లిక్కర్ స్కాంలో కవితపై ఆరోపణలు వచ్చిన్ప్పటి నుంచి ప్రతీ విషయంలో ఆమెకు అండగా నిలుస్తున్నారు అనిల్. రాజకీయాలకు దూరంగా ఉన్నా.. భార్య రాజకీయ భవిష్యత్తు కోసం పోరాడుతున్నారు. లిక్కర్ స్కాం విచారణ కోసం ఈడీ కార్యాలయానికి వచ్చిన కవితను హగ్ చేసుకుని ధైర్యం చెప్పారు అనిల్. మరుసటి రోజు విచారణకు కూడా ఆమె వెంటే ఈడీ ఆఫీస్‌కు వచ్చారు. లోపలికి వెళ్లేముందు భార్యను దగ్గరికి తీసుకుని ధైర్యం చెప్పారు. విచారణ సంగతి ఏమో కానీ వీళ్ల అనుబంధం చూసి అక్కడంతా ఎమోషనల్ అయ్యారు. కవిత, అనిల్‌ది చాలా అన్యోన్యమైన జంట. పాలిటిక్స్‌లో ఎంత బిజీగా ఉన్నా తన భర్తతో గడిపేందుకు తాను చాలా ఇష్టపడతానని కవిత చాలాసార్లు చెప్పారు.
బిజినెస్ విషయాల్లో బిజీగా ఉన్నా.. తన కోసం అనిల్ చాలా టైం కేటాయిస్తారంటూ తమ అనుబంధాన్ని పంచుకున్నారు. అయితే ఇప్పుడు కవిత ఎదుర్కుంటున్న పరిస్థితి చాలా డిఫికల్ట్. లిక్కర్ స్కాంలో కవితపై ఆరోపణ చేయని ప్రతిపక్ష నేత లేరు. అటు సోషల్ మీడియాలోనూ కవిత మీద చాలా ఆరోపణలు చేస్తున్నారు చాలామంది. ఎవరు తప్పన్నా.. ఎంతమంది విమర్శించినా.. కట్టుకున్న భార్యకు అండగా నిలబడ్డారు అనిల్. కేవలం ఈడీ విచారణే కాదు. స్కాంలో కవిత పేరు బయటికి వచ్చినప్పటి నుంచీ ఆమె వెంటే ఉంటూ ధైర్యం చెప్తున్నారు. బ్యాగ్రౌండ్ ఎంత పెద్దదైనా.. కట్టుకున్న భర్త పక్కనే ఉండి సపోర్ట్ చేయడంతో కవిత మరింత ధైర్యంగా విచారణ ఎదుర్కుంటున్నారు.