దీనికోసం ఎంత దూరం అయినా వెళ్లేందుకు.. ఎన్ని మెట్లు అయినా దిగేందుకు సిద్ధం అన్నట్లుగా కనిపిస్తోంది ఆయన తీరు ! వేస్తున్న అడుగులు, తీసుకుంటున్న నిర్ణయాలు.. చేస్తున్న ప్రకటనలు.. అదే చెప్తున్నాయ్ కూడా ! ఆయన ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. తెలియకుండానే పెరిగిపోతోంది జనాల్లో వ్యతిరేకత. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చాలామంది పనితీరుపై జనాలు గుర్రుగా కనిపిస్తున్నారు. ఐతే కేసీఆర్ మాత్రం సిట్టింగ్‌లకే సీట్లు అంటున్నారు. దీంతో రాబోయే ప్రమాదం కళ్లముందే కనిపిస్తున్న పరిస్థితి. ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతను బీజేపీ క్యాష్ చేసుకునేందుకు పావులు కదుపుతున్న వేళ.. కేసీఆర్ కీలక వ్యూహాన్ని అమల్లో పెట్టబోతున్నారనే చర్చ జరుగుతోంది.
తమ విజయానికి కాంగ్రెస్‌ను వాడుకోవడమే ఆ స్ట్రాటజీ ! కాంగ్రెస్ తరఫున పోటీ చేయబోయే కొందరి గెలుపు బాధ్యతలను కేసీఆర్, బీఆర్ఎస్ భుజాల మీదకు ఎత్తుకోనుందని తెలుస్తోంది. దాదాపు 20మంది కాంగ్రెస్ అభ్యర్థులకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఫండింగ్ చేయబోతున్నారనే వార్త.. తెలంగాణ రాజకీయవర్గాలను షేక్ చేస్తోందిప్పుడు ! కారు పార్టీ గెలవడం కష్టం అనుకున్న చోట.. ప్రభుత్వం మీద జనాల వ్యతిరేకత ఎక్కువగా ఉందని సర్వేలు అందిన చోట.. కేసీఆర్ ఈ స్ట్రాటజీ అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది.
అలాంటి 20 నియోజకవర్గాలను ఇప్పటికే కేసీఆర్ గుర్తించారని.. ప్లాన్ అమలు చేయడమే బ్యాలెన్స్ అనే ప్రచారం జరుగుతోంది. ఖమ్మంలో ముగ్గురు, మెదక్‌లో ఇద్దరు.. నల్గొండలో ముగ్గురు.. మహబూబాబాద్‌లో ఇద్దరు.. ఉమ్మడి వరంగల్‌లో ఇద్దరు.. ఇలా కాంగ్రెస్ నుంచి పోటీ చేయబోయే 20మందికి బీఆర్ఎస్ సాయం చేయబోతోంది. ఒక్కొక్కరికి దాదాపు 25కోట్లు ఫండింగ్ చేసేందుకు కేసీఆర్ సిద్ధం అయ్యారని టాక్. ప్రస్తుత రాజకీయ పరిణామాల మధ్య.. రాష్ట్రంలో ప్రస్తుతం హంగ్ ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే.. ఆ 20మంది సాయంతో కాంగ్రెస్‌ను చీల్చడమో.. లేదంటే కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయడమో అన్నది కేసీఆర్ ప్లాన్‌గా కనిపిస్తోంది.
నిజానికి 2018 ఎన్నికల తర్వాత కూడా జరిగింది అదే ! కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలందరినీ లాగేసి.. హస్తం పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేయగలిగారు. ఇప్పుడు అదే వ్యూహానికి మెరుగులు దిద్ది.. ఇంకాస్త పదును పెంచాలన్నది కేసీఆర్ స్ట్రాటజీ కనిపిస్తోంది. అధికారమే లక్ష్యంగా దూకుడు మీద కనిపిస్తున్న బీజేపీని అడ్డుకోవాలన్నా.. కమలం పార్టీ రెక్కలు విరిచేయాలన్నా ఇదే ఉత్తమ మార్గం అని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో బీఆర్ఎస్‌తో పాటు.. కాంగ్రెస్ నేతలను తమ వైపు లాక్కునేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈ ప్రాసెస్‌లో నెమ్మదిగా సక్సెస్ వైపు అడుగులు వేస్తోంది కూడా ! దీంతో కాంగ్రెస్‌కు ఫండింగ్ స్ట్రాటజీకి కేసీఆర్ తెర తీసినట్లు తెలుస్తోంది. నువ్ చేసే పని అవతలి వాళ్లు చేయగలిగితే.. వాళ్లనే చేయనివ్వడం బెటర్ అంటే ఇదే ! దీనికి సపోర్టుగా ఉండాలనే కేసీఆర్ ఫండింగ్‌కు సిద్ధం అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది.