థాంక్స్ బాలయ్య, బన్నీ కోసం సీఎం రేవంత్ తో మాట్లాడాడు…?

అల్లు అర్జున్ అరెస్టుతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అలాగే సినిమా పరిశ్రమ వాళ్ళు అలాగే జాతీయ మీడియా కూడా షాక్ అయింది. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత ఈ స్థాయి పరిస్థితి వస్తుందని ఎవరూ కలలో కూడా ఊహించుకోలేదు. ఒకరోజు పాటు జైల్లో ఉండాల్సిన దుస్థితి వస్తుందని కూడా ఎవరూ కలలేదు.

  • Written By:
  • Publish Date - December 14, 2024 / 06:35 PM IST

అల్లు అర్జున్ అరెస్టుతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అలాగే సినిమా పరిశ్రమ వాళ్ళు అలాగే జాతీయ మీడియా కూడా షాక్ అయింది. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత ఈ స్థాయి పరిస్థితి వస్తుందని ఎవరూ కలలో కూడా ఊహించుకోలేదు. ఒకరోజు పాటు జైల్లో ఉండాల్సిన దుస్థితి వస్తుందని కూడా ఎవరూ కలలేదు. ఇంకా అల్లు అర్జున్ అరెస్టు తర్వాత పరిస్థితిలు చాలా వేగంగా మారాయి. బన్నీని ఎలాగైనా బయటికి తీసుకురావాలని సినిమా పరిశ్రమ పెద్దలు అలాగే అల్లు అర్జున్ తరఫు లాయర్ నిరంజన్ రెడ్డి తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేశాడు.

14 రోజుల రిమాండ్ విధించిన తర్వాత కూడా అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ తో బయటికి తీసుకురావడం సంచలనమైంది. కోర్టులో సుదీర్ఘ వాదనల అనంతరం హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులోనే పిటీషన్ దాఖలు చేయాలని సూచించింది. అయితే ఇక్కడ అల్లు అర్జున్ కు నందమూరి బాలకృష్ణ అండగా నిలబడ్డారట. ప్రతి విషయంలో ఎప్పటికప్పుడు అల్లు అర్జున్ తండ్రి అరవింద్ తో మాట్లాడుతూ పలు సూచనలు సలహాలు చేశారట. అలాగే ప్రముఖ లాయర్ల సహకారం కావాలి అంటే తాను చూసుకుంటాను అంటూ హామీ ఇచ్చారట.

అలాగే అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డితో కూడా ఫోన్ చేసి మాట్లాడారట. ఇక కంగారుపడుతున్న అల్లు అర్జున్ తల్లితో కూడా వెంటనే బాలయ్య ఫోన్లో మాట్లాడారు. ఈ అంశానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో కూడా బాలకృష్ణ సంప్రదింపులు జరిపినట్టు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఆహాలో ప్రసారమయ్యే ఒక షో ద్వారా బాలకృష్ణ అల్లు కుటుంబానికి బాగా దగ్గరయ్యారు. ముఖ్యంగా అల్లు అర్జున్ కు ఆయన బాగా దగ్గర కావడం గమనార్హం. ఈ తరుణంలో అల్లు అర్జున్ ను బయటకు తీసుకొచ్చేందుకు బాలకృష్ణ కూడా తనవంతు ప్రయత్నాలు చేశారట.

అటు ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా ఆయన చర్చలు జరపటమే కాకుండా ప్రముఖ లాయర్లను అవసరమైతే తీసుకురావాలని అల్లు అర్జున్ విడుదలలో దయచేసి జపం చేయవద్దని కోరారట. అటు మెగాస్టార్ చిరంజీవి కూడా అల్లు అర్జున్ కుటుంబానికి అండగా నిలబడ్డారు. దాదాపు నాలుగు గంటల సేపు అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతోనే చిరంజీవి గడిపారు. అల్లు అర్జున్ భార్యకు అలాగే పిల్లలకు ధైర్యం చెబుతూ అక్కడే ఉండి నాలుగు గంటల తర్వాత ఆయన బయలుదేరి వెళ్లారు. ఇక నాగబాబు కూడా అక్కడే ఉన్నారు. ఏది ఎలా ఉన్నా అగ్ర హీరోలు అందరూ అల్లు అర్జున్ కు అండగా నిలబడటం చూసి పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.