పదో తరగతి పరిక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతిలో ఇంటర్నల్ మార్కుల ఎత్తేస్తూ ఆదేశాలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. 100 శాతం మార్కులకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. గతంలో 20 శాతం ఇంటర్నల్ మార్క్స్ విధానం అమలులో ఉండేది. గ్రేడింగ్ విధానంలో ఫలితాల నేపథ్యంలో ఇంటర్నల్ మార్క్స్ అవసరం లేదని భావించింది ప్రభుత్వం.
పదో తరగతి పరీక్షల కి 24 పేజీల సింగిల్ ఆన్సర్ బుక్ లేట్ లు ఇవ్వనున్నారు. ఈ మేరకు మార్చి 2025 లో జరిగే పరీక్షలకు ఏర్పాట్లు చేయాలంటూ ఆదేశాలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం.