KCR: గెలుపుదేముంది.. ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది.. ఒక్కసారి ఓడిపోయి చూడు.. ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుందన్నది ఓ సినిమా డైలాగ్. అటు ఇటుగా కేసీఆర్‌కు, బీఆర్ఎస్‌కు ఇది పక్కాగా సరిపోయే డైలాగ్ అనిపిస్తోంది ఇప్పుడు ! ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు తర్వాత.. వరుసగా రెండుసార్లు అధికారం దక్కించుకొని.. సీఎం అయిన కేసీఆర్.. జనాలకు దూరం అయ్యారన్నది.. వందకు వంద శాతం నిజం.
SINGER MANGLI: ఫోక్ రాణికి మరో అరుదైన గౌరవం.. మీ ప్రేమకు ధన్యవాదాలంటూ మంగ్లీ పోస్ట్
పరిపాలన బాగున్నప్పుడు.. జనాలకు దగ్గరగా ఉండాలా ఏంటి అని.. బీఆర్ఎస్ నేతలు కవర్ చేసుకున్నా.. కేసీఆర్‌కు అహంకారం పెరిగింది, దొరల రాచరికం అనే ప్రచారాన్ని కాంగ్రెస్.. జనాల్లోకి సక్సెస్‌ఫుల్‌గా తీసుకెళ్లగలిగింది. కట్ చేస్తే.. అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీకి బొమ్మ కనిపించింది. అధికారం మారిపోయింది. కాంగ్రెస్ గద్దెనెక్కింది. ఐనా సరే.. బీఆర్ఎస్ నేతలు మాత్రం తగ్గినట్లు కనిపించలేదు ఇన్నాళ్లు ! కాంగ్రెస్ మోసపూరిత హామీలకు ఆశపడి.. ఒక్కశాతం ఓట్ల తేడాతో.. హస్తానికి అధికారం కట్టబెట్టారని ఇన్నాళ్లు కవర్ చేస్తూ వచ్చారు. ఐతే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయ్. ఇంకా అదే ప్రచారం వర్కౌట్ కాదు అనుకున్నారో.. కాంగ్రెస్‌కు చెక్ పెట్టాలని స్ట్రాటజీ సిద్ధం చేశారో కానీ.. జనంలో జనంలా కలిసిపోతున్నారు బీఆర్ఎస్ నేతలు. ముఖ్యంగా కేసీఆర్‌లో.. ఓటమి తీసుకొచ్చిన మార్పు క్లియర్‌గా కనిపిస్తోంది. ఎంతలో ఎంత మార్పు అంటూ జనాలు తెగ ముచ్చట్లు పెట్టుకుంటున్న పరిస్థితి. ప్రెస్‌మీట్ పెట్టి మీడియావాళ్ల మీద పంచ్‌లు వేసే కేసీఆర్.. ఇప్పుడు మీడియాను పిలిచి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇదీ మేము.. ఇదీ మా విధానం అని.. ఒకటికి పదిసార్లు టీవీల్లో చెప్పుకుంటున్నారు. ఇక్కడితో ఆగారా అంటే.. సోషల్ మీడియాలో అకౌంట్లు తెరిచేసి.. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల మీద యుద్ధం చేస్తున్నారు.
ఎంపీ ఎన్నికల ప్రచారానికి వెళ్తూ.. జనాలను ఫేస్ టు ఫేస్ కలుసుకుంటున్నారు. కష్టాలు తెలుసుకుంటున్నారు. రోడ్డు పక్కన టిఫినీలు చేస్తున్నారు.. కాఫీలు తాగుతున్నారు.. జనాలతో కాసేపు ముచ్చట్లు పెడుతున్నారు. ఖమ్మం ఎన్నికల ప్రచారంలో ఇలాంటి సీనే కనిపించింది. బీఆర్ఎస్ అభ్యర్థి తరఫున ప్రచారానికి వెళ్లిన కేసీఆర్.. రోడ్డు పక్కన హోటల్ దగ్గర ఆగి.. కాసేపు స్థానికులతో ముచ్చట పెట్టారు. ఇది ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. కేసీఆర్‌లో ఈ మార్పు అంతా చూసి.. ఇప్పుడు జనాల్లో రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ఇదేదో ముందు నుంచే జనంతో ఉంటే బాగుండేది కదా సారూ అంటూ కొందరు కామెంట్లు పెడుతుంటే.. ఓటమి నేర్పించే పాఠాలు అన్నీ ఇన్నీ కావు బాస్ అంటూ మరికొందరు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.