YS SHARMILA: లైట్ తీస్కో..! షర్మిల చేరికను పట్టించుకోని టి కాంగ్రెస్..

షర్మిల చేరిక ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఈ ముగ్గురు కాంగ్రెస్ హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉన్నారు. ఏపీ ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాకూర్ ఆధ్వర్యంలోనే విలీన కార్యక్రమం జరిగినా.. ఆ ఛాయలకు కూడా వెళ్ళలేదు వీళ్ళు.

  • Written By:
  • Publish Date - January 4, 2024 / 05:45 PM IST

YS SHARMILA: ఢిల్లీలోని AICC హెడ్ క్వార్టర్స్‌లో వైఎస్పార్‌టీపీని విలీనం చేసి, కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యారు వైఎస్ షర్మిల. ఈ కార్యక్రమానికి AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాకూర్, APCC చీఫ్ గిడుగు రుద్ర రాజు అటెండ్ అయ్యారు. కానీ అదే ఆఫీసులో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గానీ, ఇతర తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎవరూ ఆ ప్రోగ్రామ్‌కి హాజరు కాలేదు. వైఎస్సార్‌టీపీ అనేది తెలంగాణకు సంబంధించినది కదా.. ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం అంటే.. అది తెలంగాణకు సంబంధించిన అంశం. అయినా సరే..YSRTP విలీనం, కాంగ్రెస్‌లో షర్మిల చేరిక అంశంతో తమకు ఏ మాత్రం సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించారు సీఎం రేవంత్, తెలంగాణ కాంగ్రెస్ నేతలు.

REVANTH REDDY: మహిళలకు రేవంత్‌ శుభవార్త.. రూ.2500 అప్పటి నుంచే..

షర్మిల చేరిక ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఈ ముగ్గురు కాంగ్రెస్ హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉన్నారు. ఏపీ ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాకూర్ ఆధ్వర్యంలోనే విలీన కార్యక్రమం జరిగినా.. ఆ ఛాయలకు కూడా వెళ్ళలేదు వీళ్ళు. ఎందుకంటే.. అసలు వైఎస్సార్‌టీపీనీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని ప్రపోజ్ చేశారు షర్మిల. తనకు, అనుచరులకు కాంగ్రెస్ అసెంబ్లీ, పార్లమెంట్ టిక్కెట్లు కావాలని అడిగారు. కానీ షర్మిల తెలంగాణలో రాజకీయం చేయడం మొదటి నుంచీ ఇక్కడి కాంగ్రెస్ లీడర్లకు నచ్చలేదు. తెలంగాణ ప్రజల్లో షర్మిల పార్టీకి ఆదరణ లేదనీ.. ఆమెపై ఆంధ్ర ముద్ర ఉందని నమ్మారు. ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా.. షర్మిల వల్ల లాభం కాదు నష్టమే ఎక్కువ అని పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానంతో వాదించారు. షర్మిలను దూరం పెట్టడమే మంచిదైంది. లేకపోతే.. కాంగ్రెస్‌పై వ్యతిరేక ప్రచారానికి కేసీఆర్ చేతికి ఓ అస్త్రం దొరికేది. వైఎస్సార్ కూతురు అనే పేరును అడ్డం పెట్టుకొని… కేసీఆర్ కాంగ్రెస్ ని బద్నాం చేసేవాడని తెలంగాణ నేతలు చెబుతున్నారు.

India vs South Africa: దెబ్బ అదుర్స్ కదూ.. రెండో టెస్టులో సఫారీలు చిత్తు..

అలాంటి విమర్శలు, ఆరోపణలకు అవకాశం ఇవ్వకుండా రేవంత్ రెడ్డి మంచిపని చేశారని అంటున్నారు. షర్మిల రాకను అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా వ్యతిరేకించారు. తీరా ఇప్పుడు విలీన ప్రక్రియకు హాజరైతే.. ఆమెకు తెలంగాణలో ఏదైనా బాధ్యతలు ఇస్తారేమో అన్న సంకేతాలు జనంలోకి వెళ్తాయని కూడా కాంగ్రెస్ లీడర్లు భావించారు. అందుకే మీటింగ్‌కి వెళ్ళడం ఎందుకు.. జనంలో అనవసరపు అపోహలు సృష్టించడం ఎందుకని సైలెంట్ అయ్యారు. దాంతో షర్మిలను ఏపీ రాజకీయాల్లోకి పంపుతున్నారన్న సంకేతాలు పంపినట్టు అయింది. కేసీఆర్‌ను ఓడించడానికి.. వ్యతిరేక ఓటు చీలకూడదనే తాను పోటీ నుంచి తప్పుకున్నాననీ.. అందుకే తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిందని కూడా షర్మిల గొప్పలు చెప్పుకున్నా.. వాటిని ఇక్కడి నేతలెవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్నికలు ఎలాగూ అయిపోయాయి.

వైఎస్సార్‌టీపీని విలీనం చేసినా తమకు ఒరిగేదేమీ లేదన్న అభిప్రాయం తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఉంది. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. YSRTPలో షర్మిలను నమ్ముకొని దాదాపు 40 మంది దాకా తెలంగాణకు చెందిన నేతలు ఉన్నారు. వీళ్ళందరికీ కాంగ్రెస్ హైకమాండ్ న్యాయం చేస్తుందని షర్మిల భరోసా ఇచ్చారు. వీళ్ళకు ఆంధ్రప్రదేశ్‌లో పార్టీలో గానీ.. రేపు అధికారంలోకి వస్తే.. గిస్తే.. కార్పొరేషన్ పదవులు ఇవ్వడానికి గానీ ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఉండదు. మరి న్యాయం ఎలా జరుగుతుంది అంటే.. తమకు తెలంగాణలోనే కాంగ్రెస్‌లో పోస్టులు దక్కుతాయనీ.. కార్పొరేషన్ పదవుల్లోనూ అవకాశం ఇస్తారని షర్మిల అనుచరులు చెప్పుకుంటున్నారు. కానీ షర్మిల అన్నా.. ఆమె పార్టీ అన్నా గిట్టని సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళకి అవకాశం కల్పిస్తారా..? పార్టీ పదవులు, కార్పొరేషన్ పదవులు పంచిపెడతారా అన్నది డౌటే.