Sangareddy BJP: సంగారెడ్డిలో మంటపెట్టిన బీజేపీ ఫైనల్‌ లిస్ట్‌.. పులిమామిడి రాజు కారుపై రాళ్ల దాడి..

నామినేషన్‌ వేసేందుకు సిద్ధమైన రాజేశ్వర్ దేశ్‌పాండే.. ఆఖరి నిమిషంలో టికెట్‌ రావడంలేదని తెలియడంతో ఒక్కసారిగా రగిలిపోయారు. రిటర్నింగ్‌ ఆఫీసర్‌ కార్యాలయం ముందు నానా హంగామా చేశారు. నేరుగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డికి ఫోన్‌ చేశారు.

  • Written By:
  • Publish Date - November 10, 2023 / 06:45 PM IST

Sangareddy BJP: బీజేపీ రిలీజ్‌ చేసిన ఫైనల్‌ లిస్ట్‌ సంగారెడ్డిలో మంటపెట్టింది. ఫైనల్‌ లిస్ట్‌లో దేశ్‌పాండే రాజేశ్వర్‌రావుకు టికెట్‌ కేటాయించిన పార్టీ అధిష్టానం.. చివరి నిమిషంలో ఆ టికెట్‌ను పులిమామిడి రాజుకు కేటాయించింది. నామినేషన్‌ వేసేందుకు సిద్ధమైన రాజేశ్వర్ దేశ్‌పాండే (Rajeshwar Deshpande).. ఆఖరి నిమిషంలో టికెట్‌ రావడంలేదని తెలియడంతో ఒక్కసారిగా రగిలిపోయారు. రిటర్నింగ్‌ ఆఫీసర్‌ కార్యాలయం ముందు నానా హంగామా చేశారు. నేరుగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డికి ఫోన్‌ చేశారు.

TELANGANA CONGRESS: బీసీ జపం మొదలుపెట్టిన కాంగ్రెస్‌.. బీసీలపై హామీల వర్షం..

టికెట్‌ ఇవ్వకపోతే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటానంటూ చెప్పారు. ముందు నుంచీ పార్టీకోసం కష్టపడ్డా ఎందుకు ఇంత మోసం చేశారంటూ నిలదీశారు. కొత్తగా వచ్చినవాళ్లకు ఎందుకు టికెట్‌ ఇచ్చారంటూ తన బాధను వెల్లబోసుకున్నారు. పార్టీ నుంచి బీఫాం తీసుకున్న పులిమామిడి రాజు.. నామినేషన్‌ వేసేందుకు రిటర్నింగ్‌ ఆఫీసర్‌ కార్యాలయానికి వచ్చారు. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు రాజు కారు మీద రాళ్ల దాడి చేశారు. దేశ్‌పాండే మనుషులే ఈ పని చేశారంటూ రాజు వర్గీయులు ఆరోపిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా సంగారెడ్డి రాజకీయం హీటెక్కింది.

మొన్నటి వరకూ బీఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్న పులిమామిడి రాజు.. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్‌ ఆశించారు. కానీ చివరికి చింతా ప్రభాకర్‌కు బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఖరారు చేయడంతో.. బీజేపీలో జాయిన్‌ అయ్యారు. బీజేపీలో ముందు నుంచి దేశ్‌పాండే అక్కడ సీనియర్‌ నేతగా ఉన్నారు. కానీ రీసెంట్‌గా వచ్చి రాజుకు టికెట్‌ ఇవ్వడంతో.. దేశ్‌పాండే వర్గీయులు మండిపడుతున్నారు.