TDP SEATS: మొత్తం 94స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించగా.. నియోజకవర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్. కొన్ని చోట్ల అసంతృప్త జ్వాలలు కనిపిస్తుంటే.. మరికొన్ని ప్రాంతాల్లో సంబరాలు రీసౌండ్ ఇస్తున్నాయ్. టీడీపీ ఫస్ట్ లిస్ట్ సంచలనాలకు కేరాఫ్‌గా ఉంది. సీనియర్లను, సిట్టింగ్‌లను పక్కనపెట్టి మరీ.. జాబితా రిలీజ్ చేశారు చంద్రబాబు. వీళ్ల విషయంలో ఆయన నిర్ణయం ఎలా ఉంటుందనే చర్చ జరుగుతుండగానే.. ఇద్దరు మహిళా నేతలకు టికెట్ విషయంలో టీడీపీ అధినేత అన్యాయం చేశారనే చర్చ జరుగుతోంది.
PAWAN KALYAN: ఎంపీగా పవన్..? పవన్ నిర్ణయంతో పిచ్చెక్కిపోతున్న జనసైనికులు
ఒకప్పుడు టీడీపీలో కీలకంగా ఉన్న ఎర్రన్నాయుడు కూతురు ఆదిరెడ్డి భవానీతో పాటు.. చింతపూడి నుంచి టికెట్ ఆశించిన పీతల సుజాతకు నిరాశే మిగిలింది. టికెట్ ఇవ్వకుండా ఆదిరెడ్డి భవానిని చంద్రబాబు వంటింటికే పరిమితం చేశారంటూ కొత్త రచ్చ మొదలైంది. రాజమండ్రి సిటీ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న భవానిని తప్పించి.. ఆ టికెట్ ఆమె భర్త వాసుకు ఇచ్చింది టీడీపీ. రాజమండ్రి సిటీ అనేది.. టీడీపీకి కంచుకోట. 2019 ఎన్నికల్లో వైసీపీ మేనియాలోనూ.. ఈ స్థానంలో సైకిల్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ఐతే భవాని పనితీరు సరిగా లేదు కాబట్టే.. ఆమెను తప్పించి వాసుకు టికెట్ ఇచ్చారనే చర్చ జరుగుతున్నా.. మరికొన్ని అనుమానాలు మాత్రం అలానే ఉన్నాయ్. వాసు మీద చాలా ఆరోపణలు ఉన్నాయ్. ముఖ్యంగా చిట్‌ఫండ్ కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు కూడా ! మరి ఇది ప్రభావం చూపిస్తుందా లేదా అన్న సంగతి ఎలా ఉన్నా.. ఎర్రన్న కూతురు ఇక వంటింటికే పరిమితం కావడం ఖాయం.
TDP-JANASENA LIST: యూత్ ఓట్ల కోసమే.. 63మంది డిగ్రీ-30 మంది పీజీ.. అయినా యువతకి దక్కని సీట్లు !
ఇక చింతలపూడి నుంచి మాజీ మంత్రి పీతల సుజాత టికెట్ ఆశించి.. భంగపడ్డారు. ఇక్కడి నుంచి సొంగ రోషన్‌కు సైకిల్ పార్టీ టికెట్ దక్కింది. 2014లో గెలిచి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సుజాతకు.. 2019లో టికెట్ దక్కలేదు. ఐతే ఈసారి అయినా అవకాశం వస్తుంది అనుకుంటే.. మళ్లీ మొండిచేయే మిగిలింది. టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా పార్టీని అంటిపెట్టుకున్న వారిలో పీతల సుజాత ఒకరు. చంద్రబాబు అరెస్ట్ సమయంలోనూ.. టీడీపీ తరఫున గట్టిగా గళం వినిపించారు. ఐనా సరే ఈమెకు కూడా టికెట్ దక్కకపోవడం కొత్త చర్చకు కారణం అవుతోంది. ఒకరకంగా ఇద్దరి అన్యాయమే జరిగిందని అనుకుంటున్నారు కొందరు. మరి ఇది పార్టీ మీద క్షేత్రస్థాయిలో ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.