Devineni Uma: దేవినేనికి టికెట్ ఇవ్వకపోవడానికి.. అసలు కారణం ఇదేనా ?

మైలవరంలో దేవినేని ఉమాకు టికెట్ ఇవ్వకపోవడంపై.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌ అవుతోంది. వైసీపీ నుంచి వలస వచ్చి వసంత కృష్ణప్రసాద్‌కే మళ్లీ టికెట్ ఇచ్చారు చంద్రబాబు. దేవినేని ఉమాను ఎందుకు పక్కన పెట్టారు..? టికెట్ ఎందుకు ఇవ్వలేదు..?

  • Written By:
  • Publish Date - March 22, 2024 / 06:19 PM IST

Devineni Uma: ఏపీలో టీడీపీ అభ్యర్థుల ప్రకటన దాదాపు ఫైనల్ అయింది. ఇప్పటికీ మూడు లిస్ట్‌లు అనౌన్స్ చేశారు. సీనియర్లలో చాలామందిని దూరం పెట్టారు. ఇంకొన్ని స్థానాలు పెండింగ్‌లో ఉన్నా.. సీనియర్లకు చాన్స్ దక్కుతుందన్న హోప్ అయితే లేదు. దీంతో ఆలపాటి రాజాలాంటి వాళ్లు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఐతే మైలవరంలో దేవినేని ఉమాకు టికెట్ ఇవ్వకపోవడంపై.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌ అవుతోంది. వైసీపీ నుంచి వలస వచ్చి వసంత కృష్ణప్రసాద్‌కే మళ్లీ టికెట్ ఇచ్చారు చంద్రబాబు.

MLC KAVITHA: కవితకు మరో షాక్.. బెయిల్ ఇవ్వలేమన్న కోర్టు..

దేవినేని ఉమాను ఎందుకు పక్కన పెట్టారు.. టికెట్ ఎందుకు ఇవ్వలేదు.. దేవినేని ఏం చేయబోతున్నారు.. చంద్రబాబు ఎలాంటి హామీ ఇస్తారు.. ఇలా చాలా చర్చే జరుగుతోంది ఇప్పుడు. దేవినేని ఉమా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీకి బలమైన గొంతుకగా ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా.. ఉమా ఏమాత్రం భయపడకుండా అధికార పార్టీపై పోరాటం చేశారు. అలాంటి నాయకుడిని పక్కన పెట్టడమంటే బలమైన కారణం ఉండి ఉంటుందన్న కామెంట్స్ పార్టీ నేతల్లో వినిపిస్తున్నాయ్. నిజానికి మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్‌ పార్టీలో చేరడానికి ముందు ఆయనతో పాటు దేవినేని ఉమా పేరుతో మైలవరంలో సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో దేవినేని ఉమాకు నెగిటివ్ వచ్చిందా అందుకే.. ఆయనను పక్కన పెట్టారా అనే చర్చ జరుగుతోంది. మైలవరం టీడీపీలో గ్రూప్‌ వార్ పెరిగిపోయిందని.. అందుకే ఉమాను పక్కన పెట్టారని కొందరు అంటుంటే.. ఇంకొందరు మాత్రం మరో వాదన తెరమీదకు తీసుకువస్తున్నారు.

దేవినేని ఉమా.. ఆర్థికంగా వీక్‌ అయ్యారని.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల్లో ఖర్చు పెట్టే స్థాయిలో లేరని అందుకే టికెట్‌ ఇవ్వలేదని కొందరు అంటున్నారు. ఏమైనా అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా జిల్లాలో చక్రం తిప్పిన దేవినేని ఉమాకు చివరకు ఈసారి సీటు లేకుండా పోయిందని.. దేవినేని ఉమా వర్గం ఆవేదన వ్యక్తం చేస్తోంది. అవసరం అయితే ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేయాలని.. అనుచరులు ఆయన మీద ఒత్తిడి తీసుకువస్తున్నారు.