BRS: కేవలం ఏడుగురు మహిళలకే టికెట్లా.? ఇదేంటి సర్.?

చట్టసభల్లో 33శాతం మహిళా బిల్లును ఆమోదించాలని పార్లమెంట్‌ వెలుపల, లోపల పోరాడే బీఆర్‌ఎస్‌ సర్కార్‌.. రియాలిటీలో మాత్రం బీజేపీ, కాంగ్రెస్‌ రాష్ట్రాలకంటే ఘోరమైన మహిళా ప్రజాప్రతినిధులను కలిగి ఉంది.

  • Written By:
  • Updated On - August 22, 2023 / 12:00 PM IST

అందరికంటే ముందుగా సీఎం కేసీఆర్‌ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటి చేయనున్న అభ్యర్థుల జాబితాను ప్రకటించేశారు. 119 స్థానాల్లో 115 స్థానాలకు ఎవరు పోటి చేయనున్నారో చెప్పేశారు. ఈ 115మందిలో ఏడుగురు మహిళలకు టికెట్ ఇచ్చారు. దీనిపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్టున్నాయి. పార్లమెంట్‌, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలని ఇటీవల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలో ధర్నాకు దిగారు. రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. తాజాగా కవిత తండ్రి కేసీఆర్‌ సొంత పార్టీ, అధికార బీఆర్ఎస్ కేవలం ఎడుగురు మహిళలకు మాత్రమే టికెట్లు ఇవ్వడంపై అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నిజమే కదా?

మహిళా రిజర్వేషన్ల బిల్లులో బీఆర్‌ఎస్‌ చెప్పే మాటలు ఎంతో ఆదర్శవంతంగా ఉంటాయి. ఆడవాళ్ల కోసమే బతుకుతున్నట్టు బిల్డప్‌ ఇచ్చేలా ఉంటాయి. చేప్పేది ఒకటి చేసేదొకటి అన్నట్టు నడుస్తోంది బీఆర్‌ఎస్‌ సర్కార్‌ తీరు. పట్టుమని 10శాతం మంది మహిళా అభ్యర్థులను కూడా నిలబెట్టని బీఆర్‌ఎస్‌.. రిజర్వేషన్ల బిల్లుపై మాత్రం ధర్నాలు చేయడం.. పెద్ద పెద్ద ప్రసంగాలు ఇవ్వడం హిపోక్రసీ కాకపోతే మరేంటి? పార్టీ గెలవాలన్నదే అందరికి అల్టిమేట్‌ థింగ్‌. కేసీఆర్‌ అయినా.. యోగి ఆధిత్యనాథ్‌ అయినా పార్టీ గెలుపు కోసమే ఆలోచిస్తారు కానీ మహిళా రిజర్వేషన్ల బిల్లుపై బయట ప్రదర్శించేదంతా కపట నటకమే. మాట్లాడేవి పచ్చి అబద్ధాలే.

ఎప్పుడో 2010లో రాజ్యసభలో పాస్‌ అయిన మహిళా రిజర్వేషన్‌ బిల్లు.. ఇప్పటివరకు లోక్‌సభలో ఆమోదం పొందలేదు. 13ఏళ్లు గడిచిపోయాయి. ఎన్డీఏ కూటమితో సంబంధం లేకుండా బీజేపీకి సొంతంగా 300కు పైగా ఎంపీలున్నారు. కాంగ్రెస్‌ రెండో స్థానంలో ఉంది. అయినా ఆ బిల్లు ముందుకు కదలదు. ఇటు బీజేపీకి వ్యతిరేకంగా మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై పోరాడే యాంటి-మోదీ పార్టీలు తమ రాష్ట్రాల్లో మాత్రం మహిళలను ఏ మాత్రం పట్టించుకోవు. 19 రాష్ట్రాల చట్టసభల్లో 10 శాతం కంటే తక్కువ మహిళా ప్రజాప్రతినిధులున్నారు. దేశవ్యాప్తంగా అసెంబ్లీల్లో సగటున మహిళా ఎమ్మెల్యేల సంఖ్య కేవలం 8 శాతమే. 9శాతం కంటే తక్కువ మహిళా ఎమ్మెల్యేల కలిగి ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంది. మరి కేసీఆర్‌ కూతురు కవిత బీజేపీకి వ్యతిరేకంగా ఎందుకు ధర్నాలు చేస్తున్నట్టు?? ఇప్పుడుదే ప్రశ్నతో కవితను కార్నర్ చేస్తున్నారు కమలనాథులు.