TDP IN TO NDA: పొత్తుల టైమ్.. ఎన్డీఏలోకి టీడీపీ ! ముహూర్తం ఎప్పుడంటే ?

చంద్రబాబు, పవన్‌ను ఢిల్లీ రావాలని ఇప్పటికే సూచించినట్టు తెలుస్తోంది. బీజేపీ కోరే అసెంబ్లీ, లోక్ సభ స్థానాలపై కసరత్తు చేయబోతున్నారు. అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో బాబు, పవన్ భేటీ అవుతారు.

  • Written By:
  • Publish Date - February 17, 2024 / 02:29 PM IST

TDP IN TO NDA: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తులకు టైమ్ దగ్గర పడింది. వచ్చేవారంలోనే NDA లో చేరబోతోంది టీడీపీ. ఈనెల 20న టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలసి ఢిల్లీ వెళ్తున్నారు. ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపై డిస్కస్ చేయబోతున్నారు. సీట్ల సర్దుబాటును తేల్చబోతున్నారు. ఢిల్లీలో ప్రస్తుతం బీజేపీ పదాధికారుల సమావేశం జరుగుతోంది.

PAWAN KALYAN: ఓజీ తుపాన్.. ముంబై హార్బర్‌లో ఒరిజినల్ గ్యాంగ్ స్టర్స్

శని, ఆది వారాల్లో జరుగుతున్న ఈ జాతీయ సమావేశాలకు ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పురంధేశ్వరితో పాటు సీనియర్ నేతలంతా హాజరవుతున్నారు. ఈ సమావేశంలోనే.. టీడీపీతో పొత్తు, ఎన్డీఏలో చేర్చుకోవడంపై బీజేపీ తన నిర్ణయాన్ని ప్రకటించబోతోంది. మీటింగ్స్ అయిపోయాక చంద్రబాబు, పవన్‌ను ఢిల్లీ రావాలని ఇప్పటికే సూచించినట్టు తెలుస్తోంది. బీజేపీ కోరే అసెంబ్లీ, లోక్ సభ స్థానాలపై కసరత్తు చేయబోతున్నారు. అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో బాబు, పవన్ భేటీ అవుతారు. ఈ మీటింగ్ లో సీట్ల సర్దుబాటుపై అవగాహనకు వస్తే.. ఆ తర్వాత ఈ ఇద్దరు నేతలు ప్రధాని నరేంద్ర మోడీతోనూ సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ నేతల మీటింగ్ తర్వాత.. ఏపీలోని అసెంబ్లీ, లోక్ సభ సీట్లల్లో ఏ పార్టీ ఎక్కడ నుంచి పోటీ చేస్తుందని తేలనుంది.

బీజేపీ హైకమాండ్ ఏపీలో 15 నుంచి 20 దాకా అసెంబ్లీ స్థానాలు.. 8 పార్లమెంట్ సీట్లు కోరుతున్నట్టు తెలుస్తోంది. ఏపీలో అధికారం చేపట్టడానికి టీడీపీకి, కేంద్రంలో మూడోసారి పగ్గాలు చేపట్టడానికి బీజేపీకి కూడా సీట్లు అంతే ముఖ్యం. బీజేపీ, జనసేనకు సీట్లు ఇవ్వడం వల్ల తాము ఇబ్బందుల్లో పడతామని టీడీపీ భావిస్తోంది. టీడీపీ సీనియర్ నేతలతో ఇదే విషయమై చంద్రబాబు చర్చించారు. ఢిల్లీ వెళ్ళేలోపు ఓ స్పష్టమైన అవగాహనతో వెళ్తున్నట్టు తెలుస్తోంది.