వినేష్‌ ఫోగట్‌ గెలుపుకు ఆ బీజేపీ నేత కారణం

కాస్తలో ఒలిపింక్స్‌ గోల్డ్‌ మెడల్‌ మిస్‌ఐన స్టార్‌ రెజ్లర్‌ వినేష్‌ ఫోగట్‌ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. దాదాపు 6 వేల ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థిని ఓడించి విజయకేతనం ఎగురవేశారు.

  • Written By:
  • Publish Date - October 8, 2024 / 04:19 PM IST

కాస్తలో ఒలిపింక్స్‌ గోల్డ్‌ మెడల్‌ మిస్‌ఐన స్టార్‌ రెజ్లర్‌ వినేష్‌ ఫోగట్‌ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. దాదాపు 6 వేల ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థిని ఓడించి విజయకేతనం ఎగురవేశారు. ఇక్కడ వినేష్‌ విజయం మాత్రమే హైలెట్‌ కాదు. ఆమె గెలిచిన అసెంబ్లీ స్థానం కూడా చాలా స్పెషల్‌. ఈ ఎన్నికల్లో హర్యానా లోని జులానా అసెంబ్లీ స్థానం నుంచి వినేష్‌ పోటీ చేసింది. ఈ అసెంబ్లీ సెగ్మెంట్‌ దాదాపు 2 దశాబ్ధాల నుంచి కాంగ్రెస్‌కు అందని ద్రాక్షగా ఉంది. 19 ఏళ్ల నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థులు జులానా అసెంబ్లీలో గెలవలేకపోతున్నారు. కానీ వినేష్‌ మాత్రం చాలా సింపుల్‌గా ఈ అసెంబ్లీని గెలిచిన రాహుల్‌ గాంధీకి గిఫ్ట్‌గా ఇచ్చింది. అధికారం రాకపోయినా బీజేపీ మీద పోరాడే అవకాశాన్ని మాత్రం దక్కించుకుంది. నిజానికి చాలా కాలం నుంచే బీజేపీకి వ్యతిరేకంగా వినేష్‌ తన గొంతు వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో ఆమె సునాయాసంగా గెలవడానికి అది కూడా ఓ కారణం. స్పోర్ట్స్‌ అథారిటీలో వేధింపులు జరుగుతున్నాయంటూ గతంలో వినేష్‌ రోడ్డెక్కింది. తనతో పాటు హర్యానాకు చెందిన మరికొందరు రెజర్లు కూడా బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా రోడ్డెక్కారు. కానీ బీజేపీలో దాదాపు మోడీకి సమాన స్థాయిలో బ్రిజ్‌భూషణ్‌కు గ్రిప్‌ ఉంది. దీంతో బీజేపీ ఆయన మీద ఎలాంటి యాక్షన్‌ తీసుకోలేదు.

కోర్టు నుంచి కూడా బ్రిజ్‌భూషణ్‌కు అనుకూలంగానే తీర్పు వచ్చింది. ఆ తరువాత వినేష్‌ చేస్తున్న నిరసనల గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఒలింపిక్స్‌లో ఫైనల్స్‌కు చేరిన తరువాత మరోసారి దేశం మొత్తం చూపు వినేష్‌ మీదకు వెళ్లింది. ఇండియాకు గోల్డ్‌మెడల్‌ పక్కా అనుకుంటున్న సమయంలో బరువు కారణంగా వినేష్‌ అర్హత కోల్పోయింది. దీంతో ఒక్కసారిగా దేశం గుండె పగిలినంత పఅయ్యింది. వినేష్‌ కోసం ఇండియన్‌ లాయర్స్‌ ఎంతగా పని చేసినా మెడల్‌ మాత్రం దక్కించలేకపోయారు. దీని వెనక కూడా రాజకీయ ప్రమేయం ఉంది అనే ఆరోపణలు ఉన్నా.. వాటికి ఎలాంటి సాక్ష్యాలు లేవు. ఇలాంటి టైంలో కాంగ్రెస్‌లో చేరి పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చింది వినేష్‌. అప్పటి వరకూ సామాజికంగా బీజేపీని వ్యతిరేకించిన ఆమె రాజకీయంగా రంగ ప్రవేశం చేసింది. జులానా నుంచి టికెట్‌ తీసుకుని బీజేపీని ఓడించి చూపించింది. చాలా కాలంగా వినేష్‌ పోరాలం చూస్తున్న ప్రజలు ఆమెకె పట్టం కట్టారు. కాస్తలో మెడల్‌ కోల్పోయిన సెంటిమెంట్‌ కూడా వినేష్‌కు ఈ ఎన్నికల్లో బాగానే పనికివచ్చింది. మొన్నటి వరకూ వినేష్‌ ఏం మాట్లాడినా బీజేపీ గురించి ఓ అథ్లెట్‌ విమర్శించినట్టే లెక్క. కానీ ఇప్పుడు వినేష్‌ ఏం మాట్లాడినా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బీజేపీని ప్రశ్నించినట్టు లెక్క. మొన్నటి వరకూ రింగ్‌లో ఫైట్‌ చేసిన ఈ స్టార్‌ రెజ్లర్‌.. ఇక నుంచి అసెంబ్లీలో ఎలా ఫైట్‌ చేస్తుందో చూడాలి.