Buddha Venkanna: బుద్దన్నా.. ఏందన్నా.. రక్తంతో రాజకీయం ! బెజవాడలో ఇలా చేస్తారా ?

తమ పార్టీ నాయకుడి మీద అభిమానం ఉండవచ్చు. అది ఎంతైనా ఉండవచ్చు తప్పులేదు. కానీ.. ఇన్‌ఫాచ్యుయేషన్‌లో ఉన్న కాలేజీ పిల్లోడిలా, ఇంకా చెప్పాలంటే సిల్లీ రోడ్‌సైడ్‌ రోమియోలా రక్తం తీసి.. దాంతో గోడమీద రాతలు రాయడమేంటి?

  • Written By:
  • Updated On - February 20, 2024 / 05:02 PM IST

Buddha Venkanna: బెజవాడ పాలిటిక్స్‌ అచ్చం సినిమాని గుర్తుచేస్తున్నాయి. ఓవైపు సీరియస్ రాజకీయం జరుగుతోంది. మరోవైపు అక్కడే సిల్లీ కామెడీ బిట్స్‌ కూడా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆంధ్రా పొలిటికల్‌ కేపిటల్‌గా పిలుచుకున్న ఈ ప్రాంతం నుంచి జరిగే రాజకీయానికి ఓ స్థాయి ఉంది. కానీ.. ఇప్పుడిక్కడంతా అందుకు భిన్నంగా జరుగుతోంది. టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న చేసిన తాజా సిల్లీ విన్యాసమే అందుకు ఉదాహరణ. తన రక్తాన్ని ఓ బాటిల్లోకి తీసి.. ఆ రక్తంతో టీడీపీ అధినేత చంద్రబాబు కటౌట్‌ దగ్గర కాళ్లు కడగడం, ఆ తర్వాత గోడ మీద జిందాబాద్ సీబీఎన్ అని రాయడాన్ని చూసి నవ్వాలో.. ఏడ్వాలో.. ఆయన మానసిక స్థితి చూసి అయ్యో పాపం అనాలో అర్ధం కావడం లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు.

YS SHARMILA: ఏపీలోనూ షర్మిల పని అయిపోయిందా..? పొలిటికల్ కెరీర్‌కు ఇక ఎండ్‌ కార్డేనా..?

తమ పార్టీ నాయకుడి మీద అభిమానం ఉండవచ్చు. అది ఎంతైనా ఉండవచ్చు తప్పులేదు. కానీ.. ఇన్‌ఫాచ్యుయేషన్‌లో ఉన్న కాలేజీ పిల్లోడిలా, ఇంకా చెప్పాలంటే సిల్లీ రోడ్‌సైడ్‌ రోమియోలా రక్తం తీసి.. దాంతో గోడమీద రాతలు రాయడమేంటి? అసలా చర్యను ఆయన అంతగా అభిమానించే చంద్రబాబు అయినా సహిస్తారా? ఒక సీనియర్‌ పొలిటీషియన్‌ చేయాల్సిన పనేనా అది అనే ప్రశ్నలు శర పరంపరగా వస్తున్నాయి. వింటున్న, చూస్తున్న వారంతా ఇదేం రాజకీయం రా బాబూ.. అంటూ ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి. బెజవాడ పొలిటికల్‌ సర్కిల్స్‌లో ఇప్పుడిదే హాట్ టాపిక్‌. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్న బుద్దా వెంకన్న ఇలా చేయడానికి కారణాలపై ఆరా తీస్తున్నారు కొందరు. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నారాయన. కానీ.. వెస్ట్ నియోజకవర్గం ఎప్పుడూ పొత్తుల్లో భాగంగా వేరే పార్టీకి వెళ్లిపోతోంది. ఈసారి అలా కాకుండా టీడీపీకి టిక్కెట్ వచ్చేలా చేసుకుంటే తానే పోటీ చేయొచ్చని భావిస్తున్నారట బుద్దా. దీనికి తగ్గట్టే కేశినేని నాని పార్టీ నుంచి వెళ్ళిపోయాక ఆయన సోదరుడు చిన్నికి బెజవాడ టీడీపీ లోక్ సభ టిక్కెట్ దాదాపు ఖాయమైంది.

Hyderabad Traffic Police: ఇదిదా క్రేజ్‌.. కుమారి ఆంటీని ఫాలో అవుతున్న పోలీసులు..

ఈ క్రమంలో తాను అసెంబ్లీ బరిలో ఉంటే చిన్ని సహకారం అన్ని రకాలుగా ఉంటుందనీ.. పార్టీ బలం.. తన అనుచర గణం సాయంతో తేలిగ్గా అసెంబ్లీ మెట్లు ఎక్కేయవచ్చన్నది ఆయన ఆలోచనగా చెబుతున్నారు. దీంతో టిక్కెట్ల హడావిడి మొదలైనప్పటి నుంచి ఓసారి బలప్రదర్శన చేశారు బుద్దా. అయినాసరే.. ఆయన పేరును పార్టీ అధినాయకత్వం కనీసం పరిగణనలోకి కూడా తీసుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఐవీఆర్ఎస్ సర్వేలు చేస్తున్నా.. ఇక్కడ మాత్రం ఆ ఊసేలేదు. దీంతో ఫ్రస్ట్రేటైన బుద్దా.. రక్తతర్పణం ఎపిసోడ్‌కు తెర లేపారనే చర్చ జరుగుతోంది. తాను చంద్రబాబుకు వీర భక్తునిగా ఉంటున్నా.. నమ్మకంగా వ్యవహరిస్తున్నా.. ఎందుకు పట్టించుకోవడంలేదన్న అసహనం ఓ రేంజ్‌కు చేరుకోవడం వల్లే గోడ మీద రక్తం పడిందని అంటున్నారు. అయితే పాలిటిక్స్‌లో ఫ్రస్ట్రేషన్స్‌ అందరికీ ఉంటాయి. అంత మాత్రాన ఇంత చవకబారు ఎత్తుగడలు వేస్తారా అన్న చర్చ కూడా జరుగుతోంది. అసలు సాధారణ మనస్తత్వం ఉన్నవారు ఎవరు ఇలా రక్తాన్ని బయటికి తీసి రాతలు రాయరని, అసలాయన మీద కేసు పెట్టాలని డిమాండ్‌ చేసేవాళ్ళు సైతం ఉన్నారట. బుద్దా వెంకన్న భక్తి ఏమోగానీ.. ఏకంగా అధినేతకే చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరించారనే టాక్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.

బుద్దాను అర్బన్ జిల్లా అధ్యక్షునిగా చేసి.. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చి, ఉత్తరాంధ్ర జిల్లాల వ్యవహారాలు అప్పజెప్పి.. ప్రాధాన్యం ఇస్తే… ఇప్పుడాయన చేసిన పని పార్టీ అధినాయకత్వాన్ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసినట్టు కాదా అని ప్రశ్నిస్తున్నారు నేతలు. రక్తం ధారపోస్తే తప్ప టీడీపీలో పదవులు దక్కవనే చర్చను తన చర్యల ద్వారా బుద్దా లేవనెత్తినట్టు కాదా అని కూడా ప్రశ్నిస్తున్నాయి పార్టీ వర్గాలు. ఇదే మాట ఆయన దగ్గర అంటే.. నాకు తెలిసింది ఇదే.. నేనిలాగే చేస్తాను.. నేనేమీ చంద్రబాబుకు బ్లాక్‌మెయిల్‌ చేయడంలేదని అన్నట్టు తెలిసింది. మరి రక్త తర్పణాలతో చంద్రబాబుకు చెడ్డపేరు వస్తుంది కదా..? అంటే.. నేను చంద్రబాబుకు.. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడ్డం లేదు కదా..? అని రివర్స్‌ అవుతున్నారట బుద్దా. చూడాలి ముందు ముందు ఇంకెన్ని సిత్రాలు సూపిస్తారో.