CBN fear: కుప్పంలో చంద్రబాబు కోట కూలడం ఖాయమా? అందుకే పదేపదే అక్కడికి వెళ్తున్నారా?

చంద్రబాబు పదేపదే కుప్పం ఎందుకు వెళ్తున్నారు..? ప్రతి రెండు నెలలకోసారి కుప్పంలో ఎందుకు పర్యటిస్తున్నారు..? కంచుకోటలో ఓడిపోతానని బాబు భయపడుతున్నారా..? బాబుకు కుప్పం భయం ఎందుకిలా పట్టుకుంది..?

  • Written By:
  • Publish Date - June 6, 2023 / 09:30 PM IST

కుప్పం చంద్రబాబు కంచుకోట.. అయితే ఎంత బలమైన కోటకైనా ఏదో ఒక రోజు బీటలు వారడం పక్కా! అది చంద్రబాబుది కావొచ్చు.. ఇంకెవరిదైనా కావొచ్చు..! ఈ విషయం టీడీపీ అధినేతకు తెలియనది కాదు.. అసలు నామినేషన్ వేయడానికే ఒకప్పుడు ఇతర పార్టీ నేతలను పంపించిన బాబు.. ఈ మధ్య కాలంలో కుప్పంలో పదేపదే పర్యటిస్తున్నారు. తాజాగా ఈ నెల 14,15,16 తేదీల్లో చంద్ర‌బాబు కుప్పంలో మరోసారి ప‌ర్య‌టించ‌బోతున్నారు.

వరుసగా ఏడుసార్లు.. ఎనిమిదో సారి కష్టమేనా?
జగన్‌ మొండోడు.. అతను మంచి చేస్తాడో.. చెడు చేస్తాడోనన్నది పక్కన పెడితే చెప్పిందే చేస్తాడన్నది మాత్రం ప్రజలు ఎప్పుడో ఫిక్స్‌ ఐపోయారు. కుప్పంలో చంద్రబాబును ఓడించాలన్నది జగన్‌ ప్రధాన లక్ష్యం! 2019నుంచి జగన్‌ తన లక్ష్యం కోసం పనిచేస్తున్నారు. అటు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూడా అదే పని. ఇంచార్జ్ భరత్ కూడా నిత్యం కుప్పంలో వైసీపీ బలోపెతం చేసే పనిలోనే ఉంటారు. వాళ్ల కష్టం ఇప్పటికే అనేకసార్లు ప్రజలకు కూడా కనిపించింది. పంచాయితీ ఎన్నికల్లో గెలిచారు..స్థానిక ఎన్నికల్లో గెలిచారు.. ఆఖరికి కుప్పం మున్సిపాలిటీని సైతం వైసీపీ కైవసం చేసుకున్నదంటే అది జగన్‌ మొండితనానికి దక్కిన విజయమే..! ఇదే ఊపులో బాబును కుప్పం నుంచి సాగనంపాలని జగన్‌ కంకణం కట్టుకున్నారు. అదే జరిగితే తన రాజకీయ జీవితం చివరి దశకు చేరుకుంటున్న సమయంలో చంద్రబాబుకు ఇది చాలా బాధ కలిగించే అంశం.

1989 నుంచి ప్రతి ఎన్నికల్లోనూ చంద్రబాబు గెలుస్తూ వస్తున్నారు. ప్రతిసారి మంచి మెజారిటీనే వచ్చింది కానీ 2019 ఎన్నికల్లోనే సీన్ రివర్స్ అయ్యింది. ప్రతిసారి 45వేలకు పైగా మెజార్టీ గెలుస్తూ వచ్చిన చంద్రబాబు 2019ఎన్నికల్లో 30వేల ఓట్ల మెజార్టీతో సరిపెట్టుకున్నారు. ఆ తర్వాత స్థానిక ఎన్నికల్లో వైసీపీ వీరవీహారం చేయడంతో బాబుకు ఎక్కడలేని భయం పట్టుకుంది. అప్పటివరకు కుప్పం తనదేనన్న కాన్ఫిడెన్స్‌తో ఉన్న చంద్రబాబులో ఓటమి భయం క్లియర్‌కట్‌గా కనిపిస్తూ వచ్చింది. అసలు నామినేషన్ సైతం కార్యకర్తలతో వేయించే బాబు..రెండు దశాబ్దాలకుపైగా కుప్పం నుంచే ఎమ్మెల్యేగా ఉన్నా.. నియోజకవర్గంలో సొంత ఇల్లు కూడా లేని బాబు..ఈ మధ్యే అక్కడ భూమి కూడా కొనడం ఆయనలో భయం పట్టుకుందనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవడం ఓడడం సంగతి అటు ఉంచితే చంద్రబాబు మాత్రం కుప్పంలో గెలవకపోతే అది తల ఎత్తుకోలేని విధంగా ఉంటుంది. ఇన్నాళ్లు..దాదాపు ప్రతీ ఎన్నికల్లోనూ పార్టీ గెలుపుపైనే ఎక్కువగా దృష్టి సారించిన చంద్రబాబు.. ఈసారి పవన్ కల్యాణ్ లాగా తన ఎమ్మెల్యే సీటుపైనా ఫోకస్‌ చేస్తూ పార్టీని నడిపించాల్సిన దుస్థితి దాపరించింది.