FILES MISSING: తెలంగాణ రాష్ట్రంలో అధికారం మారుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి పవర్ కాంగ్రెస్‌కు షిప్ట్ అవుతోంది. ఈ కీలక టైమ్‌లో సెక్రటరియేట్‌లో పాత ఫైళ్ళు మిస్ అవుతున్నాయన్న అనుమానాలు వస్తున్నాయి. సీఎంగా రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో.. పాత మంత్రులు తమ పేషీలను ఖాళీ చేస్తున్నారు. వాటిల్లో తమ వ్యక్తిగత వస్తువులు ఏవైనా ఉంటే తీసుకెళ్ళాలి. కానీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కొన్ని శాఖలకు చెందిన ఫైళ్ళు కూడా సెక్రటరియేట్ దాటి బయటకు పోతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే సీఎస్ శాంతి కుమారి అలెర్ట్ అయినట్టు తెలుస్తోంది. ఒక్క కాగితం కూడా మిస్ కావొద్దని ఆదేశించారని చెబుతున్నారు.
REVANTH REDDY: ఈ ఇద్దరితో చిక్కులేనా..? రేవంత్‌కు చిక్కులు తప్పవా..?
సెక్రటరియేట్‌లో గత రెండు రోజులుగా సెక్యూరిటీ తనిఖీలు స్ట్రిక్ట్‌గా జరుగుతున్నాయి. లోపలికి వెళ్ళేవారిని.. బయటకు వచ్చే వారిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. బయటకు వెళ్ళే వారి బ్యాగులను సెక్యూరిటీ సిబ్బంది ఆసాంతం పరిశీలిస్తున్నారు. కేసీఆర్ సర్కార్‌లోని మంత్రుల పేషీలు ఇప్పుడిప్పుడే ఖాళీ అవుతున్నాయి. దాంతో ప్రభుత్వానికి సంబంధించిన ఫైల్స్ మిస్ కాకుండా నిఘా పెంచినట్టు సమాచారం. అవసరమైతే పెన్ డ్రైవ్‌లు, కంప్యూటర్లు, ఇతర డిజిటల్ వస్తువులను కూడా స్వాధీనం చేసుకోవాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించినట్టు తెలుస్తోంది. ప్రతి పేషీల్లో కూడా మంత్రుల అనుచరులు ఏయే వస్తువులు తీసుకెళ్తున్నారో జీఏడీ అధికారులు లెక్కలు రాసుకుంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొన్ని శాఖలపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. భారీగా అవినీతి జరిగిందని విమర్శించిన శాఖల్లో నీటిపారుదల, రహదారులు, విద్యుత్ లాంటి కొన్ని కీలకమైనవి ఉన్నాయి. ఇప్పుడు ఈ శాఖల ఫైళ్ళు చేయిదాటిపోతే.. అక్రమాల గుట్టు కనుక్కోవడం కష్టమవుతుందని భావిస్తున్నారు. అదుకే సెక్రటరియేట్‌లోకి వచ్చే బీఆర్ఎస్ నేతలపై నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు మంత్రుల పేషీలు, CMO సెక్రటరీల దగ్గర ఉన్న ఫైళ్ళని ఆయా శాఖల కార్యదర్శులు స్వాధీనం చేసుకుంటున్నారు.
మంత్రి పేషీలకు వెళ్ళిన ఫైళ్ళన్నీ రిటర్న్ వచ్చాయా లేదా అన్నది చెక్ చేసుకుంటున్నారు. అలాగే కాన్ఫిడెన్షియల్ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయన్నది సీఎస్ శాంతి కుమారి ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి ప్రభుత్వంలో ఇలా ప్రభుత్వాలు మారినప్పుడు.. సెక్రటరియేట్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో పాత ఫైళ్ళు తగలబెట్టారన్న అపవాదులు ఉన్నాయి. ఇటీవల పర్యాటక శాఖ ఆఫీసు తగలబడినప్పుడు కూడా ప్రతిపక్షాలు ఇవే ఆరోపణలు చేశాయి. సీపీఐ నేత నారాయణ అయితే స్వయంగా తగలబడిన ఆఫీసును పరిశీలించి.. కొత్త ప్రభుత్వం వస్తుందన్న భయంతో తగలబెట్టారని ఆరోపణలు కూడా చేశారు. మళ్ళీ ఇలాంటి ఆరోపణలు రాకుండా.. సెక్రటరియేట్‌లో నిఘా పెంచారు.