ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది సిట్. ఇప్పటికే దీనికి సంబంధించి మంది నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వారి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని కాల్‌డేటాను పరిశీలించారు. పరీక్ష నిర్వహించిన సమయంలో ఎక్కువగా ఎవరెవరితో మాట్లాడారనే విషయాన్ని తెలుసుకొని.. వారందరికీ నోటీసులు జారీ చేశారు. నిందితులు ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డికి టీఎస్‌పీఎస్సీలో ఎవరు సహకరించారనే దానిపై సిట్ అధికారులు నజర్ పెట్టారు.
టీఎస్‌పీఎస్సీలో పనిచేస్తూ 10మందికి పైగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రాసి మెయిన్స్‌కు అర్హత సాధించినట్లు సిట్ అధికారులు ఇప్పటికే గుర్తించారు. వారిని ఆఫీస్‌కు పిలిచి విచారించారు. లీకేజీకి సంబంధించి దాదాపు 40మంది సిబ్బందికి కూడా అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇందులో కొందరికి 100 మార్కులకుపైగా వచ్చినట్లుగా తెలుస్తోంది. టీఎస్‌పీఎస్సీ నుంచి మరిన్ని వివరాలు రావాల్సి ఉన్నట్లు సమాచారం.
ఆ వివరాల వస్తే టీఎస్‌పీఎస్సీ సిబ్బంది ఎంతమంది గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాశారు… ఇందులో ఎంతమందికి వందకు పైగా మార్కులు వచ్చాయనే విషయంపై సిట్ అధికారులకు క్లారిటీ వచ్చేచాన్స్ఉంది. నిందితురాలు రేణుక, ఆమె భర్త పలువురు పోటీ పరీక్షల అభ్యర్థులతో పాటు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులతో మాట్లాడినట్టు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. రేణుక కాల్ డేటా ఆధారంగా అభ్యర్థులతో పాటు, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులకు నోటీసులు ఇచ్చే ఆలోచనలోఉన్నట్లుగా తెలుస్తోంది. పేపర్ లీకేజీ వ్యవహారంలో పెద్ద తలకాయ్ఎవరు అన్నది ఆరాతీసేందుకు అధికారులు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ వ్యవహారం అంటు రాజకీయంగానూ రచ్చ రేపుతోంది. బీఆర్ఎస్ టార్గెట్‌గా విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయ్.