KTR: హీరోయిన్‌ రష్మిక వీడియోపై కేటీఆర్‌ రియాక్షన్‌..

రీసెంట్‌గా ఓ నేషనల్‌ మీడియా నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ మీటింగ్‌కు కేటీఆర్‌ హాజరయ్యారు. ఆ సమావేశంలో వైరల్‌ ఇష్యూస్‌తో పాటు.. రష్మిక డీప్‌ఫేక్‌ వీడియో ప్రస్తావన కూడా వచ్చింది. ఈ వీడియో గురించి తాను కూడా విన్నానని.. ఇది చాలా దారుణమంటూ రియాక్ట్‌ అయ్యారు మంత్రి కేటీఆర్‌.

  • Written By:
  • Publish Date - November 8, 2023 / 06:07 PM IST

KTR: రష్మిక మందనా (RASHMIKA MANDANNA) డీప్‌ ఫేక్‌ (DEEP FAKE) వీడియో.. ప్రస్తుతం ఇంటర్నెట్‌‌లో ఇదే హాట్‌ టాపిక్‌. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అంతా ఈ వీడియో గురించి మండిపడుతున్నారు. ఏఐ ఇంత ప్రమాదకరమా అంటూ షాకవుతున్నారు. ఇదే వ్యవహారంపై తెలంగాణ ఐటీ మినిస్టర్‌ కేటీఆర్‌ (KTR) కూడా స్పందించారు. రీసెంట్‌గా ఓ నేషనల్‌ మీడియా నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ మీటింగ్‌కు కేటీఆర్‌ హాజరయ్యారు. ఆ సమావేశంలో వైరల్‌ ఇష్యూస్‌తో పాటు.. రష్మిక డీప్‌ఫేక్‌ వీడియో ప్రస్తావన కూడా వచ్చింది.

Devara: భయానికి మరో కొత్త పేరు దేవర.. 150 రోజుల్లో ఊచకోత

ఈ వీడియో గురించి తాను కూడా విన్నానని.. ఇది చాలా దారుణమంటూ రియాక్ట్‌ అయ్యారు మంత్రి కేటీఆర్‌. అద్భుతమైన టెక్నాలజీని ఇలాంటి పనులు చేసేందుకు కొందరు వాడుకోవడం చాలా దారుణమన్నారు. ఐటీ మినిస్టర్‌గా తనకు ఏఐ గురించి మంచి నాలెడ్జ్‌ ఉందన్నారు కేటీఆర్‌. ఏఐ సహాయంతో విప్లవాత్మక మార్పులు తీసుకురావొచ్చని, కానీ దాన్ని మంచి కోసం ఉపయోగించకుండా ఇలా సెలెబ్రిటీలు, సామాన్యుల జీవితాలతో ఆడుకోవడం ప్రమాదకరమంటూ చెప్పారు. సమాజంలో ఇలాంటి ఘటనలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయని.. టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉన్న కారణంగా దీన్ని కంట్రోల్‌ చేయడం కష్టంగా మారిందన్నారు. ఇలాంటి ఘటనలను కంట్రోల్‌ చేసేందుకు ఈ టెక్నాలజీ వాడకం విషయంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని కఠిన మార్గదర్శకాలు తీసుకువస్తే బాగుంటుందని తన అభిప్రాయాన్ని చెప్పారు.

Kamal Haasan: కాపీ క్యాట్.. మణిరత్నం మూవీ ఆ సినిమాకు కాపీనా..?

కొత్త చట్టాలు తీసుకువచ్చినా స్వాగతిస్తామని.. అలాంటి చట్టాలు వస్తే తెలంగాణలో అమలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఇలాంటి వీడియోల వల్ల సామాన్యుల జీవితాలు బలయ్యే ప్రమాదముందని చెప్పారు కేటీఆర్‌.