుస్తున్నాయి. కేజ్రీవాల్, కవితను కూడా అరెస్ట్ చేస్తారని అంటున్నారు. ఇంత జరుగుతున్నా.. వైసీపీ, టీడీపీ మాత్రం పోటీలు పడి మరీ లిక్కర్ కేసులో నిందితులకు టిక్కెట్లు కేటాయిస్తుండటంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. నేర చరితులకు టిక్కెట్లు ఇవ్వడమేంటని ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి.