TDP-JANASENA LIST: యూత్ ఓట్ల కోసమే.. 63మంది డిగ్రీ-30 మంది పీజీ.. అయినా యువతకి దక్కని సీట్లు !

రెండు పార్టీలు కలసి 99 మంది అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేశాయి. ఈ లిస్టులో ఉన్న అభ్యర్థులంతా విద్యావంతులే. హైయ్యస్ట్‌గా 63 మంది డిగ్రీ చదివిన వాళ్ళు ఉండగా.. పీజీ చేసిన వాళ్ళు 30 మంది ఉన్నారు.

  • Written By:
  • Updated On - February 24, 2024 / 02:58 PM IST

TDP-JANASENA LIST: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమిలో చదవుకున్న వాళ్ళకే టిక్కెట్లను కేటాయించారు. రెండు పార్టీలు కలసి 99 మంది అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేశాయి. ఈ లిస్టులో ఉన్న అభ్యర్థులంతా విద్యావంతులే. హైయ్యస్ట్‌గా 63 మంది డిగ్రీ చదివిన వాళ్ళు ఉండగా.. పీజీ చేసిన వాళ్ళు 30 మంది ఉన్నారు. ఇంకా ముగ్గురు MBBS డాక్టర్లు, ఇద్దరు పీహెచ్‌డీ చేసినవారు. ఒక ఐఏఎస్ అధికారి.. టీడీపీ-జనసేన కూటమిలో ఉన్నారు.

PAWAN KALYAN: ఎంపీగా పవన్‌..? పవన్‌ నిర్ణయంతో పిచ్చెక్కిపోతున్న జనసైనికులు

కూటమి లిస్టులో యువత కంటే రాజకీయాల్లో పండిపోయిన వాళ్ళకే ప్రాధాన్యం ఇచ్చినట్టు అర్థమవుతోంది. 46 నుంచి 60 యేళ్ళ మధ్యలో అత్యధికంగా 55 మంది పోటీలో ఉన్నారు. ఇంకా అంతకంటే ఎక్కువ.. అంటే 61 నుంచి 75 యేళ్ళ మధ్యన ఉన్న వృద్ధుల బ్యాచ్‌లో 20 మంది ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడుతున్నారు. 36 నుంచి 45యేళ్ళ వయస్సున్న వాళ్ళు 22 మందికి టీడీపీ-జనసేన టిక్కెట్లు ఇచ్చింది. యూత్ నుంచి చాలా తక్కువగా ఇద్దరు మాత్రమే ఎన్నికల బరిలో ఉన్నారు. ప్రతి ఎన్నికల్లో యువత రాజకీయాల్లోకి రావాలి. అప్పుడే మార్పు సాధ్యం.. అంటూ గంభీరంగా మాట్లాడుతూ, యూత్‌కు మాయ మాటలు చెప్పి గాలం వేసే పార్టీలు.. వాళ్ళకి సీట్లు ఇచ్చే విషయంలో మొండిచెయ్యి చూపిస్తున్నట్టు అర్థమవుతోంది. టీడీపీ-జనసేన కూటమిలో మొత్తం 99 మంది అభ్యర్థుల్లో 35 యేళ్ళ లోపు ఉన్న వాళ్ళు ఇద్దరే ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంది. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఇంకా 19 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించాల్సి ఉంది.

వాటిల్లో అయినా యువతకు టిక్కెట్లు ఇస్తారేమో చూడాలి. ఈ లిస్టులో మొత్తం 86 మందికి మగవాళ్ళకి టిక్కెట్లు ఇస్తే.. మహిళలు 13 మందే ఉన్నారు. అంటే మహిళలకు రాజ్యాధికారం కావాలనీ.. పార్లమెంటులో 33శాతం మహిళా రిజర్వేషన్ల కోసం పోరాడిన పార్టీలు వాళ్ళకి టిక్కెట్లు ఇవ్వడానికి మాత్రం మనసు రావట్లేదు. ఇక అభ్యర్థుల సగటు విషయంలో తామే బెటర్ అన్నట్టు లిస్ట్ ప్రకటించుకుంది టీడీపీ. తమ అభ్యర్థుల సగటు వయస్సు 52యేళ్ళు అయితే.. వైసీపీ అభ్యర్థుల సగటు వయస్సు 54 యేళ్ళని ప్రకటించింది. ఇందులో పెద్ద తేడా ఏముంది.. రెండేళ్ళేగా అని జనం ప్రశ్నిస్తున్నారు. టీడీపీ ప్రకటించిన 94 మంది అభ్యర్థుల్లో 23 మంది కొత్తవారికి ఛాన్స్ ఇచ్చామంటోంది. అభ్యర్థుల ఎంపికలో టీడీపీ కోటి 3 లక్షల 33 వేల మంది ప్రజల అభిప్రాయాలను తీసుకుంది. మహిళలు, యువత, బీసీల నుంచి ఎక్కువగా ఈ ఓపీనియన్స్ సేకరించింది. ఇంత పెద్ద సంఖ్యలో ఒపీనియన్స్ తీసుకోవడం దేశంలోనే హయ్యస్ట్ అంటోంది టీడీపీ.