పొత్తుల ఎత్తులు రేపుతున్న రచ్చ.. తెలంగాణ రాజకీయాల్లో అంతా ఇంతా కాదు ! వచ్చే ఎన్నికల్లో హంగ్ ఖాయం అని.. ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌తో బీఆర్ఎస్ కలిసి తీరాల్సిందే అంటూ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు హాట్‌టాపిక్ అయ్యాయ్. తన మాటలు వక్రీకరించారని కోమటిరెడ్డి తర్వాత యూటర్న్ తీసుకున్నా.. నిప్పులేనిదే పొగ రాదు కదా అన్నది చాలా మందిలో వినిపిస్తున్న చర్చ! పాదయాత్ర పేరుతో రేవంత్ పడుతున్న కష్టాన్ని ఒక్క ముక్కతో బద్దలు చేశారు కోమటిరెడ్డి. ఇదంతా ఎలా ఉన్నా.. ఒంటరిగా కాంగ్రెస్ అధికారం దక్కించుకునే అవకాశం లేదు అన్న కోమటిరెడ్డి మాటలను.. అండర్‌లైన్ చేసుకొని మరీ అబ్జర్వ్ చేస్తున్నాయ్ రాజకీయవర్గాలు !
కోమటిరెడ్డి నోటి నుంచి ఈ మాట వినిపించినా.. కాంగ్రెస్‌లో సీనియర్లు అంతా ఇదే అభిప్రాయంతో ఉన్నారా అనే చర్చ జరుగుతోంది. కోమటిరెడ్డి మాటలపై పైపైన ఘాటుగా రియాక్ట్ అవుతున్నట్లు సీనియర్ నేతలు కనిపిస్తున్నా.. నిజానికి వాళ్ల మనసులో మాట కూడా ఇదే అనే చర్చ జరుగుతోంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు మరో 8 నెలల సమయం ఉంది. అంతర్గత కలహాలతో ఇన్నాళ్లు ఇబ్బందులు పడిన కాంగ్రెస్.. ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది. ఇప్పుడు స్పీడ్ పెంచి.. టాప్ గేర్ వేసినా.. ఈ ఎనిమిది నెలల్లో అధికారం దక్కించుకోవడం దాదాపు అసాధ్యమే ! పైగా ఓ వైపు బీజేపీ రోజురోజుకు స్ట్రాంగ్ అవుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల మధ్య.. బీఆర్ఎస్‌తో పొత్తుకే సీనియర్లు తహతహలాడుతున్నారా.. ఆ క్షణం కోసం ఎదురుచూస్తున్నారా అంటే.. వెంటనే కాదు అనడానికి అయితే లేదు అనే చర్చ జరుగుతోంది.
తమకు నష్టం జరిగినా పర్లేదు కానీ.. పార్టీలో ఆధిపత్యానికి దెబ్బపడుతుందంటే ఒప్పుకునే రకం కాదు కాంగ్రెస్‌లో సీనియర్లు ! రేవంత్ పేరు చెప్తేనే భగ్గుమంటున్న సీనయర్ నేతలు.. ఎట్టి పరిస్థితులు.. ఏ చిన్న క్రెడిట్ కూడా ఆయన ఖాతాలో పడకూడదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రేవంత్ మీద ఈ వ్యతిరేకతకు తోడు.. పార్టీ పరిస్థితి చూసి.. బీఆర్ఎస్‌తో పొత్తుకు వెళ్తేనే బెటర్ అనే ఆలోచనలో ఉన్నట్లు సీనియర్లు కనిపిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఎలాగూ ఒంటరిగా అధికారంలోకి రాలేము.. ఒంటరిగా ఉండి వరుసగా మూడోసారి అధికారానికి దూరం అయితే.. పార్టీ అడ్రస్ కూడా గల్లంతు అయ్యే ప్రమాదం ఉంటుంది. దీంతో అవకాశం ఉంటే… ఎన్నికల తర్వాత బీఆర్ఎస్‌తో పొత్తు ఉంటేనే బెటర్ అని.. భట్టి, ఉత్తమ్, జగ్గారెడ్డి, కోమటిరెడ్డిలాంటి నేతలు ఫిక్స్ అయినట్లు కనిపిస్తున్నారు. కోమటిరెడ్డి మనసులో మాట దాదాపు బయటపెట్టారు. జగ్గారెడ్డి గులాబీ పార్టీకి సానుకూలంగా కనిపిస్తున్నారు. ఉత్తమ్ సైలెంట్‌గా ఉన్నారు. భట్టి ఒక్కరే పైకి నిప్పులు కురిస్తున్నా.. అసలు వ్యవహారం తెరవెనక నడిపిస్తున్నారనే చర్చ ఉంది. ఐతే ఇది ప్రస్తుతానికి వారి ఆశ.. రాజకీయవర్గాల అంచనా మాత్రమే ! రాబోయే రోజుల్లో మలుపు తిరగబోయే రాజకీయం.. కీలక పరిణామాలకు కారణం కావడం ఖాయం అన్నట్లు కనపిసి