CONGRESS: వాటెన్ ఐడియా కాంగ్రెస్..! 2024లో గ్రూప్స్ నోటిఫికేషన్లకు తేదీలు.. నిరుద్యోగుల ఓట్ల కోసం కాంగ్రెస్ ప్లాన్..

నిరుద్యోగుల ఓట్ల కోసం కాంగ్రెస్ అలాంటి ఇలాంటి ప్లాన్ కాదు.. బ్రహ్మాండమైన ఆలోచన చేసింది. తాము అధికారంలోకి వస్తే.. వచ్చే ఏడాదిలో ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వేస్తామో డేట్స్‌తో సహా ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల గోస అంతా ఇంతా కాదు.. లక్షల మంది నిరుద్యోగులు ప్రభుత్వ కొలువుల కోసం ఎదురు చూస్తున్నారు.

  • Written By:
  • Updated On - November 17, 2023 / 07:15 PM IST

CONGRESS: తెలంగాణ రాష్ట్రంలో TSPSC గ్రూప్ నోటిఫికేషన్లకు డేట్స్ రిలీజ్ అయ్యాయి. గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 దాకా ఒక్కో కేటగిరీ నోటిఫికేషన్‌ను.. వచ్చే ఏడాదిలో రెండు దఫాలుగా వేయనున్నారు. ఇదేంటి ఎన్నికల టైమ్‌లో నోటిఫికేషన్లకు డేట్స్ అనౌన్స్ చేయడం ఏంటి..? అసలు వచ్చేది ఏ ప్రభుత్వమో తెలియదు. ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి డేట్స్ ఎలా అనౌన్స్ చేస్తారని ఆశ్చర్యపోతున్నారా..? నిరుద్యోగుల ఓట్ల కోసం కాంగ్రెస్ అలాంటి ఇలాంటి ప్లాన్ కాదు.. బ్రహ్మాండమైన ఆలోచన చేసింది. తాము అధికారంలోకి వస్తే.. వచ్చే ఏడాదిలో ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వేస్తామో డేట్స్‌తో సహా ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల గోస అంతా ఇంతా కాదు.. లక్షల మంది నిరుద్యోగులు ప్రభుత్వ కొలువుల కోసం ఎదురు చూస్తున్నారు.

RAHUL GANDHI: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణలో కులగణన: రాహుల్ గాంధీ

రాష్ట్రంలో 2 లక్షలకు పైగా జాబ్స్ ఖాళీ ఉన్నా.. బీఆర్ఎస్ హయాంలో వేలల్లో కూడా భర్తీ కాలేదన్న విమర్శలున్నాయి. నిరుద్యోగ భృతి ఇస్తామన్న గులాబీ పార్టీ ఆ సంగతే మర్చి పోయింది. ఈ మేనిఫెస్టోలో కూడా ఉద్యోగాల భర్తీపై ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఉచిత పథకాలు, ఆసరా ఫించన్ దారులు, రైతుల ఓట్లతోనే గెలుస్తామన్న ఆశలు పెట్టుకుంది BRS. నిరుద్యోగులు ఓట్లేస్తారన్న నమ్మకం లేకపోవడంతో.. కనీసం బహిరంగ సభల్లోనూ సీఎం కేసీఆర్ ఆ ఊసే ఎత్తడం లేదు. అంతెందుకు.. TSPSC పేపర్ల లీకేజీలు, పేపర్లు అమ్ముకోవడంపై ఇప్పటి వరకూ ఒక్క ప్రకటన కూడా చేయలేదు సీఎం కేసీఆర్. BRS సర్కార్‌పై నిరుద్యోగులకు ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకుంటోంది కాంగ్రెస్. జాబ్ కేలండర్ ద్వారా రాష్ట్రంలో ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అభయహస్తం మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఉపాధి పరిశ్రమల స్థాపనకు ఆర్థిక సాయానికి హామీ ఇచ్చింది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి.. అధికారంలోకి రాక ముందే TSPSC ఉద్యోగాల భర్తీపై జాబ్ కేలండర్ ప్రకటించింది.

VIJAYASHANTHI: హస్తం గూటికి.. చెయ్యి అందుకున్న విజయశాంతి.. కాంగ్రెస్ ప్రచారంలో కీలక బాధ్యతలు
గ్రూప్ 1 పోస్టులకు 2024 ఫిబ్రవరి 1న నోటిఫికేషన్ ఇస్తామంటోంది. అలాగే గ్రూప్ 2 పోస్టులకు మార్చి 1న ఫస్ట్ ఫేజ్ నోటిఫికేషన్, డిసెంబర్ 15న సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని హస్తం పార్టీ ప్రకటించింది. గ్రూప్ 3 పోస్టులకు జూన్ 1న ఫేజ్ 1 నోటిఫికేషన్, డిసెంబర్ 1న సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. గ్రూప్ 4 నియామకాలకు జూన్ 1న, తర్వాత డిసెంబర్ 1న.. రెండు దఫాలుగా నోటిఫికేషన్ ఇస్తామంటోంది కాంగ్రెస్. అంటే గ్రూప్ 1 మినహా మిగిలిన కేటగిరీలో ఏడాదిలో 2 సార్లు నోటిఫికేషన్ ప్రకటిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది.

ఇవి కాకుండా.. మెగా డీఎస్సీ ద్వారా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు అన్నింటినీ భర్తీ చేస్తామంటోంది. ఇంకా కానిస్టేబుల్ పోస్టులకు వచ్చే ఏడాది మార్చి 1న, డిసెంబర్ 15న రెండుసార్లు యూనిఫామ్ జాబ్స్ నోటిఫికేషన్లు ఇస్తామని కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టోలో తెలిపింది. వైద్య, ఇంజినీరింగ్ లాంటి 13 విభాగాలకు చెందిన ప్రభుత్వ రంగాల్లోనూ ప్రకటనలు ఇస్తామంటోంది. ఆలూ లేదు.. సూలు లేదు అన్నట్టుగా కాంగ్రెస్ ముందస్తుగా నోటిఫికేషన్ల డేట్స్ ప్రకటించడం విడ్డూరంగా ఉందంటున్నారు బీఆర్ఎస్ లీడర్లు. కానీ కాంగ్రెస్ మాత్రం నిరుద్యోగుల ఓటర్లే టార్గెట్ గా వినూత్నరీతిలో ఈ ప్రకటన చేసినట్టు తెలుస్తోంది.