TDP Vs YSRCP: రివర్స్‌ గేమ్‌ మొదలుపెట్టిన టీడీపీ.. జగన్‌కు చుక్కలు కనిపించడం ఖాయమా..?

చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై ఏపీలో జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబును అరెస్ట్ చేశారంటూ టీడీపీ శ్రేణులు రోడ్డెక్కాయ్ ఆ మధ్య! చంద్రబాబు భార్య, కోడలు.. అందరూ వైసీపీ టార్గెట్‌గా కార్కక్రమాలు నిర్వహించారు.

  • Written By:
  • Publish Date - December 30, 2023 / 02:58 PM IST

TDP Vs YSRCP: ప్రతీ సీన్‌ క్లైమాక్స్‌లా కనిపిస్తోంది ఏపీలో రాజకీయం. రేపే ఎన్నికలు అన్న రేంజ్‌లో ప్రధాన పార్టీల మధ్య యుద్ధం కనిపిస్తోంది. వైనాట్‌ 175 నినాదంతో దూసుకుపోతున్న జగన్‌.. ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ అధికారంలోకి రావాలని పావులు కదుపుతున్నారు. దీనికోసం కఠిన నిర్ణయాలకు కూడా సిద్ధం అవుతున్నారు. చాలామంది సిట్టింగ్‌ల స్థానాలు మారుస్తున్నారు. మరికొందరిని పక్కనపెడుతున్నారు. ఇక అటు సైకిల్ పార్టీ కూడా తగ్గేదేలే అంటోంది.

Grandhi Srinivas: పవన్ కల్యాణే కావాలి.. భీమవరంలో గ్రంథి శ్రీనివాస్..!

పవన్ ఇంటికి వెళ్లి మరీ.. చంద్రబాబు స్వయంగా పొత్తులు, సీట్ల పంపకాల మీద మాట్లాడారు. రాజకీయం సెగలు కక్కుతున్న వేళ.. టీడీపీ భారీ వ్యూహం రచించింది. వైసీపీ తీరును జనాల్లో నిలదీసేందుకు కోర్టుకెక్కుతోంది. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై ఏపీలో జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబును అరెస్ట్ చేశారంటూ టీడీపీ శ్రేణులు రోడ్డెక్కాయ్ ఆ మధ్య! చంద్రబాబు భార్య, కోడలు.. అందరూ వైసీపీ టార్గెట్‌గా కార్కక్రమాలు నిర్వహించారు. ఐతే చంద్రబాబు అరెస్ట్‌ను ఆయుధంగా చేసుకొని.. ఇప్పుడు వైసీపీపై రివర్స్ గేమ్‌ మొదలుపెట్టింది టీడీపీ. ఏపీలో సీఐడీ, ఇంటెలిజెన్స్ అధికారులు ముఠాగా ఏర్పడి తమ పార్టీని వేధిస్తున్నారంటూ.. టీడీపీ నేతలు కోర్టుకెక్కుతున్నారు. ఇదే సాక్ష్యం అంటూ.. టీడీపీ నేత కిలారు రాజేష్ హైకోర్టును ఆశ్రయించారు. స్కిల్ కేసులో తనను సాక్షిగా తెలిపిన సీఐడీ అధికారులు.. విచారణకు పిలిచి బెదిరించారని కిలారు రాజేశ్‌ సంచలన ప్రకటన చేశారు.

నిఘా చీఫ్ సీతారామారాంజనేయులు, సీఐడీ చీఫ్ సంజయ్ ఈ బెదిరింపులకు దిగారని ఆరోపించారు. చంపేస్తామని.. వ్యాపారాలను నాశనం చేస్తామని బెదిరించడమే కాకుండా.. తనపై దాడికి కుట్ర చేశారని, ఓ పోలీసు ఉద్యోగితో రెక్కీ కూడా నిర్వహించారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.