Teenmar Mallanna: తీన్మార్‌ మల్లన్న భార్యకు తుంగతుర్తి టికెట్‌!?

కాంగ్రెస్‌ పార్టీకి ఇలాంటి సమస్యాత్మక నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటే తుంగతుర్తి. ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థానంగా ఉన్న ఈ సెగ్మెంట్‌ నుంచి.. రీసెంట్‌గా కాంగ్రెస్‌లోకి వచ్చిన తీన్మార్‌ మల్లన్న భార్య మమతకు టికెట్‌ ఇవ్వబోతున్నట్టు కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

  • Written By:
  • Publish Date - November 8, 2023 / 06:15 PM IST

Teenmar Mallanna: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న కాంగ్రెస్‌ (congress) పార్టీ.. టికెట్ల విషయంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ అంటేనే సీనియర్‌ రాజకీయ నేతలకు అడ్డా. ప్రతీ నియోజకవర్గం నుంచి ముగ్గురు నలుగురు అభ్యర్థులు ఉంటారు ఈ పార్టీలో. అలాంటి పార్టీలో టికెట్ల కేటాయింపు అంటే అంత ఈజీ మ్యాటర్‌ కాదు. ఒకరికి టికెట్‌ ఇచ్చి ఇంకొకరికి హ్యాండ్‌ ఇస్తే.. ఎలక్షన్‌ టైంలో ఓట్‌బ్యాంక్‌ చీలిపోతుంది. కాంగ్రెస్‌ పార్టీకి ఇలాంటి సమస్యాత్మక నియోజకవర్గాలు చాలా ఉన్నాయి.

Teenmar Mallanna: అంతన్నావ్‌.. ఇంతన్నావ్‌.. కాంగ్రెస్‌లో చేరావ్‌.. వాటీజ్ దిస్ మల్లన్న..

అందులో ఒకటే తుంగతుర్తి. ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థానంగా ఉన్న ఈ సెగ్మెంట్‌ నుంచి.. రీసెంట్‌గా కాంగ్రెస్‌లోకి వచ్చిన తీన్మార్‌ మల్లన్న భార్య మమతకు టికెట్‌ ఇవ్వబోతున్నట్టు కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చాలా కాలం నుంచి బీఆర్‌ఎస్‌తో పాటు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిపై విమర్శలు చేస్తున్న తీన్మార్‌ మల్లన్న (Teenmar Mallanna).. చివరికి కాంగ్రెస్‌ పార్టీలోనే జాయిన్‌ అయ్యాడు. మేడ్చల్‌ నుంచి పోటీ చేస్తానంటూ ముందు నుంచీ మల్లన్న చెప్తూనే ఉన్నాడు. కానీ ఇప్పటికే మేడ్చల్‌ టికెట్‌ వేరే వ్యక్తికి ఇచ్చేసింది కాంగ్రెస్‌ పార్టీ. దీంతో తుంగతుర్తి టికెట్‌ తీన్మార్‌ మల్లన్న భార్యకు ఇస్తే రెండు విషయాల్లో కాంగ్రెస్‌ పార్టీకి కలిసి వచ్చే చాన్స్‌ ఉంది. తుంగతుర్తి నుంచి టికెట్‌ ఆశిస్తున్న నేతలు చాలా మంది ఉన్నారు. అద్దంకి దయాకర్‌, ప్రీతం, పిడమర్తి రవి, మోత్కుపల్లి నర్సింహులు.. ఇలా చాలా మంది ఇక్కడి నుంచి ఎమ్మెల్యే టికెట్‌ ఆశిస్తున్నారు. వీళ్లలో ఎవరినీ కాదనలేని పరిస్థితిలో కాంగ్రెస్‌ పార్టీ ఉంది. మల్లన్న భార్య ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మహిళ.

TELANGANA CONGRESS: చార్మినార్‌ స్థానం ఎందుకు పెండింగ్‌.. కాంగ్రెస్‌ అసలు ప్లాన్ తెలిస్తే షాక్ అవుతారు..

తుంగతుర్తి సీట్‌ కూడా ఎస్సీ రిజర్వ్‌డ్‌. దీంతో ఈ స్థానాన్ని ఆమెకు కేటాయిస్తే పార్టీలోకి వచ్చినందుకు మల్లన్నకు టికెట్‌ ఇచ్చినట్టు ఉంటుంది.. తుంగతుర్తిలో వర్గపోరుకు బ్రేక్‌ వేసినట్టు అవుతుందనే కాలిక్యులేషన్‌లో కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అభ్యర్థులందరినీ ప్రకటించినా.. తుంగతుర్తి అభ్యర్థిని మాత్రం పెండింగ్‌లో ఉంచారు. ఇప్పుడు ఆ స్థానంలో మల్లన్న భార్య మమత పేరును ప్రకటించబోతున్నట్టు తెలుస్తోంది. నామినేషన్‌ గడువు ముగియకముందే మమత పేరు ప్రకటిస్తారని చర్చ జరుగుతోంది. మరి కాంగ్రెస్‌ నిర్ణయానికి తుంగతుర్తి నేతలు కట్టుబడి ఉంటారా.. లేక వేరే ఆప్షన్‌ చూసుకుంటారా అనేది చూడాలి.