T CONGRESS: కాంగ్రెస్ ఎంపీ సీట్ల కోసం పెరిగిన డిమాండ్.. 17 స్థానాలకు 250 మంది దరఖాస్తు..

శనివారంతో ఈ గడువు ముగిసింది. ఇప్పటివరకు తెలంగాణలోని 17 నియోజకవర్గాలకు 250 మందికిపైగా దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు కూడా సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

  • Written By:
  • Updated On - February 3, 2024 / 08:21 PM IST

T CONGRESS: కాంగ్రెస్ పార్టీలో ఎంపీ సీట్ల కోసం భారీ డిమాండ్ కనిపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి, అధికారం చేపట్టిన నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో అనేక నియోజకవర్గాలకు తీవ్ర పోటీ ఏర్పడింది. లోక్‌సభ టిక్కెట్ల కోసం కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు స్వీకరించింది. శనివారంతో ఈ గడువు ముగిసింది. ఇప్పటివరకు తెలంగాణలోని 17 నియోజకవర్గాలకు 250 మందికిపైగా దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.

Jharkhand MLAs: హైదరాబాద్‌లో ఝార్ఖండ్ ఎమ్మెల్యేలు.. భారీ భద్రత.. కలిసేందుకు నో ఛాన్స్

ప్రభుత్వ ఉద్యోగులు కూడా సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు వర్సిటీ రిజిస్ట్రార్ రమేష్ భట్టు.. మహబూబాబాద్ సీటు కోసం దరఖాస్తు చేయగా, మాజీ DH గడల శ్రీనివాస్ సికింద్రాబాద్, ఖమ్మం సీటు కోసం దరఖాస్తు చేశారు. వరంగల్, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ సీట్లకు డిమాండ్ ఎక్కువగా కనిపించింది. అత్యధికంగా వరంగల్ కాంగ్రెస్ సీటు కోసం 40 మంది దరఖాస్తు చేసుకోవడం విశేషం. SC, ST రిజర్వుడ్ సీట్లకు కూడా గట్టి పోటీనే కనిపించింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు గెలిచింది ఈ నియోజకవర్గాల్లోనే. నల్గొండ, భువనగిరి, ఖమ్మం సీట్లపై పట్టు సాధించే పనిలో పార్టీ ముఖ్యనేతలున్నారు. పార్టీకి చెందిన సీనియర్ నేతలు, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులతో ఎంపీ టిక్కెట్ల కోసం దరఖాస్తు చేయించుకున్నారు. నల్గొండ సీటు కోసం జానారెడ్డి కుమారుడు రఘువీరాతోపాటురేవంత్ సన్నిహితుడు పటేల్ రమేష్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు.

భువనగిరి సీటు కోసం కోమటిరెడ్డి బంధువుల ప్రయత్నిస్తున్నారు. కోమటిరెడ్డి అన్న కుమారుడు పవన్, బంధువు చల్లూరి మురళీధర్ రెడ్డి, రేవంత్ సన్నిహితుడు చామల కిరణ్ దరఖాస్తు చేసుకున్నారు. ఖమ్మం పార్లమెంట్ సీటుకోసం కీలక నేతల నుంచి పోటీ ఎక్కువగా ఉంది. దీంతో ఇక్కడ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. పొంగులేటి, భట్టి కుటుంబం నుంచి కూడా ఈ సీటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అలాగే ఖమ్మంలో రేణుకా చౌదరి, రాజేంద్ర ప్రసాద్ కూడా దరఖాస్తు చేసుకున్నారు.