TDP-JANASENA: టీడీపీ అభ్యర్థుల రెండో జాబితాను గురువారం విడుదల చేయనున్నట్లు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వెల్లడించారు. గురువారం వీలైనన్ని ఎక్కువ సీట్లలో అభ్యర్థుల్ని ప్రకటిస్తామన్నారు. అమరావతిలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. టీడీపీ ఇప్పటికే 94 చోట్ల అభ్యర్థుల్ని ఖరారు చేసింది. మరో యాభై చోట్ల అభ్యర్థుల్ని ఖరారు చేయాల్సి ఉంది. పొత్తులో భాగంగా బీజేపీ, జనసేన పార్టీలకు 31 సీట్లు కేటాయించారు.
BJP SECOND LIST: బీజేపీ రెండో జాబితా విడుదల.. తెలంగాణ నుంచి ఆరుగురి పేర్లు ఖరారు
ఇందులో జనసేన 21 స్థానాల్లో, బీజేపీ 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది. మిగిలిన 144 సీట్లలో టీడీపీ పోటీ చేస్తుంది. చాలా మంది సీనియర్ లీడర్లు టీడీపీ టిక్కెట్ల కోసం ఎదురు చూస్తున్నారు. మొదటి జాబితాలో సీనియర్ల పేర్లు ప్రకటించలేదు. మరోవైపు జనసేన తొలి జాబితాలో ఐదుగురి పేర్లను ప్రకటించింది. తర్వాత ఆరో అభ్యర్థిగా నిడదవోలు నుంచి కందుల దుర్గేష్‌ను ఖరారు చేశారు. మొత్తం 21 స్థానాల్లో ఇంకా 15 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. పోటీ చేసే అభ్యర్థులకు క్లారిటీ ఇస్తున్నారు. తాజాగా మరో ఐదు స్థానాలకు సంబంధించి క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. భీమవరం, నరసాపురం, ఉంగుటూరు, తాడేపల్లి గూడెం, రాజోలు స్థానాలకు పవన్ అభ్యర్థుల్ని ఖరారు చేశారు. తాజా సమాచారం ప్రకారం.. భీమవరం నుంచి రామాంజనేయులు, రాజోలు నుంచి వరప్రసాద్, నరసాపురం నుంచి బొమ్మిడి నాయకర్, ఉంగుటూరు నుంచి ధర్మరాజు, తాడేపల్లి గూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్లను పవన్ ఖరారు చేశారు.
వీరి పేర్లను పవన్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. జనసేన మొదట 24 అసెంబ్లీ సీట్లలో, 3 పార్లమెంట్ సీట్లలో పోటీ చేస్తుందని ప్రకటించినా.. తర్వాత బీజేపీతో పొత్తు వల్ల 3 అసెంబ్లీ సీట్లు, 1 పార్లమెంట్ స్థానాలు త్యాగం చేయాల్సి వచ్చింది. దీంతో జనసేన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లోనే పోటీ చేయనుంది. మరోవైపు.. బీజేపీలో అభ్యర్థుల ఎంపిక కొనసాగుతోంది. పార్టీలో కొంతమంది నేతలు అధిష్టానం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.