Telangana assembly elections : అహంకారమే BRSను దెబ్బతీస్తోందా..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు మూడు అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. అభివృద్ధి, అవినీతి, అహంకారం. ప్రజలు మొదటి రెండు అంశాల గురించి పెద్దగా ఆందోళన చెందడంలేదు.. చర్చించడం లేదు కూడా. కేసీఆర్ సర్కార్ తొమ్మిదిన్నరేళ్ళల్లో అసలేమీ అభివృద్ధి చేయలేదని ఎవరూ అనరు. హైదరాబాదులో విజిబుల్ డెవలప్మెంట్ క్లియర్ గా కనిపిస్తోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు మూడు అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. అభివృద్ధి, అవినీతి, అహంకారం. ప్రజలు మొదటి రెండు అంశాల గురించి పెద్దగా ఆందోళన చెందడంలేదు.. చర్చించడం లేదు కూడా. కేసీఆర్ సర్కార్ తొమ్మిదిన్నరేళ్ళల్లో అసలేమీ అభివృద్ధి చేయలేదని ఎవరూ అనరు. హైదరాబాదులో విజిబుల్ డెవలప్మెంట్ క్లియర్ గా కనిపిస్తోంది. రాష్ట్రంలో నీటిపారుదల, వ్యవసాయ రంగాలు కూడా అభివృద్ధి చెందాయి. అదే టైమ్ లో రాష్ట్రంలో అవినీతి కూడా విపరీతంగా పెరిగింది. ఆ అవినీతిని కూడా జనం పెద్దగా పట్టించుకోవట్లేదు. రాజకీయ ఆరోపణలు తప్ప అవినీతిపై చర్చ జరుగుతున్న సందర్భాలు చాలా తక్కువే. అధికారంలో ఉన్నవాళ్ళు ఎవడు తినడు..? అందరూ తింటారు. కాంగ్రెస్ వస్తే మాత్రం అవినీతి ఆగుతుందన్న గ్యారంటీ లేదు కదా… వాళ్లు కూడా తింటారు అని మాట్లాడుకుంటున్నారు జనం. ఈ ఎన్నికల్లో అవినీతిపైనా పెద్దగా చర్చ జరగడం లేదు. అసలు తెలంగాణలో చర్చ అంతా అహంకారంపైనే. కేసీఆర్ గానీ, ఆయన కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు ఈ 10 ఏళ్లలో ప్రదర్శించిన అహంకారం, తీసుకున్న నిరంకుశ నిర్ణయాలపై
తెలంగాణ జనం రగిలిపోతున్నారు.

 2047 Vision Hyderabad : తెలంగాణలో ఎక్కడికైనా గంటలోనే.. కొత్త ప్రాజెక్ట్‌ ప్రతిపాదించిన కేటీఆర్‌

సహజంగానే తెలంగాణ సమాజం పెత్తందారీ విధానాన్ని, రాజరిక ధోరణిని భరించలేదు. దొర తనాన్ని అస్సలు సహించలేదు. కానీ కెసిఆర్ చేసిన పనులన్నీ రాజరిక వ్యవస్థను గుర్తు చేస్తూ వచ్చాయి. పరిపాలనతో జనానికి సంబంధం ఉండదు. ముఖ్యమంత్రి సచివాలయానికి రాకపోయినా అడిగే వాడే లేడు. అదేమని అడిగితే.. సీఎం ఎక్కడ ఉంటే అదే సెక్రటేరియట్ అని పొగరుబోతు సమాధానాలు చెప్పారు. కెసిఆర్ ప్రభుత్వం అంటే కొడుకు, కూతురు, మేనల్లుడు, తోడల్లుడి కొడుకు వీళ్లే. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటే.. దాన్ని అందరూ మూసుకొని భరించాల్సిందే. 2018లో అధికారంలోకి రాగానే కేవలం కేసీఆర్, హోంమంత్రి మహమూద్ అలీ మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. మూడు నెలల పాటు క్యాబినెట్ లేకుండానే ప్రభుత్వం నడిచింది. ప్రజాస్వామ్యంలో ఇలా ఎక్కడైనా జరుగుతుందా ? ఇలా ఎన్నో నిర్ణయాలు తెలంగాణలో రాజరిక వ్యవస్థనీ.. కేసీఆర్ కుటుంబ అహంకారాన్ని బయటపెట్టాయి.

Telangana Elections : 5 రోజుల్లో పోలింగ్‌.. KCRకు షాకిచ్చిన ఈసీ..

నిజామాబాద్ ఎంపీగా కవిత ఓడిపోతే వెంటనే ఆమెని ఎమ్మెల్సీ చేశారు. రూల్స్ కి విరుద్ధంగా హైదరాబాద్ JNTU వీసీగా సబ్జెక్టుతో సంబంధం లేని ప్రొఫెసర్ నరసింహారెడ్డిని తీసుకొచ్చి పెట్టారు. దీన్ని ప్రశ్నించే వాళ్లే కరువయ్యారు. సోషల్ మీడియాలో ఎవరైనా నోరెత్తితే కేసులు పెట్టి లోపలేయడమే. నాకు ఇష్టమైనది చేస్తా.. నాకు ఇష్టం వచ్చింది చేస్తా.. నన్ను ఏమైనా అంటే తెలంగాణను తిట్టినట్టే.. ఇది కేసీఆర్ స్టైల్ ఆఫ్ ఎమోషనల్ డ్రామా నడిపేవాడు.

కేటీఆర్ ని డీఫ్యాక్టో ముఖ్యమంత్రిగా ప్రొజెక్టు చేశారు. దాదాపు అన్ని శాఖలపై ఆయనే నిర్ణయం తీసుకునేట్లు చేశారు కేసీఆర్. టీఆర్ఎస్ ని BRS జాతీయ పార్టీగా మార్చి జనం సొమ్ముతో మహారాష్ట్ర టూర్లు చేసినా ఎవరూ నోరు ఎత్తే పరిస్థితి లేదు. పైగా అక్కడ పార్టీకి పనిచేసేవాళ్ళకు ఇక్కడి ప్రజల సొమ్ము లక్షల రూపాయల జీతం ఇచ్చుకుంటూ.. గవర్నమెంట్ అడ్వైజర్స్ గా నియమించారు. ఉపఎన్నికలు వస్తే బీఆర్ఎస్ నాయకులు డబ్బుల వరద పారించారు. ఉద్యమ సమయంలో అద్దె ఇంట్లో ఉన్న కవిత బంజారాహిల్స్ లో 200 కోట్ల విలువైన 6 వేల గజాల ఇంట్లోకి మారడాన్ని బట్టి తెలంగాణలో నయా రాజరిక వ్యవస్థ ఎలా ఏర్పడిందో అర్థమవుతుంది. ఇక తెరవెనక ఎంపీ సంతోష్ కుమార్ సృష్టించిన ఆర్థిక అరాచకం అంతా ఇంతా కాదు. తనని తాను పక్షి ప్రేమికుడిని.. గ్రీన్ రెవల్యూషన్ అని ఒక ఇంటలెక్చువల్ ప్రొజెక్షన్ ఇస్తూ.. పోలీసు వ్యవస్థను.. అడ్మినిస్ట్రేషన్ ని పూర్తిస్థాయిలో కంట్రోల్ లో పెట్టుకున్నాడు. చివరికి CI ట్రాన్స్ ఫర్ అయినా సంతోష్ చెబితినే జరగాలి అనే స్థాయికి వచ్చింది. కేటీఆర్ తాను తెలంగాణ సమాజానికి నవతరం హీరోగా.. తనని తాను ప్రజెంట్ చేసుకుంటూ నిత్యం సెమినార్లు.. స్టూడియోల్లో చర్చలతో బిల్డప్ ఇస్తూ వచ్చారు. ఎకరం 100 కోట్లకి ప్రభుత్వమే అమ్మి.. దాన్ని రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ గా ప్రచారం చేస్తుందంటే పరిస్థితి ఎంత దారుణమో ఆలోచించుకోవచ్చు. పత్రికలు రాయలేవు టీవీ చానల్స్ నోరెత్తలేవు.. సోషల్ మీడియాలో ఎవరైనా రాస్తే ఏదో కారణంతో వాళ్ళ లోపల వేసేయడమే. ఏకంగా 100 youtube చానల్స్ ని బీఆర్ఎస్ నాయకులు చెప్పుచేతల్లో పెట్టుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

కెసిఆర్ కుటుంబ సభ్యులు రకరకాల వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారు. డైరెక్టర్లు అయిపోయారు. వాళ్ల బినామీలు రియల్ ఎస్టేట్ సంస్థల్లో భాగస్వాములయ్యారు. ముఖ్యమంత్రికి నేను 6 శాతం కమీషన్ ఇచ్చానని ఒక మాజీ ఎంపీ బహిరంగంగా చెప్పాడంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. TSPSC పేపర్ లీకేజ్ వ్యవహారం ప్రభుత్వాన్ని బ్రష్టు పట్టించింది. ఎన్ని జరిగినా కేసీఆర్ ఏనాడు వాటిపై స్పందించలేదు. అసలు స్పందించాల్సిన అవసరం కూడా లేదు అని ఆయన అనుకున్నారు. ఈ అహంకారమే ఇప్పుడు బిఆర్ఎస్ పతనానికి కారణమవుతోంది.

లిక్కర్ స్కామ్ లో ఈడి దర్యాప్తు ఎదుర్కొన్న కవిత.. తనను అరెస్టు చేస్తే తెలంగాణ మహిళలందర్నీ అవమానించినట్టేనని ప్రకటించడం మరీ విడ్డూరం. అవినీతి ఆరోపణలకు, వాళ్ళ ఫెయిల్యూర్స్ కి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ముడి పెట్టడం కెసిఆర్ కుటుంబ అహంకార ధోరణిని బయటపెడుతోంది. ఇక ఎమ్మెల్యేలు, ఎంపీలు సగానికి పైగా రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా అవతారం ఎత్తారు. పోలీస్ వ్యవస్థ మొత్తం ఎమ్మెల్యే చెప్పుచేతల్లోకి వచ్చేసిందన్న విమర్శలూ ఉన్నాయి. ఎమ్మెల్యేలపై భూకబ్జాల ఆరోపణలు ఎన్నో వచ్చాయి. ఎకరం 100 కోట్లకు అమ్మి అదే అభివృద్ధి అని చెప్పుకొచ్చారు brs నేతలు. అందుకే అభివృద్ధిని, అవినీతిని జనం పట్టించుకోవడం లేదు. తెలంగాణలో మార్పు రావాలని కోరుకుంటున్నారు. సర్వేల్లో ఎవరైనా అడిగితే కెసిఆర్ కు రెండుసార్లు అవకాశం ఇచ్చాం కదా.. వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి చూద్దాం అని చెబుతున్నారు. జనం మనోభావాలను చూస్తే కెసిఆర్ కుటుంబ అహంకారాన్ని ఓటుతోనే కొట్టాలన్న ఆలోచన వాళ్లలో కనిపిస్తోంది.