T BJP: తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉండటంతో పార్టీలన్నీ అభ్యర్థుల జాబితా దిశగా కసరత్తు చేస్తున్నాయి. ఈ విషయంలో బీఆర్ఎస్ అన్ని పార్టీలతో కంపేర్ చేస్తే చాలా ముందుంది. ఇవాళో, రేపో తొలి జాబితా విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీల్లో కూడా ఫస్ట్ లిస్ట్ రెడీ అయింది. బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్‌లో 78మంది పేర్లు ఉంటాయని ప్రచారం జరుగుతుండగా.. కాంగ్రెస్ తొలి జాబితాలో 80 మంది పేర్లుండొచ్చు.
బీజేపీ విషయానికి వస్తే 39నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. బీజేపీలో ఎవరికి ఎక్కడి నుంచి అవకాశం కల్పిస్తారని ఉత్కంఠ కనిపిస్తుండగా.. సోషల్ మీడియాలో ఓ లిస్ట్ వైరల్ అవుతోంది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన లెక్క తీస్తే.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి పాల్వాయి హరీష్ బాబు, బోథ్ నుంచి సోయం బాపూరావు, నిర్మల్ నుంచి మహేశ్వర్ రెడ్డి, ముథోల్ నుంచి రామారావు పటేల్, ఖానాపూర్ నుంచి రమేష్ రాథోడ్‌కు టికెట్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బాన్సువాడ నుంచి యాలాద్రి, ఆర్మూర్ నుంచి ధర్మపురి అరవింద్, నిజామాబాద్ అర్బన్ నుంచి యెండల యెండల లక్ష్మీనారాయణకు టికెట్ దక్కబోతుందని తెలుస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ధర్మపురి నుంచి వివేక్, చొప్పదండి నుంచి బొడిగె శోభ, రామగుండం నుంచి సోమారపు సత్యనారాయణ, మంథని నుంచి సునీల్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, హుజూరాబాద్ నుంచి ఈటల రాజేందర్, వేములవాడ నుంచి తుల ఉమ లేదా చెన్నమనేని వికాస్‌కు టికెట్ దక్కే చాన్స్ ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో జహీరాబాద్ నుంచి దేశ్ పాండే, పటాన్‌చెరు నుంచి గడీల శ్రీకాంత్ గౌడ్, ఆంధోల్ నుంచి బాబూమోహన్, దుబ్బాక నుంచి రఘునందనరావు పోటీ చేయబోతున్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం నుంచి బూర నర్సయ్య గౌడ్, మహేశ్వరం నుంచి అందె శ్రీరాములు యాదవ్, రాజేంద్రనగర్ నుంచి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కుత్బుల్లాపూర్ నుంచి శ్రీశైలం గౌడ్, మల్కాజ్‌గిరి నుంచి రామచంద్రరావు, ఉప్పల్ నుంచి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. అటు ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో సికింద్రాబాద్ నుంచి మేకల సారంగపాణి, సనత్ నగర్ నుంచి మర్రి శశిధర్ రెడ్డి, గోషామహల్ నుంచి విక్రమ్ గౌడ్, ఖైరతాబాద్ నుంచి చింతల రామచందర్ రెడ్డి, అంబర్‌పేట్ నుంచి కిషన్ రెడ్డి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయ్. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మహబూబ్‌నగర్ నుంచి జితేందర్ రెడ్డి, కొల్లాపూర్ నుంచి సుధాకర్ రావు, అచ్చంపేట నుంచి సతీష్ మాదిగ, గద్వాల నుంచి డీకే అరుణ బరిలో ఉంటారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, సూర్యాపేట నుంచి సంకినేని వెంకటేశ్వరరావుకు టికెట్ కన్ఫార్మ్ అయినట్లు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్ వెస్ట్ నుంచి రావు పద్మ, వరంగల్ తూర్పు నుంచి ఎర్రబెల్లి ప్రదీప్ రావుకు టికెట్ ఖాయం అయినట్లు ప్రచారం జరుగుతోంది.