TDP IN RAYALASEEMA: సీమ పాలిటిక్స్.. సీమలో టీడీపీ రెబల్స్ రచ్చ.. ఈ సారైనా సైకిల్ తిరుగుతుందా..?

సీమలో టీడీపీ మొదటి జాబితాలోనే 29 సీట్లు ప్రకటించింది. కానీ జనసేన మాత్రం సీమ నుంచి ఇంకా ఎవర్నీ అనౌన్స్ చేయలేదు. టీడీపీ నుంచి గతంలో గెలిచిన ముగ్గురు కూడా వచ్చే ఎన్నికల్లో బరిలో ఉంటారు.

  • Written By:
  • Publish Date - February 24, 2024 / 05:49 PM IST

TDP IN RAYALASEEMA: ఆంధ్రప్రదేశ్‎‌లో ప్రభుత్వ ఏర్పాటులో ఈసారి కూడా రాయలసీమ సీట్లు కీలకం. ఇక్కడి నాలుగు ఉమ్మడి జిల్లాల్లోని 52 సీట్లల్లో గతంలో వైసీపీ 49 గెలుచుకుంది. 2014, 2019లో వరుసగా ఇక్కడ వైసీపీదే హవా. ఇప్పుడు సీమ ఏరియాలో కొంత టీడీపీకి ఓట్లు టర్న్ అవుతాయని అంటున్నారు. అందుకే సీమలో టీడీపీ మొదటి జాబితాలోనే 29 సీట్లు ప్రకటించింది. కానీ జనసేన మాత్రం సీమ నుంచి ఇంకా ఎవర్నీ అనౌన్స్ చేయలేదు. టీడీపీ నుంచి గతంలో గెలిచిన ముగ్గురు కూడా వచ్చే ఎన్నికల్లో బరిలో ఉంటారు. కుప్పంలో చంద్రబాబు, హిందూపురంలో నందమూరి బాలకృష్ణ, ఉరవకొండలో పయ్యావుల కేశవ్ మళ్ళీ పోటీ చేస్తున్నారు.

TDP-BJP: కమలంతో దోస్తీ.. ఏపీలో బీజేపీకి టిక్కెట్లు ఎన్ని..?

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 7, కడప జిల్లాలో 4 స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఒక్కో జిల్లా నుంచి 9 మంది అభ్యర్థుల చొప్పున అనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు. రాయలసీమలో మాజీ మంత్రులు అమర్నాథ్ రెడ్డి, భూమా అఖిలప్రియ, కాల్వ శ్రీనివాసులు, ఫరూక్, పరిటాల సునీత, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి టికెట్లు ప్రకటించారు. అనంతపురం జిల్లాలో మాత్రం.. మొత్తం 14 సీట్లల్లో 9 స్థానాలకే టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. మరో ఐదు సీట్లు పెండింగ్‌లో పెట్టింది. అనంతపురం అర్బన్‌, ధర్మవరం, పుట్టపర్తి, కదిరి, గుంతకల్‌ సీట్లు హోల్డ్‌లో ఉన్నాయి. వీటిల్లో టీడీపీ ఏయే స్థానాల్లో అభ్యర్థులను అనౌన్స్ చేస్తుంది. లేదంటే బీజేపీ, జనసేనకు ఇస్తుందా.. అన్నది సస్పెన్స్‌‌గా మారింది. అనంతపురం అర్బన్‌ సీటు కావాలని జనసేన అడుగుతోంది. ఇక్కడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి ఉన్నప్పటికీ.. జనసేన అడిగితే త్యాగానికి రెడీ అంటున్నారు.

JANASENA KAPU COMMUNITY: కస్సుమంటున్న కాపులు.. జనసేనకు 24 సీట్లపై రగిలిపోతున్న కాపులు

ఇక పరిటాల శ్రీరామ్.. ధర్మవరం టీడీపీ ఇంఛార్జిగా ఉన్నారు. ఫస్ట్ లిస్ట్‌లో ఆయన పేరు లేదు. సెకండ్ లిస్టులో వచ్చే అవకాశాలు కూడా లేవు. ఎందుకంటే.. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి బీజేపీ నుంచి పోటీకి రెడీ అవుతున్నారు. టీడీపీ-కమలం దోస్తీ ఉంటే.. ఈసారి పరిటాల శ్రీరామ్ రెస్ట్ తీసుకోక తప్పదు. గుంతకల్‌ సీటుని గుమ్మనూరు జయరాం కోసం రిజర్వ్‌ చేసి పెట్టారట. ఆయన వైసీపీ నుంచి రేపో మాపో టీడీపీలోకి రాబోతున్నట్టు తెలుస్తోంది. పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి ఛాన్స్ ఇవ్వలేదు టీడీపీ. ఇక్కడ బీసీ అభ్యర్థిని దించాలని చూస్తోంది. కదిరి నుంచి వైసీపీ ముస్లిం అభ్యర్థిని ప్రకటించింది. దాంతో టీడీపీ ప్రస్తుతం ఎవరి పేరూ ప్రకటించలేదు. కానీ ముస్లిమ్ క్యాండిడేట్‌కే అవకాశాలున్నాయి. శ్రీసత్యసాయిజిల్లాలోని పెనుకొండలో టీడీపీలో టిక్కెట్ల రచ్చ మొదలైంది. చంద్రబాబుకి వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు రోడ్డెక్కారు.

సవితకు టిక్కెట్ ప్రకటించడాన్ని మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి వర్గం వ్యతిరేకిస్తోంది. చంద్రబాబు ఫ్లెక్సీలను తగలబెట్టారు. పార్థసారథి అయితే బోరున ఏడ్చేశారు. కల్యాణదుర్గం టీడీపీలో కూడా గొడవ మొదలైంది. ఇక్కడ సురేంద్రబాబు పేరును చంద్రబాబు అనౌన్స్ చేయగా.. హనుమంతరాయ వర్గం కోపంగా ఉంది. ఇక్కడ చంద్రబాబు ఫ్లెక్సీలు చినిగిపోయాయి. టీడీపీ జెండాలు మాయం అయ్యాయి.