TELANGANA NOMINATIONS: పార్లమెంట్ బరిలో ఎంతమంది..? ఈ నియోజకవర్గంలోనే 114 మంది పోటీ

అన్ని స్థానాలకు కలిపి చివరి రోజైన గురువారం 632 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 893 మంది అభ్యర్థులు కలిపి.. 1488 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభమైంది.

  • Written By:
  • Publish Date - April 26, 2024 / 04:21 PM IST

TELANGANA NOMINATIONS: తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ స్థానాలకు గురువారం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మొత్తం 17 స్థానాలకు 893 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. తెలంగాణలో అత్యధిక నామినేషన్లు దాఖలైంది మల్కాజ్‌గిరి స్థానం నుంచి. ఇక్కడ ఏకంగా 114 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు.

PM MODI: ప్రధాని మోడీపై అనర్హత వేటు పడుతుందా..?

వీరిలో కొందరు ఒకటికంటే ఎక్కువ సెట్లు దాఖలు చేయడంతో మొత్తం 177 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో.. చివరి రోజైన గురువారం రోజే 61 మంది అభ్యర్థులు 91 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి మొత్తం 57 మంది నుంచి 85 సెట్ల నామినేషన్లు వేశారు. చేవెళ్ల ఎంపీ స్థానానికి మొత్తంగా 64 మంది నామినేషన్లు వేశారు. తెలంగాణలోని కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కూడా ఎన్నిక జరగబోతున్న సంగతి తెలిసిందే. ఇక్కడ 24 మంది అభ్యర్థులు 50 సెట్ల నామినేషన్లు వేశారు. అన్ని స్థానాలకు కలిపి చివరి రోజైన గురువారం 632 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 893 మంది అభ్యర్థులు కలిపి.. 1488 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుంది. వివిధ నియోజకవర్గాల వారీగా దాఖలైన నామినేషన్ల వివరాలివి.

మల్కాజిగిరి – 114
చేవెళ్ల – 64
పెద్దపల్లి – 63
భువనగిరి – 61
వరంగల్ – 58
సికింద్రాబాద్ – 57
హైదరాబాద్ – 57
నల్గొండ – 56
మెదక్ – 54
కరీంనగర్ – 53
ఖమ్మం – 45
నిజామాబాద్ – 42
మహబూబ్ నగర్ – 42
జహీరాబాద్ – 40
నాగర్ కర్నూల్ – 34
మహబూబాబాద్ – 30
అదిలాబాద్ – 23