TDP-JANASENA: ఇక్కడ కుస్తీ.. అక్కడ దోస్తీ.. కూకట్‌పల్లిలో జనసేనకు వ్యతిరేకంగా టీడీపీ గ్రౌండ్‌ వర్క్‌..?

టీడీపీ, జనసేన పొత్తు తెలంగాణలో కనిపించడంలేదు. చంద్రబాబు అరెస్ట్‌ తరువాత తెలంగాణలో కూడా టీడీపీ యాక్టివ్‌ అయ్యేందుకు ప్రయత్నించింది. అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ ప్రకటించారు.

  • Written By:
  • Publish Date - November 14, 2023 / 06:29 PM IST

TDP-JANASENA: జనసేన, టీడీపీ రాజకీయ పొత్తు ఏపీకి మాత్రమే పరిమితమా..? స్టేట్‌ బోర్డర్‌ దాటితే ఇద్దరూ శతృవుల్లానే భావించుకుంటారా..? జనసేన సంగతి ఏమో కానీ, కొందరు తెలంగాణ టీడీపీ నేతల ప్రవర్తన చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది. ఏపీలో జనసేన, టీడీపీ పొత్తులో ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని కూడా కాదని టీడీపీతో పొత్తు పెట్టుకుంది జనసేన పార్టీ. చంద్రబాబు అరెస్ట్‌ తరువాత అక్కడ రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారిపోయాయి.

Janasena: జగనన్న విద్యా కానుకలో రూ.120 కోట్ల అవినీతి.. జనసేన ఆరోపణ..

దీంతో టీడీపీ, జనసేన పొత్తు అనివార్యమైంది. ఐతే ఈ రెండు పార్టీల మధ్య ఇదే మైత్రి తెలంగాణలో కనిపించడంలేదు. చంద్రబాబు అరెస్ట్‌ తరువాత తెలంగాణలో కూడా టీడీపీ యాక్టివ్‌ అయ్యేందుకు ప్రయత్నించింది. అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ ప్రకటించారు. కానీ దీనికి టీడీపీ హైకమాండ్‌ ఒప్పుకోలేదు. దీంతో ఎన్నికలకు ఆ పార్టీ దూరమయ్యింది. కానీ అనూహ్యంగా బీజేపీ పొత్తుతో జనసేన పార్టీ తెరపైకి వచ్చింది. పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 8 సీట్లు కేటాయించింది బీజేపీ. అందులో కూకట్‌పల్లి కూడా ఒకటి. తెలంగాణలో జనసేన పార్టీ గెలిచే చాన్స్‌ ఉన్న ఏకైక నియోజకవర్గం కూకట్‌పల్లి. అక్కడ గెలిస్తే తెలంగాణలో జనసేన ఖాతా తెరిచినట్టే. కానీ అక్కడి నుంచి బరిలో దిగుతున్న ప్రేమ్‌సాగర్‌ బీజేపీ నుంచి జనసేనలోకి వచ్చారు. కానీ లోకల్‌ టీడీపీ నేతలు మాత్రం ఇంకా ఆయనను బీజేపీ వ్యక్తిగానే చూస్తున్నట్టు సమాచారం. ఈ కారణంగానే కూకట్‌పల్లిలో జనసేన పార్టీకి టీడీపీ కేడర్ అసలు సహకరించడంలేదట.

ఇండైరెక్ట్‌గా జనసేన అభ్యర్థిని ఓడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు టాక్‌. ఏపీలో పొత్తులో ఉండి.. తెలంగాణలో ఇలా చేయడంతో.. రెండు పార్టీల పొత్తుపై అనేక విమర్శలు వస్తున్నాయి. టీడీపీ, జనసేన పొత్తు కేవలం ఏపీకి మాత్రమే పరిమితమని.. తెలంగాణలో రెండు పార్టీలు శతృవులే అనే వాదన వినిపిస్తున్నాయి. తెలంగాణలో టీడీపీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవడంతో ఆ ఓట్‌బ్యాంక్‌ మొత్తం జనసేనకు వెళ్తుందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు రెండు పార్టీల మధ్య ఉన్న పరిస్థితి చూస్తే.. టీడీపీ తమ్ముళ్లు కాంగ్రెస్‌కు మద్దతు తెలిపే సూచనలు కనిపిస్తున్నాయి. ఫైనల్‌గా ఎవరిని అసెంబ్లీకి పంపిస్తారో చూడాలి.