TDP SECOND LIST: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల రెండో జాబితాను తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేసింది. మొత్తం 34 మంది పేర్లను ప్రకటించింది. ఏపీలో పొత్తుల్లో భాగంగా జనసేన, బీజేపీకి కేటాయించిన సీట్లు పోగా.. టీడీపీ 144 అసెంబ్లీ స్థానాల్లో 17 పార్లమెంటు సీట్లల్లో పోటీ చేయనుంది. మొదటి జాబితాలో 94 మందిని, సెకండ్ లిస్టులో 34 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇంకా పెండింగ్‌లో ఉన్న 16 స్థానాలను ఫైనల్ లిస్టులో ప్రకటించనుంది. టీడీపీ రెండో జాబితా వచ్చినా సీనియర్ల సీట్లపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది.
PAWAN KALYAN: పిఠాపురం నుంచి బరిలోకి జనసేనాని.. ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న పవన్
తమకు టిక్కెట్లు ఇస్తారా లేదా అన్న టెన్షన్‌లో ఉన్నారు సీనియర్ లీడర్లు. గంటా శ్రీనివాసరావు పోటీ ఎక్కడ్నుంచి అన్నది ఇంకా తేల్చలేదు. ఆయన్ని చీపురుపల్లిలో బొత్సాకు పోటీగా నిలబడాలని కోరారు చంద్రబాబు. కానీ గంటా భీమిలి సీటు అడుగుతున్నారు. దాంతో ప్రస్తుతం ఈ రెండు సీట్లకు అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి పెందుర్తి సీటు డౌటే అంటున్నాయి పార్టీ వర్గాలు. ఈ సీటును జనసేన కోరుతోంది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పోటీ చేస్తారని తెలుస్తోంది. ఎచ్చెర్లలో కళా వెంకట్రావు, పలాస కావాలని గౌతు శిరీష అడుగుతున్నా క్లారిటీ ఇవ్వలేదు. కళా వెంకట్రావుని విజయనగరం ఎంపీగా నిలబడమని చంద్రబాబు కోరినట్టు గతంలో వార్తలు వచ్చాయి. కానీ ఆ సీటు పొత్తులో భాగంగా బీజేపీ అడుగుతోంది. దానిపై స్పష్టత లేకపోవడంతో ఎచ్చెర్ల ప్రకటించలేదని తెలుస్తోంది. సర్వేపల్లి సీటు కూడా పెండింగ్‌లో పెట్టారు.
MALLAREDDY: డీకే శివకుమార్‌తో మల్లారెడ్డి భేటీ.. రేవంత్ అంటే భయం తగ్గలేదా..?
ఇక్కడ సీనియర్‌నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడీగా ఉన్నారు. నెల్లూరు సిటీ టిక్కెట్‌ను మాజీ మంత్రి నారాయణ ఆశిస్తున్నారు. ఆయన పేరు కూడా ప్రకటించలేదు. అనంతపురంలో బి.కె.పార్థసారథి ఎంపీగా పోటీ చేస్తారా లేక ఎమ్మెల్యేగానా అన్నదానిపైనా సస్పెన్స్ కొనసాగుతోంది. సెకండ్ లిస్టులోనూ మైలవరం, పెనమలూరు అసెంబ్లీ స్థానాలను కూడా పెండింగ్ పెట్టింది టీడీపీ అధిష్టానం. మైలవరంలో దేవినేని ఉమ పోటీ చేస్తారా లేదా..? లేక వేరే చోట నుంచి దింపుతారా అన్నదానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ రెండు సీట్లల్లో అభ్యర్థుల ఎంపికపై టీడీపీ అధిష్టానంపై తీవ్ర ఒత్తిడి ఉంది. మైలవరం కోసం సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, మాజీ మంత్రి దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు మధ్య పోటీ ఉంది. పెనమలూరు సీటు కోసం కమ్మ, మైనార్టీ నేతల పేర్లు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ నుంచి చంద్రబాబు సన్నిహితులు బరిలోకి దిగుతారని అంటున్నారు.
ఈ సీటు కోసం కమ్మ వర్గం నుంచి టీడీపీ అధిష్టానంపై తీవ్ర ఒత్తిడి ఉంది. దేవినేని ఉమా, తుమ్మల చంద్రశేఖర్, బోడే ప్రసాద్, ఎమ్మెస్ బేగ్ లాంటి వారి పేర్లు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. రెండో జాబితాలో సీట్లు దక్కని సీనియర్లలో కే ఎస్ జవహర్, ఆలపాటి రాజా, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ కూడా ఉన్నారు. ఇంకా 16 చోట్ల మాత్రమే టీడీపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వీటిల్లో అయినా సీనియర్లకు చోటు దక్కుతుందా లేదా అన్నది చూడాలి.